E-Paper
Advertisement

టియాగో ఈవీ To విండ్సర్ ఈవీ.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

టియాగో ఈవీ To విండ్సర్ ఈవీ.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!
Advertisement

Affordable Electric Cars in India: ఇటీవలి కాలంలో భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ఫ్యూయల్ ఖర్చు, తక్కువ మెయింటెనెన్స్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం EVలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, కారు కొనుగోలు చేసే ముందు ధర, రేంజ్, మెయింటెనెన్స్ ఖర్చు, భవిష్యత్తులో ఎదురయ్యే ఖర్చుల గురించి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో ఉన్న చౌకైన ఈవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

MG కామెట్ EV

ప్రస్తుతం రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల బడ్జెట్‌లో పలు మంచి ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. సిటీ ప్రయాణాలకు MG కామెట్ EV అత్యంత సరసమైన మోడల్ గా కొనసాగుతోంది.  దీని ధర సుమారు రూ.6.24 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి పూర్తి ఛార్జ్‌ చేస్తే 230 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెప్తోంది. అయితే, వాస్తవ పరిస్థితుల్లో 160 నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

టాటా టియాగో EV

Advertisement

టాటా టియాగో EV కూడా మధ్యతరగతి కొనుగోలుదారుల్లో మంచి ఆదరణ పొందుతోంది. దీని ధర రూ.5.84 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ వేరియంట్‌ను బట్టి 226 నుంచి 285 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుందని కంపెనీ చెప్పినా.. సాధారణ వినియోగంలో 180 నుంచి 210 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

టాటా పంచ్ EV

కొంచెం ఎక్కువ స్థలం, SUV తరహా డిజైన్ కోరుకునే వారికి టాటా పంచ్ EV మంచి ఆప్షన్ గా చెప్పొచ్చు. దీని ధర సుమారు రూ.8.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. వాస్తవ వినియోగంలో 220 నుంచి 270 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ EV, MG విండ్సర్ EV

Advertisement

ఎక్కువ రేంజ్‌తో పాటు లాంగ్ డ్రైవ్‌ల కోసం చూస్తే టాటా నెక్సాన్ EV, MG విండ్సర్ EV మంచి ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు.  నెక్సాన్ EVలో వేరియంట్‌ను బట్టి 250 నుంచి 320 కిలోమీటర్ల వరకు నిజమైన రేంజ్ లబిస్తుంది. MG విండ్సర్ EV కూడా ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 280 నుంచి 330 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

బ్యాటరీ, మెయింటెనెన్స్ ఖర్చుల గురించి..

చాలామందికి EV కార్ల బ్యాటరీ ఎంతకాలం పనిచేస్తుందనే అనుమానం ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువ కంపెనీలు ఉపయోగిస్తున్న లిథియం-అయాన్, LFP బ్యాటరీలకు 8 సంవత్సరాలు, 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. సాధారణంగా సరైన విధంగా ఉపయోగిస్తే బ్యాటరీలు చాలా సంవత్సరాలు చక్కగా పనిచేస్తాయి.

మెయింటెనెన్స్ విషయానికి వస్తే, పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఈవీల్లో ఖర్చు చాలా తక్కువ. ఇంజిన్ ఆయిల్, స్పార్క్ ప్లగ్స్, క్లచ్, గేర్‌బాక్స్ లాంటి భాగాలు లేకపోవడంతో తరచూ సర్వీసింగ్ అవసరం ఉండదు. సాధారణంగా టైర్లు, బ్రేక్ ప్యాడ్లు, వైపర్లు, వాషర్ ఫ్లూయిడ్, క్యాబిన్ AC ఫిల్టర్ లాంటి వాటిని మాత్రమే అవసరమైనప్పుడు మార్చాల్సి ఉంటుంది.

ఈవీలకు ఎదురయ్యే సమస్యలు

EV కొనుగోలు చేసే ముందు కొన్ని సవాళ్లను కూడా గుర్తుంచుకోవాలి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, హైవేల్లో ఛార్జింగ్ సదుపాయాలు తక్కువగానే  అంతేకాదు, 8 నుంచి 10 సంవత్సరాల తర్వాత బ్యాటరీ మార్చాల్సి వస్తే ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.  ప్రతి కిలోమీటర్‌ కు ఖర్చు పెట్రోల్ కార్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటంతో లాంగ్ రన్ లో లాభం కలిగే అవకాశం ఉంటుంది.

Read Also: BYD చౌకైన ఈవీ వచ్చేస్తోంది.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!

Tags

Related News

ఈవీ మార్కెట్ లో టీవీఎస్ దూకుడు.. జస్ట్ 7 నెలల్లో 3 లక్షలకుపైగా స్కూటర్ల సేల్!

కియా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.5 లక్షల తగ్గింపు!

టాటా To కియా.. రూ.20 లక్షల్లోపు బెస్ట్ సౌండ్ సిస్టమ్ కార్లు ఇవే!

BYD చౌకైన ఈవీ వచ్చేస్తోంది.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!

ఏథర్ కొత్త స్కూటర్‌కు ‘కోనార్క్’ పేరు ఎందుకు? అసలు విషయం చెప్పిన సీఈఓ మెహతా!

ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రాండ్ ఎంట్రీ, జస్ట్ రూ. లక్షకే కొత్త ఫ్యామిలీ ఈవీ!

కొనుగోలుదారులకు టీవీఎస్ షాక్.. ఐక్యూబ్ సహా పలు స్కూటర్ల ధరలు భారీగా పెంపు!

Big Stories

Advertisement
×