Trolls on Pawan Kalyan: మూడు నెలల క్రితం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా ఎంత తీవ్ర దుమారం రేగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వినియోగించారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సమయంలో తిరుమల లడ్డూ కల్తీపై పవన్ కల్యాణ్ ఓ రేంజ్‌లో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ నాణ్యత రుచి పై పలు రకాలుగా పవన్ మాట్లాడారు.
తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వాడినట్లు రిపోర్టులో తేలిందని కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడారు. జంతువుల నూనెను వాడి ఆలయ పవిత్రతను దెబ్బ తీశారని ఫైరయ్యారు. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారు? అని సమయంలో ప్రశ్నించారు. ఈ ఘటనను సహించేది లేదని తెలిపారు. భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు అని డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు.
అయితే.. నిన్న తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వారక దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలసిందే. అయితే పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూపై మాట్లాడిన 108 రోజుల తర్వాత తిరుమలలో అపశృతి జరిగిందని పలువురు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. తిరుమల లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్.. మళ్లీ సరిగ్గా 108 డేస్ తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పాడని.. దేవుడు అన్ని గమనిస్తూనే ఉంటారని వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan : తిరుమల సాక్షిగా పవన్ సీరియస్ వార్నింగ్.. ఇకపై ఆ విధానం పూర్తిగా రద్దు చేయాల్సిందే..
తిరుమల లడ్డూపై ఎలాంటి కల్తీ జరగకపోయినా.. కూటమి నేతలు క్రియేట్ చేశారని.. తిరుమల స్వామి వారు నిత్యం గమనిస్తూనే ఉంటారని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. లడ్డూ విషయంలో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ ఎలాంటి తప్పుడు పని చేయలేదని.. వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.