E-Paper
Advertisement

ప్రతి గ్రామానికి సొంత భవనం.. వేసవి తాగునీటిపై సీతక్క స్పెషల్ యాక్షన్ ప్లాన్!

ప్రతి గ్రామానికి సొంత భవనం.. వేసవి తాగునీటిపై సీతక్క స్పెషల్ యాక్షన్ ప్లాన్!
Advertisement

Sitakka: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరి పరిధిలోని అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శనివారం కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను ఆమె వెల్లడించారు.

గ్రామ పంచాయతీ, మహిళా భవనాలు

Advertisement

రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండేలా చూస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం భవనాలు లేని 5,118 పంచాయతీల కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఇప్పటికే 3,269 భవనాల పనులు 70 శాతం పూర్తయ్యాయని, మిగిలినవి ఈ ఏడాదే పూర్తి చేస్తామన్నారు. వీటితో పాటు 8,000 గ్రామాల్లో రూ.800 కోట్లతో మహిళా సంఘాల భవనాలను నిర్మిస్తున్నామని, ఇవి చివరి దశకు వచ్చాయని చెప్పారు.

హ్యామ్ విధానంలో గ్రామీణ రహదారులు

Advertisement

దేశంలోనే తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ పద్ధతిలో రోడ్లు నిర్మిస్తున్నట్లు సీతక్క తెలిపారు. మొదటి విడతలో ఈ నాలుగు జిల్లాల్లోనే 3,861 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.3,382 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కాంట్రాక్టర్లు నాణ్యతతో, గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అక్టోబర్ నుంచి జూన్ వరకు నిర్మాణాలకు అనువైన సమయమని, దీన్ని వీలైనంతగా వాడుకోవాలని సూచించారు.

ఎల్‌నినో హెచ్చరికలు.. తాగునీటి ప్రణాళిక

రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. సింగూరు రిజర్వాయర్‌లో నీటి మట్టం తక్కువగా ఉన్నందున, అక్కడ ప్రత్యేక అధికారిని నియమించి నిజాంసాగర్ నుంచి నీటిని తరలించే చర్యలు వేగవంతం చేయాలన్నారు. అలాగే ప్రతీ మండలానికి ముగ్గురు సభ్యులతో ‘డ్రింకింగ్ వాటర్ మేనేజ్‌మెంట్ కమిటీ’ని ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా గిరిజన, చెంచు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

ఉపాధి హామీ, పనితీరుపై హెచ్చరిక

వర్షాభావ పరిస్థితుల వల్ల ఉపాధి హామీ పనులను పెంచాలని, అందుకోసం రూ.6,000 కోట్ల బడ్జెట్ సిద్ధంగా ఉందన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సీతక్క స్పష్టం చేశారు. ‘మంచిగా పనిచేసే అధికారులకు సన్మానాలు ఉంటాయి.. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు’ అని గట్టిగా హెచ్చరించారు.

Also Read: మహిళను ముక్కలుగా నరికి కెనాల్‌లో పడేసాడు.. ఇబ్రహీంపట్నం మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు!

Tags

Related News

కేసీఆర్ ప్రజల గుండెల్లో లేరు.. పామ్‌హౌస్‌లో దాక్కున్నారు! కేటీఆర్‌కి ఎమ్మెల్యే మురళీ నాయక్ కౌంటర్!

ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం.. ఘట్‌కేసర్ వద్ద విషాదం!

మహిళను ముక్కలుగా నరికి కెనాల్‌లో పడేసాడు.. ఇబ్రహీంపట్నం మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు!

మరీ ఇంత దారుణమా.. సూర్యపేట జిల్లాలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్!

డిజిటల్ తెలంగాణలో లైవ్ స్టాక్ చీకట్లు.. ఏళ్లు గడుస్తున్నా లేని వెబ్‌సైట్!

కిషన్ రెడ్డి ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ఖైరతాబాద్ పోరులో కమలం టాప్ గేర్!

గణేష్ శోభాయాత్రలో చిందులేసిన సీపీ సజ్జనార్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×