BigTV English

MLC Botsa: కరకట్టకు గండిపడితే కుట్ర కోణమైతదా..? అసలు ఏం మాట్లాడుతున్నావ్ సీఎం గారూ..??

MLC Botsa: కరకట్టకు గండిపడితే కుట్ర కోణమైతదా..? అసలు ఏం మాట్లాడుతున్నావ్ సీఎం గారూ..??

MLC Botsa Satyanarayana Serious on CM Chandrababu: ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది? వరద బాధితులకు కనీసం భోజనం అందిచడంలేదు. బాధితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై లేదా?. అధికార యంత్రాంగం ఏం చేస్తోంది..?


వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పుడు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టిందో చెప్పాలి. వరదలు వస్తున్నప్పుడు డు మానిటరింగ్ ఎందుకు చేయలేదు? గతంలోనూ ప్రకాశం బ్యారేజ్ కు 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పుడు మేం దగ్గరుండి మానిటరింగ్ చేశాం.

Also Read: విహార యాత్రల కోసం సీఎం, మంత్రులు ప్లాన్ చేసుకుంటూ.. వరద బాధితులను పట్టించుకోవట్లేదు: రోజా


చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. మేం ప్రశ్నిస్తుంటే మాపై బురదజల్లుతున్నారు. కరకట్టకు గండిపడితే కుట్ర కోణం అంటున్నారు. గతంలో కరకట్ట కొట్టుకుపోయి చంద్రబాబు ఇళ్లు మునిగిపోలేదా..? కృష్ణలంక దగ్గర గోడ కట్టాం కాబట్టే నష్టం తగ్గింది.

విజయవాడలో ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారో చెప్పాలి. ఎంతమందిని రిలీఫ్ క్యాంపులకు తరలించారో వివరాలు వెల్లడించాలి. చంద్రబాబు బస్సులో పడుకుంటే ఎవరికి లాభం?’ అంటూ బొత్స పేర్కొన్నారు.

Also Read: కాదంబరీ జెత్వానీ కేసు.. వైఎస్ జగన్‌పై షర్మిల సంచలన ఆరోపణలు

అధికార యంత్రాంగం అసలేం చేస్తోంది? మీరు, మీ సలహాదారులు ఏం చేస్తున్నారు..? బ్యారేజీని బోట్లు ఢీ కొంటే కుట్ర కోణం అంటున్నారు. అలా మాట్లాడడం సరికాదు. బాధ్యతమైన హోదాలో ఉన్న చంద్రబాబు అలా మాట్లాడొచ్చా..? బాబు ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. మేం ప్రశ్నిస్తుంటే మాపై బురద జల్లుతున్నారు.

వరదలో రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అమరావతి గ్రామాల్లో మూగజీవాలు వరదలో కొట్టుకుపోయాయి. కరకట్టకు వరద వచ్చిందా? రాలేదా? నాకు అనుమతి ఇవ్వండి.. ఇద్దరం కలిసి చూసొద్దాం. దాచేస్తే నిజాలు దాగవు’ అంటూ చంద్రబాబుపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూర్చోం.. : వరదలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

గత మూడు రోజుల నుంచి వరదలకు విజయవాడ పూర్తిగా అతలాకుతలమైతున్నది. ప్రజలు సర్వం కోల్పోయి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారికి కనీసం నీళ్లు, పాలు కూడా అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు వారికి కనీస అవసరాలు అందలేదు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు పార్టీ తరఫున కోటి రూపాయల సాయం అందించాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. రేపు తెల్లవారుజాము నుంచే పార్టీ నుంచి సహాయక కార్యక్రమాలను ప్రారంభిస్తాం. లక్ష పాల ప్యాకెట్లను ప్రజలకు పంపిణీ చేస్తాం. బాధితులకు ఏం సాయం అవసరమో తెలుసుకుని వాటిని అందజేసేందుకు కృషి చేస్తాం.

Related News

Vijayawada Loan Scam: బెజవాడలో కిలాడీ లేడీ.. లోన్లు ఇప్పిస్తానని రెండువేల మందికి టోకరా

Bhavani Rapido Success: భర్త అనారోగ్యం.. రాపిడో బైక్‌తో అండగా భవానీ.. ట్వీట్ చేసిన టిడిపి!

AP Govt decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ గ్రామాలపై బిగ్ ప్లాన్.. అదేమిటంటే?

India pension plan: 60 ఏళ్ల తర్వాత కూడా టెన్షన్ ఫ్రీ.. ఈ సూపర్ స్కీమ్ మీకు తెలుసా!

CM Chandrababu: మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

Free bus scheme: ఏపీలో ఫ్రీ బస్ “చిత్రాలు”.. తెలుసుకుంటే టెకననాలజీ అనేస్తారు!

Big Stories

×