AP News: ఏపీలోని సత్యసాయి, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆరోపించింది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ఓ వ్యక్తితో పాటు మహిళను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉగ్రవాద సంస్థలతో ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఉన్నట్టు అధికారులు ఆరోపిస్తున్నారు.
శనివారం ఉదయం శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టణంలో నివసిస్తున్న కోత్వాల్ నూర్ మొహమ్మద్ (40) అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొహమ్మద్ గత 15 ఏళ్లుగా ధర్మవరంలోని స్థానిక హోటళ్లలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అతను మార్కెట్ స్ట్రీట్‌లోని ఒక టీ స్టాల్‌లో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ధర్మవరం పోలీసుల సహకారంతో ఎన్‌ఐఏ అధికారులు కోటా స్ట్రీట్‌లోని మొహమ్మద్ అద్దె ఇంటిపై దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వివరాల ప్రకారం మొహమ్మద్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో తరచూ సంప్రదింపులు జరిపినట్లు కేంద్ర ఏజెన్సీలు గుర్తించాయి. అతన్ని వెంటనే పోలీసు వాహనంలో చెన్నైకి తరలించారు. దాడి సమయంలో అతని ఇంటి నుండి కొన్ని ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో ఓ 35 ఏళ్ల మహిళను కూడా ఎన్‌ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. మొహమ్మద్ ఈ మహిళతో తరచూ సంప్రదింపులు మాట్లాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. వారి మధ్య జరిగిన సంభాషణ అనుమానాస్పదంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పుట్టపర్తిలోని ఒక పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ ప్రస్తుతం అద్దె ఇంటిలో నివసిస్తున్నాడని చెప్పారు. కానీ ఇటీవల ధర్మవరంలో ఒక భూమిని కొనుగోలు చేసి.. భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఇంటి నిర్మాణం ప్రారంభించాడని తెలిపారు.
ALSO READ: LIC Notification: ఎల్ఐసీలో 491 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. రూ.1,69,025 వేతనం
మొహమ్మద్ ఓటర్ ఐడీ ప్రకారం అతని తండ్రి పేరు కోత్వాల్ అమీర్. ఎన్‌ఐఏ బృందానికి సహకరించిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ వ్యక్తిగత వృత్తి, నివాస వివరాలు తప్ప, అతని నేపథ్యం గురించి కానీ.. అతను ఎక్కడి నుండి వచ్చాడు..? అతనికి పెళ్లి అయ్యిందా.. లేదా..? అనే విషయాలపై ఎలాంటి సమాచారం లేదు. అయితే, టీ స్టాల్ యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. అతడు సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటాడని చెప్పాడు. కానీ ఇటీవల భారీ ఖర్చు పెట్టి భూమి కొనుగోలు చేయడం.. ఇంటి పనులు ప్రారంభించడంతో అక్కడ పోలీసులు, స్థానికుల దృష్టిని ఆకర్షించాడని అన్నాడు. ఈ కేసు దేశ భద్రతకు సంబంధించిన ఒక ముఖ్యమైన సంఘటన నిలుస్తోంది. ఎన్‌ఐఏ దర్యాప్తు ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజాలను వెలికితీసే అవకాశం ఉంది.
ఉగ్రవాద అనుమానితుడు నూర్ మొహమ్మద్ పై దేశ ద్రోహం కింద ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేశారు. Cr.No. 170/2025 U/s 152, 196 (1) (a), 196 (2) r/w 3(5) BNS, Sec. 13, 38, 39 of UAPA సెక్షన్ల కింద కేసు నమోదైంది. రేపటి లోగా కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. నూర్ మొహమ్మద్ కు ఉగ్రవాద సంస్థల్లో సభ్యత్వం ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసును NIA అధికారులు టేకప్ చేసే అవకాశం ఉంది.
ALSO READ: BSF Police Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు భయ్యా