E-Paper
Advertisement

మీ ఫోన్ కెమెరా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిందా? వెంటనే ఇలా కనిపెట్టండి.. లేదంటే డేంజరే!

మీ ఫోన్ కెమెరా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిందా? వెంటనే ఇలా కనిపెట్టండి.. లేదంటే డేంజరే!
Advertisement

Smartphone Camera Privacy: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడటానికి, మెసేజ్‌లు పంపుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ వంటి ఫీచర్లు.. రోజువారీ జీవితంలో కీలక భాగమైపోయాయి. ఈ క్రమంలో ఏదైనా పరిచయం లేని యాప్ మీ కెమెరాను వాడటం లేదా అనుమానాస్పద యాప్‌లు ఫోన్‌లో ఉండటం వల్ల ప్రైవసీ గురించి భయాలు కలగడం సహజమే. అయితే కెమెరా ఆన్ అయిన ప్రతిసారీ హ్యాకింగ్ అని కంగారు పడక్కర్లేదు. కొన్ని సులువైన పద్ధతుల ద్వారా మీ కెమెరాను ఎవరు వాడుతున్నారో క్షణాల్లో తెలుసుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో చూద్దాం.

స్క్రీన్‌పై కనిపించే గ్రీన్ డాట్

ప్రస్తుతం వస్తున్న దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో కెమెరా లేదా మైక్రోఫోన్ ఆన్ అయిన ప్రతిసారీ డిస్‌ప్లే పైభాగంలో ఒక చిన్న గ్రీన్ డాట్ (పచ్చటి చుక్క) లేదా ఇండికేటర్ కనిపిస్తుంది. మీరు కెమెరాతో పని ఉన్న ఏ యాప్‌నూ వాడనప్పుడు కూడా ఈ లైట్ పదే పదే వెలుగుతుంటే ఏదో యాప్ మీకు తెలియకుండా కెమెరాను ఉపయోగిస్తోందని అర్థం చేసుకోవాలి.

కెమెరా పర్మిషన్లు సరిచూసుకోండి

Advertisement

ఫోన్‌లోని ‘సెటింగ్స్’ (Settings) ఓపెన్ చేసి ‘ప్రైవసీ’ (Privacy) లేదా ‘సెక్యూరిటీ అండ్ ప్రైవసీ’ విభాగానికి వెళ్లండి. అక్కడ ‘పర్మిషన్ మేనేజర్’ (Permission Manager) అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ‘కెమెరా’ను ఎంచుకుంటే.. ఏ ఏ యాప్‌లకు కెమెరా వాడే అనుమతి ఉందో జాబితా కనిపిస్తుంది. కెమెరాతో అసలు అవసరమే లేని యాప్‌లకు పర్మిషన్ ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వాటికి ఆ అనుమతిని రద్దు చేయండి.

అనుమానాస్పద యాప్‌లపై కన్నేయండి

మొబైల్‌లో ఉన్న యాప్‌ల జాబితాను ఒకసారి నిశితంగా పరిశీలించండి. ఇన్ స్టాల్ చేయని యాప్‌లు గానీ, ఉపయోగం లేని యాప్‌లు గానీ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. ముఖ్యంగా సాధారణంగా కనిపించే కొన్ని యాప్‌లు అనవసరంగా కెమెరా, మైక్రోఫోన్ అనుమతులు అడుగుతుంటాయి. అయితే ఏదైనా యాప్‌ను డిలీట్ చేసే ముందు అది ఫోన్ సిస్టమ్‌కు సంబంధించిన ముఖ్యమైన యాప్ కాదని నిర్ధారించుకోవడం మంచిది.

ప్రైవసీ డాష్‌బోర్డ్‌తో చెక్ చేయండి

Advertisement

చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘ప్రైవసీ డాష్‌బోర్డ్’ (Privacy Dashboard) అనే అద్భుతమైన ఫీచర్ ఉంటుంది. గత 24 గంటల్లో ఏ యాప్ మీ కెమెరా, మైక్రోఫోన్ లేదా లొకేషన్‌ను ఎంతసేపు ఉపయోగించిందో అక్కడ స్పష్టమైన టైమ్‌లైన్‌తో సహా చూడవచ్చు. మీరు ఫోన్ వాడని సమయంలో కూడా కెమెరా ఆక్టివ్‌గా ఉన్నట్లు చూపిస్తే ఆ యాప్‌ పర్మిషన్లను వెంటనే తొలగించాలి.

Also Read: రైలులో సైకో కిల్లర్.. ఖాకీ దుస్తుల్లో వచ్చి డ్రామాలు.. ప్రయాణికులను బయటకు తోసేస్తూ దారుణాలు!

ఐఫోన్ యూజర్లు ఎలా చెక్ చేయాలంటే…

ఐఫోన్లలో కూడా కెమెరా, మైక్రోఫోన్ వాడకానికి సంబంధించి ప్రైవసీ డాట్స్ కనిపిస్తాయి. ఐఫోన్ యూజర్లు సెట్టింగ్స్ > ప్రైవసీ & సెక్యూరిటీ > కెమెరా విభాగంలోకి వెళ్లి యాప్‌ల అనుమతులను చెక్ చేయవచ్చు. అవసరం లేని యాప్‌లకు కెమెరా యాక్సెస్ ఆఫ్ చేయవచ్చు. అలాగే ఐఓఎస్‌లోని ‘యాప్ ప్రైవసీ రిపోర్ట్’ (App Privacy Report) ఫీచర్ ద్వారా ఏ యాప్ మీ డేటాను లేదా కెమెరాను ఎలా వాడుతుందో వివరంగా తెలుసుకోవచ్చు.

Also Read: యువతి టీ-షర్ట్‌పై ‘Urban Mindset’ నోట్.. అర్ధరాత్రి రెచ్చిపోయిన పోకిరీలు.. కారులోకి లాగేందుకు యత్నం!

Tags

Related News

అబ్బో ఇవేం ఆఫర్లు బాబోయ్.. సేల్ కంటే ముందే 6 స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా డౌన్!

కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా? టాప్-5 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఇవే!

జియో బంపర్ ఆఫర్.. ఈ ఒక్క రీఛార్జ్‌తో 200 రోజులు టెన్షన్ ఫ్రీ.. రూ.35,000 విలువైన ఏఐ టూల్స్ ఫ్రీ!

వాక్యూమ్ క్లీనర్లపై 86% ఆఫర్..కొనడానికి ఇంతకంటే మంచి టైం ఉంటుందా?

రూ.1,059కే టైప్-సి ఛార్జింగ్ ఫోనా? పెద్దలకు అదిరిపోయే గిఫ్ట్.. ఐటెల్ కొత్త మోడల్ వచ్చేసింది!

యూట్యూబ్‌లో షాపింగ్ హంగామా.. ఇక వీడియోలు చూస్తూనే కొనేయొచ్చు, క్రియేటర్లకు కొత్త ఆదాయ అవకాశాలు!

హ్యాకర్ల టార్గెట్‌గా గూగుల్ క్రోమ్ యూజర్లు? CERT-In బిగ్ వార్నింగ్.. వెంటనే ఇలా చేయండి!

Big Stories

Advertisement
×