Udaya Bhanu : ఒకప్పుడు బుల్లితెరపై తన అందం, అభినయంతో వరుస షోలతో ప్రేక్షకులను అలరించిన యాంకర్లలో ఉదయభాను ఒకరు.. అప్పట్లో ఈమె చేస్తున్న షోలకి మంచి క్రేజ్ ఉండేది. ఫ్యామిలీ ఆడియోస్ నుంచి చిన్నపిల్లల వరకు అందరినీ ఆకట్టుకునేలా షోలను చేసింది. యాంకర్ సుమ ఝాన్సీ, ఉదయభాను ముగ్గురు పోటీపడి మరి బుల్లితెరపై షోలు చేసేవారు. ఉదయభాను పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దగా బుల్లితెరపై కనిపించలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ స్క్రీన్ మీదకు వచ్చేసింది. ఈమధ్య వరుస షోలలో ఈమె చేస్తున్న వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉదయభాను ఎన్నో నమ్మలేని నిజాలను బయటపెట్టింది. ప్రస్తుతం అవి నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
రెమ్యూనరేషన్ ఎగ్గొట్టి నరకం చూపించారు..
యాంకర్ ఉదయభాను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమె నటించిన త్రిభాణాదారి బార్బరిక్ అనే సినిమాతో చాలా కాలం తర్వాత ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈనెల 22న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో జోరుని పెంచారు.. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు సత్యరాజ్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటు ఇండస్ట్రీలో జరుగుతున్న బాగోతాలను కూడా బయటపెట్టింది.. గతంలో ఉదయభాను యాంకరింగ్ చేసిన పలు స్పెషల్ షోలు మంచి క్రేజ్ ని అందుకున్నయని యాంకర్ అడగ్గా.. అవును నిజమే అండి. ఆ షోల ద్వారా నాకు కూడా మంచి ఫేమ్ వచ్చింది అని ఉదయభాను అన్నారు. అయితే రెమ్యూనరేషన్ ప్రస్తావన రావడంతో ఉదయభాను నమ్మలేని విషయాలను బయటపెట్టింది. నేను చేసిన షోలు బాగా ఫేమస్ అయ్యాయి.. కానీ నాకు రెమ్యూనరేషన్ మాత్రం ఇవ్వలేదు. చెక్కులిచ్చాము అంటారు ఆ చెక్కులు తోరణాలు కట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు అని ఉదయభాను ఆరోపణలు చేశారు. ఒకవేళ నాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు డబ్బులు కావాలి అని అడిగితే ఉదయభాను ఫీడించేస్తుంది అని గోల పెడతారు.. ఇప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అని ఉదయభాను అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి..
Also Read : ‘వెన్స్ డే ‘ సీజన్ 2 ట్రైలర్.. మతిపోయే ట్విస్ట్.. లేడీ గాగా వచ్చేస్తుందిరోయ్..!
త్రిభాణాదారి బార్బరిక్ మూవీ..
ఇన్నాళ్ళ తర్వాత ఉదయభాను మళ్లీ స్క్రీన్ మీద కనిపిస్తుంది.. ఈ మధ్య బుల్లితెర పై ప్రసారం అవుతున్న పలు ఈవెంట్లలో సందడి చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు త్రిబాణాదారి బార్బరిక్” అనేది తెలుగులో ఒక సినిమా పేరు. ఈ సినిమా మైథలాజికల్ నేపథ్యంలో, రామాయణ, మహాభారతాల కథల ప్రేరణతో రూపొందించబడింది. సత్యరాజ్, వశిష్ఠ సింహ, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ శ్రీవత్స ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించారు.. ఈ సినిమా తెలుగులో తెరకెక్కుతోంది, అయితే ఇది పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అయ్యే అవకాశం ఉంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..