E-Paper
Advertisement

ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయండి..వీడియో కాల్ లో బంగ్లాదేశ్ ప్రధాని

ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయండి..వీడియో కాల్ లో బంగ్లాదేశ్ ప్రధాని
Advertisement

Bangladesh PM congratulates team on video call:  బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు (Bangladesh cricket team) రోజు రోజుకు అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఇటీవల కాలంలో ఎవరు ఊహించని విజయాలను నమోదు చేసుకున్న బంగ్లాదేశ్… కంగారు జట్టుపై కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. డార్విన్ ( Marrara Cricket Ground, Darwin) వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. టెస్ట్ క్రికెట్ హోదా సంపాదించిన నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఒక్క విజయాన్ని కూడా బంగ్లాదేశ్ నమోదు చేసుకోలేదు. అయితే ఇవాళ ఆ జట్టును ఓడించి చారిత్రాత్మక రికార్డు సృష్టించింది బంగ్లాదేశ్. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో 1-0 తేడాతో లీడింగ్ లోకి వచ్చింది బంగ్లాదేశ్. సెకండ్ టెస్ట్ డ్రా లేదా విజయం సాధిస్తే మాత్రం మరో చరిత్ర తిరగరాస్తుంది బంగ్లా.

ఆసీస్ పై బంగ్లాదేశ్ విక్ట‌రీ.. ప్రధాని తారిక్ రెహమాన్ వీడియో కాల్

ఆస్ట్రేలియాపై ఆదివారం రోజున చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన బంగ్లాదేశ్ జట్టుపై ఆ దేశ ప్రధాని తారిక్ రెహమాన్ ( Bangladesh PM Tarique Rahman ) రహమాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియాలో ఉన్న తమ బంగ్లాదేశ్ జట్టుకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆస్ట్రేలియాపై విజయం సాధించిన వెంటనే, సంతోషం త‌ట్టుకోలేక‌ బంగ్లాదేశ్ జట్టు సభ్యులకు వీడియో కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ తమీమ్ ఇక్బాల్ కు శుభాకాంక్షలు తెలిపి.. ఆ తర్వాత ప్లేయర్లతో మాట్లాడారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

ఓ బస్సులో ట్రావెలింగ్ చేస్తూనే.. బంగ్లాదేశ్ క్రికెటర్లతో మాట్లాడి, కీలక ఆదేశాలు జారీ చేశారు ప్ర‌ధాని తారిక్ రెహమాన్. 2003 సమయంలో ఆస్ట్రేలియా మనల్ని అవమానించిందని… ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినట్లు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ వెల్లడించారు. ఆ సమయంలో టెస్ట్ లకు బంగ్లాదేశ్ పనికి రాదని వాళ్లు అవమానించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఆస్ట్రేలియా జట్టును వైట్ వాష్ చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే బంగ్లాదేశ్ సత్తా ఏంటో అందరికీ తెలుస్తుందని దిశా నిర్దేశం చేశారు తారిక్ రెహమాన్.

2003లోనే బంగ్లాదేశ్ ను అవ‌మానించిన ఆసీస్

Advertisement

2003 సంవత్సరంలో బంగ్లాదేశ్ జట్టును దారుణంగా అవమానించింది ఆస్ట్రేలియా. బంగ్లాదేశ్ జట్టుకు టెస్ట్ క్రికెట్ ఆడే అర్హత లేదని మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ హుక్స్ వివాదాస్పద వ్యాఖ్యలు అప్పట్లో చేశారు. ఒకవేళ ఆస్ట్రేలియాతో ఆడితే.. ఒకే రోజులో బంగ్లాదేశ్ ను ఫినిష్ చేస్తామని హెచ్చరించారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలోనే ఆస్ట్రేలియా ఓడిపోయింది.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

 

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Tags

Related News

Ms Dhoni: ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా ఎందుకు ఉండ‌దు?

కేఎల్ రాహుల్ పెద్ద సెల్ఫీష్‌.. న‌న్ను కావాల‌నే ర‌నౌట్ చేశాడు ?

బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోర‌ ఓట‌మి..టీమిండియాకు బిగ్ రిలీఫ్‌

23 ఏళ్ల కింద‌ట అవ‌మానం…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పైనే ప్ర‌తీకారం తీర్చుకున్న బంగ్లా

మెట్ల‌పైనే కుప్ప‌కూలిన‌ కేఎల్ రాహుల్…బీసీసీఐ చేత‌గానీ త‌న‌మే కార‌ణమంటూ విమ‌ర్శ‌లు !

మా హోట‌ల్ రూంకు వ‌చ్చి, కొడ‌తాన‌ని షోయ‌బ్ అక్త‌ర్ వార్నింగ్ ఇచ్చాడు

గాయాల పేరుతో బుమ్రా డ్రామాలు..1000 జ‌న్మలు ఎత్తినా వ‌సీం అక్ర‌మ్ స్థాయికి చేరుకోడు!

Big Stories

Advertisement
×