E-Paper
Advertisement

150 ఏళ్ల చరిత్ర ఉన్న నాంపల్లి స్టేషన్ గురించి మీకు తెలుసా?

150 ఏళ్ల చరిత్ర ఉన్న నాంపల్లి స్టేషన్ గురించి మీకు తెలుసా?
Advertisement

Nampally Railway Station: ఒకప్పుడు హైదరాబాద్‌లో ప్రయాణమంటే.. గుర్రపు బండ్లు, ఎడ్లబండ్లే. అలాంటి సమయంలో.. నగరానికి రైలు వచ్చింది. 1871 మార్చి 25న సికింద్రాబాద్‌–వాడి రైల్వే లైన్‌ నిర్మాణం మొదలైంది. 192 కిలోమీటర్ల లైన్‌.. 1874 అక్టోబర్‌ 9న పూర్తైంది. ఈ మార్గం హైదరాబాద్‌ను బొంబాయి–మద్రాసు రైల్వే నెట్‌వర్క్‌తో కలిపింది. హైదరాబాద్‌ సంస్థానం నుంచి రైల్వేకు నిధులు అందాయి. తర్వాత ఈ వ్యవస్థే నిజాం స్టేట్ రైల్వేగా ఎదిగింది. 1883లో దీని పేరు నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేగా మారింది. లండన్‌కు చెందిన కంపెనీ నిర్వహణలో నడిచిన ఈ రైల్వే.. క్రమంగా హైదరాబాద్‌ సంస్థానంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది.

పత్తి వ్యాపారం కోసం మొదలై..

Advertisement

సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు రైలు మార్గం కూడా విస్తరించింది. 1886 ఏప్రిల్‌ 8న సికింద్రాబాద్‌–వరంగల్‌ లైన్‌ ప్రారంభమైంది. తర్వాత మన్మాడ్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు మీటర్‌ గేజ్‌ మార్గాలు వచ్చాయి. 1900లో హైదరాబాద్‌–గోదావరి వ్యాలీ రైల్వే ప్రారంభం కావడంతో పత్తి వ్యాపారం ఊపందుకుంది. పత్తి మరాఠ్వాడా ప్రాంతం నుంచి పత్తి బొంబాయి మార్కెట్లకు చేరడం మరింత సులభమైంది. అలా నిజాం రైల్వే వ్యవస్థ క్రమంగా భారీ నెట్‌వర్క్‌గా మారింది. 1950 నాటికి NGSR, హైదరాబాద్‌–గోదావరి వ్యాలీ రైల్వే జాతీయం అయ్యాయి. 1951లో సెంట్రల్‌ రైల్వేలో విలీనం అయ్యాయి. ఆ తర్వాత 1966లో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఏర్పడినప్పుడు.. నిజాం రైల్వేకు చెందిన అనేక ప్రాంతాలు దాని పరిధిలోకి వచ్చాయి.

 రూ.327 కోట్లతో స్టేషన్‌లో అభివృద్ధి పనులు..

Advertisement

ఒకప్పుడు 192 కిలోమీటర్ల రైల్వే లైన్‌తో మొదలైన ప్రయాణం.. తర్వాత వేల కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌గా మారింది. నిజాం రైల్వే వ్యవస్థ మొత్తం పొడవు ఒక దశలో 2,351 కిలోమీటర్లకు చేరింది. అంటే.. ఒక సంస్థాన రైల్వే వ్యవస్థగా మొదలై.. ఈరోజు భారతీయ రైల్వేలో భాగంగా కొనసాగుతోంది. ఇక ఇప్పుడు.. నాంపల్లి హైదరాబాద్‌ డెక్కన్‌ స్టేషన్‌. రోజూ దాదాపు 28 వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 50 నుంచి 65 వరకు రైళ్లు ఈ స్టేషన్‌ నుంచి నడుస్తున్నాయి. కాలం మారింది.. రైళ్లు మారాయి.. స్టేషన్‌ రూపం మారుతోంది. ప్రస్తుతం అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా రూ.327 కోట్లతో స్టేషన్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

Also Read: హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

Tags

Related News

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!

భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

వేల అడుగుల లోయలు.. వందల మలుపులు.. ఈ రోడ్లపై డ్రైవింగ్ చాలా డేంజరస్!

నిన్న లీగల్ నోటీసులు.. నేడు భూముల లెక్కలు.. స్వర్ణగిరి ఆలయానికి షాక్ మీద షాక్!

పిడుగు దెబ్బకు ఇండిగో విమానం డ్యామేజ్.. లక్నోలో సేఫ్‌గా ల్యాండింగ్, ఎలా జరిగింది?

ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!

‘హనుమాన్ అంశ్’ మూవీ ఎఫెక్ట్.. కైంచి ధామ్‌లో ఏకంగా 20 కి.మీ. ట్రాఫిక్ జామ్!

Big Stories

Advertisement
×