E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్.. రంగంలోకి 25 పార్లమెంట్ కమిటీలు!

స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్.. రంగంలోకి 25 పార్లమెంట్ కమిటీలు!
Advertisement

Pawan Kalyan: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ వేదికగా జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన కీలక అడుగు పడింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన శనివారం ఒక ముఖ్యమైన సమావేశం ప్రారంభమైంది. జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీలతో జరుగుతున్న ఈ భేటీకి పార్టీ తరఫున ఎన్నికైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలంతా హాజరయ్యారు.

పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ

Advertisement

రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేసిన నిర్మాణ సారధుల సమాచార కమిటీలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కేవలం ఉమ్మడి సమావేశంగా కాకుండా, ప్రతి పార్లమెంటు కమిటీతో ఆయన విడివిడిగా భేటీ అయి క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ కమిటీలలోని ప్రతి సభ్యునితో మాట్లాడి నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను ఆయన స్వయంగా సమీక్షించనున్నారు.

Also Read: దేవుడి హుండీ డబ్బులు కూడా వదల్లేదు.. వైసీపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు!

Advertisement

28 మంది సభ్యులతో పటిష్ట కమిటీలు

పార్టీని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ప్రతి పార్లమెంట్ కమిటీలో 28 మంది సభ్యులను నియమించారు. ఈ కమిటీలలో ప్రధానంగా ‘సాధకులు’, ‘పరిశీలకులు’ ఉంటారు. వీరంతా రాబోయే రోజుల్లో పార్టీకి, క్షేత్రస్థాయి నాయకత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ.. సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్నారు.

సోమవారం నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు

ఈ సమావేశంలో దిశా నిర్దేశం పూర్తయిన తర్వాత, సోమవారం నుండి కమిటీ సభ్యులంతా తమకు కేటాయించిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. కేవలం పైపైన సమీక్షలు నిర్వహించడమే కాకుండా, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

నేరుగా కార్యకర్తల నుంచే ఆర్జీల స్వీకరణ

ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయి గళాన్ని వినడమే. గ్రామీణ స్థాయిలోని జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరి నుంచి కమిటీ సభ్యులు నేరుగా ఆర్జీలను స్వీకరిస్తారు. స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వారి నుంచి వినతులు సేకరించి అధిష్టానానికి నివేదికలు అందిస్తారు.

Also Read: ఉండవల్లి భూముల రగడ.. ప్రపంచ బ్యాంకుకు రైతుల ఫిర్యాదు.. సీఆర్డీఏకు ఆదేశాలు!

స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ దిశా నిర్దేశం

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండాను బలంగా ఎగురవేయడమే లక్ష్యంగా ఈ కమిటీలకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే నివేదికల ఆధారంగానే భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన ఈ సందర్భంగా నేతలకు స్పష్టం చేయనున్నారు.

Related News

దేవుడి హుండీ డబ్బులు కూడా వదల్లేదు.. వైసీపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు!

ఉండవల్లి భూముల రగడ.. ప్రపంచ బ్యాంకుకు రైతుల ఫిర్యాదు.. సీఆర్డీఏకు ఆదేశాలు!

నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!

ఫ్యామిలీస్ కూలిపోతున్నాయి.. చూస్తూ ఊరుకోం.. డ్రగ్స్‌పై పవన్ సమరశంఖం!

అధికారులను బెదిరిస్తే ఊరుకోం.. చెవిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న ఈశ్వర్ రెడ్డి!

858 హాట్ స్పాట్స్, 40 వేల ‘ఈగల్ క్లబ్స్’.. గంజాయిపై కూటమి సర్కార్ ఉక్కుపాదం!

ఏపీ సంజీవిని ప్రాజెక్ట్.. ఫ్రీ మెడికల్ టెస్ట్‌లు, మందులు ఎలా పొందాలో తెలుసా?

Big Stories

×