Pulevendula: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్థంతి సందర్భంగా పులివెందులలో ఓ యువకుడు అక్కడికి వచ్చినవారిని ఆకట్టుకున్నాడు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పక్కనున్న ఆ యువకుడు ఎవరు? అతడిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్థంతి సందర్భంగా పులివెందులలో ఆయనకు ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. జగన్, షర్మిల వేర్వేరుగా తండ్రికి నివాళులు అర్పించారు. ఆ సమయంలో షర్మిల వద్ద ఓ యువకుడు కూర్చొన్నాడు. అందరి కళ్లు ఆ యువకుడిపై పడ్డాయి.
షర్మిల వద్ద కూర్చొన్నది ఎవరోకాదు ఆమె కొడుకు రాజారెడ్డి. అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటిలో బ్యాచులర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేశాడు. కాన్వకేషన్ కార్యక్రమానికి షర్మిల దంపతులు, విజయమ్మ హాజరయ్యారు. ప్రస్తుతం ఓ కంపెనీలో మాంచి పొజిషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
చదువు పూర్తి కాగానే చట్నీస్ వ్యవస్థాపకుడు ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియాని గతేడాది వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వైఎస్ఆర్ వర్థింతి సందర్భంగా ఘాట్ వద్ద ఎమోషన్ అయ్యాడు రాజారెడ్డి. స్టడీస్ అంతా అమెరికాలో జరగడంతో పెద్దగా అతడు ఎవరికీ తెలీదు.
ALSO READ: పైసా మే ప్రమోషన్ చిచ్చు..సాక్షి పత్రికపై కేసు
ప్రస్తుతం ట్రెండ్‌ని బాగా ఫాలో అవుతాడని అంటున్నారు దగ్గర బంధువులు. రాజారెడ్డి చేతిలో టాటూలు ఉన్నాయి. అఫ్‌కోర్సు.. అమెరికాలో అదొక ట్రెండ్ అనుకోండి అది వేరే విషయం. ఉన్నట్లుండి షర్మిలతో కొడుకు వైఎస్ ఘాట్ వద్దకు రావడంతో రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడా?
అన్న చర్చ అప్పుడే మొదలైంది. రాజారెడ్డి చాలా స్టయిలీష్‌గా ఉంటాడని, వెండితెరపై బాగా రాణిస్తాడని అక్కడికి వచ్చినవారు అనుకోవడం కనిపించింది. కొందరైతే రాజకీయాల్లోకి వస్తాడని అంటున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వారు చర్చించుకోవడం కనిపించింది. ఇంతకీ రాజారెడ్డి మనసులో ఏముందో?