YouTube Custom Feeds: వీడియో లవర్స్, క్రియేటర్లకు యూట్యూబ్ తీపి కబురు అందించింది. న్యూయార్క్‌లో నిర్వహించిన ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ ఈవెంట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే పలు విప్లవాత్మక ఫీచర్లను అధికారికంగా ప్రకటించింది. యూజర్ల వీక్షణ అనుభవాన్ని మార్చడంతో పాటు, క్రియేటర్ల వీడియో ఎడిటింగ్ శ్రమను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త టూల్స్ తీసుకొస్తోంది. ఈ అప్‌డేట్స్‌లో ఉన్న ప్రధాన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇకపై మీరు డిమాండ్ చేసినట్టే యూట్యూబ్ మారుతుంది. రాత్రిపూట డాక్యుమెంటరీలు, పొద్దున్నే డిఐవై (DIY) వీడియోలు.. ఇలా మీ మూడ్‌కు తగ్గట్టు హోమ్‌పేజీలోనే ప్రత్యేక ‘కస్టమ్ ఫీడ్స్’ ట్యాబ్స్ సెట్ చేసుకోవచ్చు. అలాగే ‘ఆస్క్ యూట్యూబ్’ ద్వారా షాపింగ్ డీల్స్, రివ్యూలు చూడటం, టీవీల్లో వాయిస్ కామెంట్స్ పెట్టడం మరింత ఈజీ కాబోతోంది. పాడ్‌కాస్ట్ ప్రియుల కోసం పర్సనలైజ్డ్ లైన్ అప్ కూడా రానుంది.
Also Read: సేల్ మొదలవకముందే అమెజాన్ బంపర్ ఆఫర్లు.. ఇంత తక్కువ ధరకు ఇలాంటి ఫోన్లు, టీవీలా?
క్రియేటర్లకు ఎడిటింగ్ భారాన్ని తగ్గించేందుకు గూగుల్ జెమిని ఏఐ ఆధారిత టూల్స్ వస్తున్నాయి. యూట్యూబ్ క్రియేట్ యాప్‌లోని ‘కాన్వర్సేషనల్ ఏఐ ఎడిటింగ్’ ద్వారా మీరు నోటితో మాట్లాడి సూచనలు ఇస్తే చాలు.. లాగ్ ఉన్న సీన్లను కట్ చేయడం, మ్యూజిక్ సింక్ చేయడం అవే చూసుకుంటాయి. దీనికితోడు ఛానెల్ స్టైల్‌కు తగ్గట్టు థంబ్‌నెయిల్స్‌ను ఏఐ వేగంగా జనరేట్ చేస్తుంది.
లైవ్ స్ట్రీమింగ్ చేసేవారికి ‘లైవ్ ఆటో డబ్బింగ్’ ఒక పెద్ద వరంగా మారనుంది. 2027 ప్రారంభంలో రానున్న ఈ ఫీచర్‌తో మీరు ఏ భాషలో మాట్లాడినా, వీక్షకులకు వారి స్వభాషలోనే రియల్ టైమ్‌లో అనువాదం వినిపిస్తుంది. మరోవైపు ఇద్దరు క్రియేటర్లు కలిసి సరదాగా స్ట్రీమ్ చేయడానికి ‘గో లైవ్ టుగెదర్’ వంటి ఆప్షన్లు కూడా చేరుతున్నాయి.
క్రియేటర్ల భద్రత కోసం ప్రత్యేక రక్షణ ఫీచర్లు వచ్చాయి. మన ముఖం, గొంతును వేరొకరు దుర్వినియోగం చేయకుండా ‘లైక్‌నెస్ డిటెక్షన్’ రక్షణ కల్పిస్తుంది. అలాగే షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నారు. మొత్తంమీద యూట్యూబ్ తీసుకొస్తున్న ఈ మార్పులు వీక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడమే కాకుండా.. క్రియేటర్లకు సంపాదన మార్గాలను మరింత పెంచబోతున్నాయి.
Also Read: జస్ట్ రూ.6 వేలకే అమెజాన్ బెస్ట్ సెల్లింగ్ టాబ్లెట్.. ప్రైమ్ యూజర్లకు గోల్డెన్ ఛాన్స్ భయ్యా!