E-Paper
Advertisement

డ్రై క్లీనింగ్ అవసరం లేదు.. ఖరీదైన బట్టలను ఇంట్లోనే ఇలా శుభ్రం చేయండి

డ్రై క్లీనింగ్ అవసరం లేదు.. ఖరీదైన బట్టలను ఇంట్లోనే ఇలా శుభ్రం చేయండి
Advertisement

Expensive Clothes Cleaning Hacks| ఖరీదైన బట్టలపై చిన్న మరక పడినా వెంటనే డ్రై క్లీనింగ్‌ చేయించాల్సి అవసరం ఉండదు. అలాగే చెమట వాసన వచ్చిన ప్రతిసారీ మొత్తం దుస్తులను ఉతకడం కూడా అవసరం లేదు. కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లోనే ఖరీదైన దుస్తులు తాజాగా ఉంచుకోవచ్చు. అయితే ఫ్యాబ్రిక్ పాడవకుండా కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ముందుగా డ్రెస్‌పై ఉన్న కేర్ లేబుల్ చూడండి

ఖరీదైన దుస్తులను శుభ్రం చేసే ముందు వాటిపై ఉన్న కేర్ లేబుల్‌ పరిశీలించండి. ఆ లేబుల్‌లో దుస్తులను ఎలా శుభ్రం చేయాలో తయారీదారు సూచనలు ఇస్తారు. కొన్ని బట్టలకు డ్రై క్లీనింగ్ మాత్రమే అవసరం చేయించాల్సి ఉంటుంది. మరికొన్ని దుస్తులను చాలా జాగ్రత్తగా ఇంట్లోనే శుభ్రం చేయవచ్చు. డ్రెస్‌పై స్వల్పంగా చెమట మరకలు లేదా వాసన మాత్రమే ఉంటే వెంటనే వాష్ చేయకూడదు.
సరైన పద్ధతిలో గాలి తగిలించడం ద్వారా కూడా స్వల్ప వాసన తగ్గించవచ్చు.

మరక ఉన్న చోట మాత్రమే శుభ్రం చేయండి

Advertisement

చిన్న మరక కోసం మొత్తం దుస్తులను నీటిలో నానబెట్టకండి. మరక ఉన్న ప్రాంతాన్ని మాత్రమే కొద్దిగా తడిపి జాగ్రత్తగా శుభ్రం చేయండి. తెలుపు లేదా లేత రంగు సున్నితమైన బట్టలపై మరకను గట్టిగా రుద్దకండి. అలా చేస్తే మరక మరింత విస్తరించడంతో పాటు ఫ్యాబ్రిక్ దెబ్బతినే అవకాశం ఉంది. బదులుగా శుభ్రమైన వస్త్రంతో మరక ఉన్న చోట మెల్లగా ప్రెస్ చేస్తూ శుభ్రం చేయండి.
ముదురు రంగు దుస్తుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ముందుగా లోపలి భాగంలో కొద్దిగా నీటితో పరీక్ష చేసి రంగు వెలువడుతుందో చూడండి.

వాసన వస్తే వెంటనే ఉతకాల్సిన అవసరం లేదు

దుస్తుల నుంచి చెమట వాసన వస్తే వాటిని వెంటనే ఉతకాల్సిన అవసరం లేదు. దుస్తులను లోపలికి తిప్పి, గాలి బాగా వచ్చే ప్రదేశంలో ఉంచండి. సహజమైన గాలి స్వల్ప చెమట వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఖరీదైన దుస్తులను ఎక్కువసేపు నేరుగా ఎండలో ఉంచకండి. సూర్యరశ్మి వల్ల కొన్ని బట్టల రంగు వెలిసే అవకాశం ఉంటుంది.

