E-Paper
Advertisement

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ
Advertisement

Lorne OTT Release : సినిమా స్టార్లు కాదు, సూపర్ హీరోలు కాదు… కానీ దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని నవ్విస్తున్న ఓ కామెడీ షో వెనుక ఉన్న వ్యక్తి కథ ఇది. ‘Saturday Night Live’ అనే పేరును ప్రపంచవ్యాప్తంగా ఓ బ్రాండ్‌గా మార్చిన లోర్న్ మైఖేల్స్ కెరీర్, అతడి ఆలోచనా విధానం, షోను నిలబెట్టేందుకు చేసిన పోరాటం గురించి తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ చూడాల్సిందే. హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తెర వెనుక ఉండే అసలు కథలను తెలుసుకోవాలనుకునే వారికి ‘Lorne’ మస్ట్ వాచ్ డాక్యుమెంటరీ ఫిల్మ్. లోర్న్ మైఖేల్స్ జీవితాన్ని ప్రముఖుల ఇంటర్వ్యూల ద్వారా చూపించిన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ డాక్యుమెంటరీని ఏ ఓటీటీలో చూడవచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇది సాధారణ సినిమా తరహాలో సాగే కథ కాదు. అమెరికన్ టెలివిజన్ కామెడీ ప్రపంచాన్ని మార్చిన ఓ వ్యక్తి ప్రయాణాన్ని డాక్యుమెంటరీ రూపంలో చూపిస్తారు. ఆ వ్యక్తే లోర్న్ మైఖేల్స్. ‘సాటర్ డే నైట్’ అనే షోను సృష్టించి, దాన్ని దాదాపు ఐదు దశాబ్దాల పాటు కొనసాగించడంలో కీలక పాత్ర పోషించిన లోర్న్ మైఖేల్స్ కెరీర్ చుట్టూనే మొత్తం డాక్యుమెంటరీ సాగుతుంది.

Advertisement

ఎస్ఎన్ఎల్ మొదలైన సమయంలో అది ఇంత పెద్ద టెలివిజన్ సంస్థగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ లోర్న్ మైఖేల్స్ మాత్రం సాధారణ కామెడీ షోకు భిన్నంగా ఏదో చేయాలని ప్రయత్నించాడు. రాజకీయాలు, సెలబ్రిటీలు, సామాజిక అంశాలు, పాప్ కల్చర్ వంటి విషయాలను కామెడీతో కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఎస్ఎన్ఎల్ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఇలాంటి షోను ఇన్ని సంవత్సరాలు నడిపించడం అంత సులభం కాదు. ప్రతి వారం కొత్త స్కెచ్‌లు, కొత్త నటులు, కొత్త రచయితలు, కొత్త ఆలోచనలు అవసరం. ఒక్క ఎపిసోడ్ సరిగ్గా వర్క్ కాకపోయినా ప్రేక్షకుల నుంచి వెంటనే నెగెటివ్ రెస్పాన్స్ వస్తుంది. అలాంటి ఒత్తిడి మధ్య లోర్న్ మైఖేల్స్ ఎలా పని చేశాడో డాక్యుమెంటరీలో చూపిస్తారు.

Advertisement

అతడి ప్రయాణంలో ఎస్ఎన్ఎల్ ద్వారా ఎదిగిన అనేక మంది నటులు, రచయితలు, కామెడియన్లు కూడా కీలకంగా ఉంటారు. షో నుంచి బయటకు వచ్చిన చాలామంది తర్వాత హాలీవుడ్‌లో పెద్ద స్టార్లుగా మారారు. వాళ్ల కెరీర్‌లపై ఎస్ఎన్ఎల్ చూపించిన ప్రభావం కూడా ఈ డాక్యుమెంటరీలో భాగంగా ఉంటుంది.

మరోవైపు లోర్న్ మైఖేల్స్ వ్యక్తిగత ఆలోచనా విధానం, కామెడీపై అతడికి ఉన్న అభిప్రాయాలు, కొత్త ప్రతిభను గుర్తించే విధానం వంటి విషయాలను కూడా ప్రముఖుల ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఓ టెలివిజన్ షోను సజీవంగా ఉంచడం వెనుక ఉన్న కష్టం, దాని కోసం తీసుకున్న నిర్ణయాలు, మారుతున్న కాలానికి తగ్గట్టుగా షోను మార్చిన విధానం ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. ఎస్ఎన్ఎల్‌ను కేవలం ఓ కామెడీ ప్రోగ్రామ్‌గా కాకుండా అమెరికన్ పాప్ కల్చర్‌లో ఓ భాగంగా మార్చిన ప్రయాణం ఏంటి ? ఆ ప్రయాణంలో లోర్న్ మైఖేల్స్ పాత్ర ఎంత పెద్దది అన్నది ? తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీని డోంట్ మిస్.

Also Read : కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

ఓటీటీలో ఏ భాషల్లో ఉంది ?

ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కు మోర్గాన్ నెవిల్ దర్శకత్వం వహించారు. లోర్న్ మైఖేల్స్ జీవితాన్ని, షో నిర్మాణం వెనుక ఉన్న అతడి ప్రయాణాన్ని స్టార్ ఇంటర్వ్యూలు, ఆర్కైవ్ ఫుటేజ్ ద్వారా ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఇందులో టినా ఫే, మాయా రుడాల్ఫ్ తదితర ప్రముఖుల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీ 2026 అక్టోబర్ 5న Netflixలోకి వచ్చింది. ప్రస్తుతం ఓటీటీలో ఇంగ్షీషు ఆడియోతో పాటు స్పానిష్ ఆడియో కూడా ఉంది.

Tags

Related News

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే స్పెషల్ టీమ్… కంటెంట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా… డెడ్లీ క్రైమ్స్ తో సీజన్ 9 స్ట్రీమింగ్ షురూ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

Big Stories

Advertisement
×