E-Paper
Advertisement

భీమవరంలో దారుణం.. స్నానానికి కాలువలో దిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

భీమవరంలో దారుణం.. స్నానానికి కాలువలో దిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!
Advertisement

Bhimavaram: భీమవరం పరిసర ప్రాంతాల్లో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ సమీపాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా స్నానానికి వెళ్లిన ఆరుగురు స్నేహితుల్లో ఇద్దరు కాలువలో మునగిపోయి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది.

సరదాగా వెళ్లి విషాదంలో ముగిసి..

Advertisement

SRKR ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు పాలకొడేరు మండలంలోని వేండ్ర కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. నీటి ప్రవాహంలో లోతు ఎక్కువ ఉండటంతో స్నానం చేస్తుండగా తమిళనాడుకు చెందిన పెరుమాళ్ విఘ్నష్ (22), విశాఖపట్నంకు చెందిన రాహుల్ (21) ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు.

మృతదేహాల వెలికితీత

Advertisement

సహచర విద్యార్థులు వెంటనే కేకలు వేయడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది , పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.

పోలీసుల దర్యాప్తు

విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా ఏమీ చేయలేరు.. పరకాల సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×