Chiranjeevi: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత రూమర్స్ కి కొదవే లేకుండా పోయింది. కాస్త హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతున్నారు కొంతమంది నెటిజన్స్. ఈ క్రమంలోనే అటు హీరోయిన్స్ నే కాదు ఇటు హీరోలపై కూడా లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూ వారిని వార్తల్లో నిలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పైనే ఒక రూమర్ సృష్టించి, సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. దీంతో ఆయన టీం స్పందిస్తూ అసలు విషయాన్నీ బయటపెట్టింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో పెంపొందించడానికి పర్యాటక పెట్టుబడుల రంగాన్ని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్ర ప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది అంటూ ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలలో కూడా ఉన్న అపారమైన ప్రజాదరణను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రాతినిధ్యం, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడం, నవ్యాంధ్ర పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడమే ప్రధాన ధ్యేయంగా ఈ అంబాసిడర్ ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని.. ఆయన కూడా ఒప్పుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే ఈ విషయం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వరకు చేరడంతో వెంటనే ఆయన టీం స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టింది. “మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్ అవుతారన్న రూమర్స్ ను నమ్మవద్దు. అలాగే వాటిని వ్యాప్తి చేయవద్దు. దయచేసి ఇలాంటి దృవీకరించని నకిలీ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం లేదా ప్రచారం చేయడం మానుకోండి” అంటూ మెగాస్టార్ టీం వదంతులపై చెక్ పెట్టి, ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అంటూ విజ్ఞప్తి చేసింది. మొత్తానికైతే బ్రాండ్ అంబాసిడర్ అంటూ వస్తున్న వార్తలకు టీం ఒక్కసారిగా స్పందించి క్లారిటీ ఇచ్చింది.
also read:ఎవరీ వాసవి గణేషన్.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీ!
ఇదిలా ఉండగా సెలబ్రిటీలకి ఉన్న అపారమైన ప్రజాదరణను దృష్టిలో పెట్టుకొని పలు రాష్ట్రాల ప్రతినిధులు, సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్న విషయం తెలిసిందే.. ఇక అందులో భాగంగానే ఇప్పటికే గుజరాత్ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి, అక్కడి పర్యాటక రంగానికి విశేష ప్రజాదరణ తీసుకురావడానికి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అటు జపాన్ పర్యాటక కేంద్రం కూడా దక్షిణాదిలో విశేష ప్రజాదారణ సొంతం చేసుకున్న ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul mohan) ని కూడా రాయబారిగా నియమించారు. ఇక అందుకే మెగాస్టార్ చిరంజీవిని కూడా అదే తరహాలో నియమించబోతున్నారు అంటూ వార్తలు రాగా ఆయన బృందం స్పందించి ఆ వార్తలకు చెక్ పెట్టింది.
DON'T BELIEVE OR SPREAD ANY RUMOURS regarding Megastar #Chiranjeevi Garu becoming the official Brand Ambassador of Andhra Pradesh.
Please refrain from sharing or amplifying such unverified and FAKE information.
-Team Megastar Chiranjeevi.
— Team Megastar (@MegaStaroffl) August 6, 2026