AP Pension: ఆంధ్రప్రదేశ్ పింఛన్ లబ్దిదారులకు ఇది బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. జూన్ నెలకు సంబంధించి పింఛన్ మొత్తాన్ని ఒక రోజు ముందుగానే అంటే.. మే 31న అందజేయనున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలకమైన మార్పులు తీసుకొచ్చింది.
అప్పటివరకు ఏపీలో ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు పింఛన్ ఇచ్చేవారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు సిబ్బందికి ఈ బాధ్యతను అప్పగించిన విషయం తెలిసిందే. దాదాపుగా ప్రభుత్వం ఏర్పడిన నుంచి 11 నెలల పాటు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయ్యింది. నిజానికి కూటమి సర్కార్ వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీలో చాలా మార్పులు జరిగాయి. వైసీపీ హయాంలో ఇస్తున్న రెండు వేల పింఛన్ మొత్తాన్ని రూ.4వేలకు పెంచిన ఘనత కూటమి సర్కార్ దే అని చెప్పవచ్చును. మూడు నెలల బకాయితో పాటు అందించి కూటమి ప్రభుత్వం ప్రజల మెప్పును పొందుతోంది.
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పింఛన్ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ ను కూటమి సర్కార్ ఒకరోజు ముందు ఇస్తోంది. జూన్ 1వ తారీఖున సండే కావడంతో.. మే 31న ఉదయం 7 గంటలకే సచివాలయ సిబ్బంది నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేయనున్నారు. ఇక లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరైతే.. మే 31న పింఛన్ డబ్బులు తీసుకోలేదో.. వారు జూన్ 2న సచివాలయం వద్దకు వెళ్లి.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పింఛన్ తీసుకోవచ్చు. మే 31న పింఛన్ డబ్బులు పంపిణీ చేయాల్సి ఉండడంతో.. సచివాలయ సిబ్బంది బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేయాల్సి ఉంటుంది. పింఛన్ తీసుకునే రాష్ట్ర ప్రజలు ఈ మార్పును గమనించాలని అధికారులు చెబుతున్నారు.
ALSO READ: రైతులకు తీపి కబురు.. కేవలం 10 రోజుల్లో
అలాగే ఈ నెల స్పౌజ్ కేటగిరీ లో కొత్తగా 89వేల 788 మందికి రూ.4వేల చొప్పున ప్రభుత్వం పింఛన్ అందజేయనుంది. పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే ఎన్టీఆర్ భరోసా కింద భార్యకు తదుపరి నెల నుంచి పింఛన్ అందజేయనున్నారు. ఈ కేటగిరీని పోయిన సంవత్సరం నవంబర్ నెల నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు కూడా పింఛన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ: రైతులకు భారీ గుడ్ న్యూస్.. రూ.51 కోట్ల నిధులు విడుదల
అర్హులైన మహిళలు భర్త డెత్ సర్టిఫికెట్ తో పాటు ఆధార్ కార్డు వివరాలను సచివాలయాల్లో ఇవ్వాలని ఉన్నత అధికారులు సూచించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు మొత్తం రూ.35.91 కోట్ల అదనపు భారం పడుతున్నట్టు అంచనా.