BigTV English

Pawan Kalyan: జగన్ ను వెంటాడుతున్న పవన్.. ఇంత కసి ఏల?

Pawan Kalyan: జగన్ ను వెంటాడుతున్న పవన్.. ఇంత కసి ఏల?

Pawan Kalyan: ఒక్క దెబ్బకు రెండు పిట్టలనే సామెత వినే ఉంటారు. సేమ్ టు సేమ్ అదే రీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేసిన ప్లాన్ కు తలలు పట్టుకుంటుందట ఆ పార్టీ. అసలేం చేయాలో తోచక ఆ పార్టీ నేతలు ఆలోచనలో పడినట్లు పొలిటికల్ టాక్. మనం ఒకటి తలిస్తే, ఇంకొకటి జరుగుతుండడం ఆ పార్టీకి రుచించడం లేదట. ఇంతలా పవన్ దెబ్బకు విలవిలలాడుతున్న పార్టీ ఏదో అనుకోవద్దు వైసీపీనేనట. ఈ మాటలంటున్నది మాత్రం రాజకీయ విశ్లేషకులు.


ఏపీలో ఎన్నికల అనంతరం మళ్లీ పుంజుకోవాలన్నది వైసీపీ ప్లాన్. అసలే 11 సీట్లనే దక్కించుకున్న వైసీపీకి ఊపిరి పోయాలని మాజీ సీఎం జగన్ ప్లాన్. అందుకే ఎన్నికల అనంతరం ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించిన జగన్, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తానున్నానంటూ భరోసా కల్పించారు. ఈ దశలో పోలీసులు స్పీడ్ పెంచి, మహిళల వ్యక్తిగత హననానికి పాల్పడే వారిని వదిలిపెట్టకుండా కేసులు నమోదు చేశారు. అందులో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఉండగా, కొందరిని అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు తరలించారు.

ఇక సైలెంట్ గా ఉంటే కుదరదన్న అభిప్రాయంతో జగన్ కూటమిపై సమరశంఖం మోగించారు. కూటమి హామీలు నెరవేర్చలేదని, వరుసగా నిరసనలు చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. అంతేకాదు జనవరిలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ప్రతి బుధ, గురు వారాల్లో జిల్లాలలో పర్యటించేందుకు జగన్ సిద్దమవుతున్నారు. అయితే ఇక్కడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేసిన ప్లాన్ కి వైసీపీకి దిమ్మ తిరిగిందట.


ఇటీవల జగన్ స్వంత జిల్లా కడపలో ఓ ఎంపీడీఓపై వైసీపీ నాయకుడు దాడికి పాల్పడడంతో, పవన్ నేరుగా కడపలో పర్యటించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, చట్టరీత్యా శిక్షపడేలా చూస్తామంటూ పవన్ హెచ్చరించారు. అంతవరకు ఓకేగానీ, ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా, ప్రభుత్వ ఉద్యోగుల్లో ధైర్యం నింపేందుకు జిల్లాల పర్యటనకు రానున్నట్లు పవన్ ప్రకటించారు. అలాగే ఆయా జిల్లాలలో ప్రజలను కలిసి వారి సమస్యలను పరిష్కరించే దిశగా పవన్ ప్లాన్ వేశారు. ఇదే ఇప్పుడు వైసీపీకి అస్సలు రుచించడం లేదని టాక్.

Also Read: DGP Jitender: అల్లు అర్జున్ కేసుపై స్పందించిన డీజీపీ.. ఏం చెప్పారంటే?

అసలే పార్టీని బలోపేతం చేసుకునేందుకు జగన్ జిల్లాల పర్యటనకు వస్తున్న సమయంలో, పవన్ కూడా జిల్లాల పర్యటన సాగిస్తానంటూ చెప్పడంపై ఆ నేతలు సమాలోచనలో పడ్డారట. జగన్ పర్యటన సాగినా, పవన్ పర్యటనతో ఆ ప్రభావం ఏమి ఉండదన్న భావన రాజకీయ విశ్లేషకుల అంచనా. మొత్తం మీద పవన్ జిల్లాల పర్యటన సాగితే, వైసీపీ పరిస్థితి ఏమిటన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×