Nayanthara: ప్రస్తుతం సినీ ఇండస్రీలో మూవీ స్వీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా హిట్ కొడితే చాలు.. దానికి సెకండ్ పార్ట్ తీసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే తరహాలో నయనతార హిట్ మూవీ ‘అమ్మోరు తల్లి’.. అంటే ‘మూకుతి అమ్మన్’కు కూడా సీక్వెల్ సిద్ధమవుతోంది. తెలుగులో దీని టైటిల్ ఇంకా ఖరారు కాకపోయినా తమిళంలో ‘మూకుతి అమ్మన్ 2’ పేరుతో ఈ సీక్వెల్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా పూర్తయ్యి దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో విలన్‌గా ఒక యంగ్ హీరో నటిస్తున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
సీక్వెల్ కోసం మార్పులు
2020లో ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ దర్శకత్వం వహించిన ఫాంటసీ కామెడీ ‘మూకుతి అమ్మన్’. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలయినా ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చడంతో ఓటీటీ హిట్‌గా నిలిచింది. ప్రధాన పాత్రలో నయనతార, ఆర్జే బాలాజీ కనిపించగా ఊర్వశి, స్మృతి వెంకట్, ఇంధుజ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకి స్వీక్వెల్‌గా ‘మూకుతి అమ్మన్ 2’ పేరుతో ఆడియన్స్‌ను అలరించేందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఆర్జే బాలాజీకి బదులుగా సుందర్ సి సెకండ్ పార్ట్‌కి దర్శకత్వం వహిస్తారని ప్రకటించడంతో పాటు మరి కొన్ని మార్పులు కూడా ఈ సినిమాలో ఉంటున్నట్లు తెలుస్తుంది. లీడ్ రోల్‌లో అమ్మవారి పాత్రలో కనిపించనున్న నయనతార (Nayanthara)కి పోటీగా విలన్ పాత్రలో క్రేజీ యాక్టర్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
రెండోసారి విలన్‌గా
రీసెంట్‌గా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘మూకుతి అమ్మన్ 2’లో అరుణ్ విజయ్ (Arun Vijay) విలన్ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. గతంలో ఈ నటుడు విలన్‌గా పోషించిన ‘యెన్నై అరిందాల్’లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వస్తున్న వార్తలు నిజమైతే అరుణ్ విజయ్ ‘మూకుతి అమ్మన్ 2’ సినిమాలో విలన్‌గా కోలీవుడ్ ఆడియన్స్‌ని మరోసారి మెప్పించనున్నాడు. పార్ట్ 1 ఓటీటీలో హిట్ కావడంతో ప్రస్తుతం ‘మూకుతి అమ్మన్ 2’లో అరుణ్ విజయ్ విలన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మార్చి 6న గ్రాండ్‌గా పూజతో ప్రారంభమైంది.
Also Read: సైఫ్ వారసుడి రౌడీయిజం.. నీ అంతు చూస్తానంటూ ఫిల్మ్ క్రిటిక్‌కు బెదిరింపులు..
భారీ బడ్జెట్
‘మూకుత్తి అమ్మన్ 2’ (Mookuthi Amman 2) దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోతుందని సమాచారం. ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది కాబట్టి దాని సీక్వెల్‌పై ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి కూడా నిర్మాతలు పెద్దగా ఆలోచించడం లేదు. ఈ కార్యక్రమం కోసం గుడిలాంటి భారీ సెట్ కూడా సిద్ధం చేశారు. ముందుగా ‘మూకుతి అమ్మన్ 2’లో నయనతార స్థానంలో మరొక సీనియర్ హీరోయిన్ నటిస్తుందని రూమర్స్ వచ్చినా అవన్నీ రూమర్సే అని తేలిపోయింది.