Thalliki Vandhanam: తల్లికి వందనం డబ్బులు ఊర్లో గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధికి విరాళం ఇచ్చిందామె. అంతేకాదు సొంత డబ్బు కూడా స్కూల్ అభివృద్ధికి ఖర్చు చేస్తోంది. ఇంతకీ ఎవరామే.. ఆ స్కూల్ ఎక్కడుంది.
తల్లికి వందనం డబ్బులతో.. స్కూల్ అభివృద్ధికి విరాళం
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలోని మత్స్యలేశం ఓ గ్రామం. ఈ గ్రామంలోనే ఉంటున్నారు శోభారాణి అనే మహిళ. తనకు ఈ మధ్య వచ్చిన తల్లికి వందనం డబ్బులను స్కూల్ డెవలప్‌మెంట్ కోసం ఇచ్చేశారు. శోభారాణి తల్లిదండ్రుల నుండి పొందిన విలువలు, గ్రామంపై ఉన్న ప్రేమ, గ్రామంలోని పిల్లల భవిష్యత్‌పై ఉన్న ఆకాంక్ష.. ఇలా మూడూ కలిసి ఆమెను ఈ గొప్ప నిర్ణయం తీసుకునేలా చేశాయి.
సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు
కేవలం వందనం డబ్బులతోనే కాదు, తన స్వంతంగా కూడా డబ్బు ఖర్చు చేసి స్కూల్ అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు శోభారాణి. పిల్లలకు అవసరమైన బెంచీలు, బోర్డులు, విద్యా సామగ్రి, పఠన గదుల నిర్మాణానికి కూడా తాను సాయం చేస్తానని చెప్పారు.
పల్లె పాఠశాలకు పదునెక్కుతున్న సాయం
ఊర్లో స్కూల్ అభివృద్ధికి శోభారాణిలాగే చాలామంది దాతలు ముందుకొస్తున్నారు. స్కూల్‌ని డెవలప్ చేయడానికి ఎంతవరకైనా వెళ్తామని చెబుతున్నారు. మా ఊరి పిల్లలు బయటకు వెళ్లకుండా ఇక్కడే మంచి చదువు పొందాలి” అన్న ఆశయంతో వారు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు.
అయితే ఊర్లో నుంచి 6,7,8 తరగతులను హైస్కూల్‌కు తరలించే ప్రక్రియను.. ప్రభుత్వం నిలిపివేయాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ఇలాగే తరలిస్తే ఊర్లోని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలని ఇంట్రెస్ట్ పిల్లలకు పోతుందని.. ప్రైవేట్ స్కూల్‌కి వెళ్ళిపోతారని దాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయుల సమర్పణతో పాఠశాల ఎదుగుతుంది
ఈ స్కూల్లోని టీచర్లు కూడా భరోసా కలిగించే విధంగా పని చేస్తున్నారు. విద్యార్థుల ప్రతిభను మెచ్చుకుంటూ, వారు కేవలం చదువులోనే కాదు .. కరాటే, యోగా, సంగీతం వంటి రంగాల్లో కూడా shine అవుతున్నారని చెప్పారు. గ్రామస్థుల సహకారంతో స్కూల్ కార్పొరేట్ స్థాయిలో ఎదుగుతోంది.
Also Read: ఎంపీ మిథున్‌రెడ్డికి దక్కని ఊరట, ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం
విద్యే శాశ్వత ధనం
ఇలాంటి కథలు మనకు నిరూపించేది ఒక్కటే – విద్యకు అడ్డుకట్టలు ఉండవు. శోభారాణి చూపించిన మార్గం మనకు స్ఫూర్తిదాయకం. “తల్లికి వందనం” ఒక్క మంచి కార్యక్రమమే కాదు, అది గ్రామాభివృద్ధికి ఆరంభ బిందువుకూడా అవుతుంది. ఇలాంటి కథనాలు మరిన్ని రావాలని, గ్రామాల్లోని విద్యా దీపాలు ఎప్పటికీ వెలగాలని ఆశిద్దాం.