కాలర్, కఫ్‌లను ప్రత్యేకంగా శుభ్రం చేయండి

Advertisement

దుస్తుల్లో కాలర్, కఫ్ ప్రాంతాలు త్వరగా మురికిగా మారుతాయి. ఈ ప్రాంతాల్లో చెమట, నూనె, దుమ్ము ఎక్కువగా పేరుకుపోతాయి. అందుకే మొత్తం దుస్తులను పదేపదే శుభ్రం చేయకుండా ఈ భాగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇలా చేయడం వల్ల దుస్తులను తరచుగా ఉతకాల్సిన అవసరం తగ్గుతుంది.

ప్రతి మరకకు వేడి నీళ్లు ఉపయోగించకూడదు

పాలు, పెరుగు వంటి పదార్థాల మరకలపై వెంటనే వేడి నీటిని పోయకండి వేడి వల్ల కొన్ని ప్రోటీన్ ఫుడ్స్ మరకలు మరింత గట్టిగా మారుతాయి. అందుకే ముందుగా సాధారణ లేదా చల్లటి నీటిని ఉపయోగించడం మంచిది. అయితే కేర్ లేబుల్‌లో ఇచ్చిన సూచనలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇవ్వండి.

శుభ్రం చేసిన తర్వాత ఇలా ఆరబెట్టండి

ఖరీదైన దుస్తులను శుభ్రం చేసిన తర్వాత మెలికలు పెట్టి నీటిని పిండకండి. గట్టిగా పిండడం వల్ల బట్ట ఆకారం మారిపోయే అవకాశం ఉంటుంది. భారీ దుస్తులను తప్పుగా వేలాడదీసినా వాటి ఆకారం మారవచ్చు. అందుకే దుస్తులను గాలి వచ్చే ప్రదేశంలో సహజంగా ఆరనివ్వండి. సరైన హ్యాంగర్ ఉపయోగించి దుస్తులను జాగ్రత్తగా వేలాడదీయండి. సున్నితమైన బట్టలను అధిక వేడి లేదా తీవ్రమైన ఎండకు దూరంగా ఉంచండి.

Also Read: మీ పార్ట్‌నర్ మిమ్మల్ని ముందులాగా ప్రేమించడం లేదా? నిశ్శబ్దంగా ఈ 5 సంకేతాలతో తెలుసుకోండి

ఖరీదైన బట్టలు ఎక్కువకాలం కొత్తగా ఉంచడానికి చిన్న జాగ్రత్తలు

ఖరీదైన దుస్తులకు ప్రతి చిన్న సమస్యకు డ్రై క్లీనింగ్ అవసరం ఉండదు. కేర్ లేబుల్‌ను పరిశీలించడం, మరకలను త్వరగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. సరైన గాలి తగిలించడం, సున్నితంగా శుభ్రం చేయడం కూడా బట్టల క్వాలిటీని కాపాడుతుంది.
ఈ చిన్న జాగ్రత్తలతో మీకు ఇష్టమైన ఖరీదైన దుస్తులను ఎక్కువకాలం తాజాగా ఉంచుకోవచ్చు.

Related News

గర్భం రాకుండా కొత్త ఎమర్జెన్సీ మెడిసిన్.. ఈ కాంట్రాసెప్షన్ ఎప్పుడు తీసుకోవాలంటే

రోడ్డు పక్కన వాటర్ బాటిల్ కొంటున్నారా? ఈ 10 సెకన్ల ట్రిక్ తెలిస్తే షాక్ అవుతారు

యాపిల్ కొనేముందు తీయగా, జ్యూసీగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఈ టిప్స్ పాటిస్తే చాలా ఈజీ

స్లీపర్ బస్సుల్లో వరుస అగ్నిప్రమాదాలు..బస్సులో మంటలు చెలరేగితే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?

లేడీస్ సేఫ్టీ అలెర్ట్..రాత్రి ప్రయాణాల్లో ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలు కాపాడతాయి!

కటింగ్ బోర్డును కేవలం నీటితో కడుగుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!

వివాహ బంధంలో సమస్యలు.. విడాకుల పరిస్థితి నివారించడానికి 7 సూత్రాలు

Big Stories

Advertisement
×