Rose Petals: గులాబీ రేకులు కేవలం వాటి సువాసనకు మాత్రమే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి. గులాబీ రేకులలో ఉండే సహజ నూనెలు, విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. గులాబీ రేకులను వివిధ రకాలుగా ఉపయోగించి ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గులాబీ రేకుల టోనర్:
గులాబీ రేకులను ఉపయోగించడానికి ఇది అత్యంత సులభమైన పద్ధతి. టోనర్ చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
తయారీ విధానం:
ఒక గిన్నెలో కొన్ని గులాబీ రేకులు వేసి, శుభ్రమైన నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఈ నీటిని వడకట్టి ఒక స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. దీన్ని రోజంతా ముఖంపై స్ప్రే చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
2. గులాబీ రేకుల ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది. అంతే కాకుండా మొటిమలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
తయారీ విధానం:
కొన్ని గులాబీ రేకులను, రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని, ఒక టేబుల్ స్పూన్ పెరుగును తీసుకోండి. గులాబీ రేకులను మెత్తగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌లో శనగపిండి, పెరుగు కలిపి మెత్తటి మిశ్రమంలా చేయండి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు అప్లై చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇది చర్మంపై ఉండే నూనెను తొలగించి, రంధ్రాలను శుభ్రపరుస్తుంది.
3. తేనె, గులాబీ రేకుల ప్యాక్:
తేనె సహజ మాయిశ్చరైజర్, గులాబీ రేకులు చర్మాన్ని మెరిపిస్తాయి. ఈ ప్యాక్ పొడి చర్మానికి చాలా మంచిది.
తయారీ విధానం:
గులాబీ రేకులను మెత్తగా పేస్ట్ చేసి, దానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది.
Also Read: నిమ్మ గడ్డితో.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !
4. గులాబీ రేకుల స్క్రబ్:
గులాబీ రేకులతో తయారు చేసిన స్క్రబ్ చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగిస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేస్తుంది.
తయారీ విధానం:
గులాబీ రేకుల పేస్ట్‌కు కొద్దిగా చక్కెర లేదా బియ్యం పిండిని కలపండి. ఈ మిశ్రమంతో ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.