Pawan’s daughter declaration: తిరుమల డిక్లరేషన్ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఇరుకున పెట్టాలని వైసీపీ భావించింది. పవన్ కల్యాణ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కూతురు తరపున తనే డిక్లరేషన్ ఇచ్చారు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
ఏపీలో రాజకీయాలు తిరుమల డిక్లరేషన్ చుట్టూనే తిరుగుతున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారం తర్వాత డిక్లరేషన్ అంశం మరింత ముదిరి పాకాన పడింది. అన్యమతస్తులు ఎవరు తిరుమలకు వచ్చినా హిందూ ఆచారాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిన నియమం ఉంది. గతంలో చాలామంది ప్రముఖులు తిరుమలను సందర్శించి డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టంలేక మాజీ సీఎం జగన్.. తిరుమలకు వెళ్లలేదు.
తిరుమల లడ్డూ విషయంలో అపచారం జరిగిందని భావించి ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. దీక్ష విరమణకు ముందు కాలి మార్గాన తిరుమలకు వెళ్లారు డిప్యూటీ సీఎం. రాత్రికి తిరుమలలో బస చేశారు. బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం వద్దకు డిక్లరేషన్ పత్రాలు తీసుకొచ్చారు టీటీడీ ఉద్యోగులు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో తిరుమలకు గతరాత్రి చేరుకున్నారు. పవన్‌తోపాటు ఇద్దరు కూతుళ్లు వచ్చారు. అందులో అన్నా లెజినోవా కూతురు పొలెనా అంజలి ఉన్నారు. హిందూ ఆచారాల ప్రకారం టీటీడీ ఉద్యోగులు డిక్లరేషన్ పత్రాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు. పవన్ చిన్న కూతురు పొలెనా మైనర్ కావడంతో స్వయంగా పవన్‌కల్యాణ్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేసి అధికారులకు అందజేశారు.
ALSO READ: తిరుమల లడ్డూ వివాదం, సిట్ దర్యాప్తు బ్రేక్ వెనుక.. అసలేం జరిగింది?
డిప్యూటీ సీఎం పవన్ తన కూతుళ్లతో తిరుమలకు వెళ్లడంతో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు. ఎలాగైనా డిక్లరేషన్ విషయంలో పవన్ కల్యాణ్‌ను ఇబ్బందిపెట్టాలని భావించారు. నేతలు ఒకటి భావిస్తే.. దైవం మరొకటి చేసింది. డిప్యూటీ సీఎం డిక్లరేషన్ ఇవ్వడంతో వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు.
తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ చిన్న కుమార్తె పలీనా అంజిని కొణిదెల pic.twitter.com/D7a1IWsN6E
— ChotaNews (@ChotaNewsTelugu) October 2, 2024