Ashwin: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవిచంద్రన్ అశ్విన్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అయితే తనకు తిక్క రేగితే మాత్రం ఎవ్వరిని వదలడు. బహిరంగంగానే… తన నోటికి పని చెప్పి వివాదంలో చిక్కుకుంటాడు. అలా చాలాసార్లు వివాదంలో చిక్కుకొని… వార్తల్లో నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే తాజాగా… మరో వివాదంలో చిక్కుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఏకంగా లేడీ అంపైర్ తో గొడవ పెట్టుకుని… అడ్డంగా దొరికిపోయాడు రవిచంద్రన్ అశ్విన్.
Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్
లేడీ అంపైర్ ను దారుణంగా తిట్టిన రవిచంద్రన్ అశ్విన్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్లో దిండిగల్ టీం కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే కెప్టెన్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన రవిచంద్రన్ అశ్విన్.. కాస్త రౌడీల వ్యవహరించాడు. లేడీ అంపైర్ అని చూడకుండా.. ఆ రేంజ్ లో రెచ్చిపోయాడు రవిచంద్రన్ అశ్విన్.
జూన్ 8వ తేదీన అంటే నిన్నటి రోజున దిండిగల్ డ్రాగన్స్ వర్సెస్ ఐ డ్రీమ్ తిరుపూర్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ఓపెనర్ గా బరిలోకి దిగి… రచ్చ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. ఈ నేపథ్యంలోనే సాయి కిషోర్ వేసిన ఓ అద్భుతమైన బంతికి రవిచంద్రన్ అశ్విన్ దొరికిపోయాడు. లెగ్ సైడ్ ఆడబోయి.. వికెట్ల ముందు దొరికిపోయాడు అశ్విన్. ఈ తరుణంలోనే వెంటనే బౌలర్ సాయి కిషోర్… ఫీల్డ్ అంపైర్ ను చూస్తూ అప్పీల్ చేశాడు. దీంతో అక్కడే ఉన్న మహిళ అoపైర్ … వెంటనే రవిచంద్రన్ అశ్విన్ అవుట్ అంటూ ప్రకటించేసింది.
దీంతో రెచ్చిపోయిన రవిచంద్రన్ అశ్విని ఆమెపై రౌడీయిజం చేశాడు. ఇదెక్కడ అవుట్ ? బంతి అసలు వికెట్లకు తగిలేలా రాలేదు.. పిచ్ అవుట్ సైడ్ బంతి… దాన్ని ఎలా అవుట్ ఇస్తావు ? అంటూ ఆ అంపైర్ పైన సీరియస్ అయ్యాడు రవిచంద్రన్. దీనికి సంబంధించిన సంఘటన ఇప్పుడు వివాదంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రవిచంద్రన్ అశ్విన్ పై క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సీనియర్ క్రికెటర్ అయి ఉండి గ్రౌండ్ లో అలా ప్రవర్తించడం చాలా తప్పు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ పెద్దగా రాణించింది ఏమీ లేదు. కేవలం 11 బంతుల్లో రెండు బౌండరీలు అలాగే ఒక సిక్సర్ కొట్టాడు. ఈ నేపథ్యంలోనే 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రవిచంద్రన్ అశ్విన్.
Ashwin was controlling himself just because the umpire was a female 😭🙏pic.twitter.com/3XM6WAMPgy
— Kusha Sharma (@Kushacritic) June 9, 2025