E-Paper
Advertisement

ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్.. బ్లాక్‌లో టికెట్ల విక్రయం.. నలుగురు అరెస్ట్!

ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్.. బ్లాక్‌లో టికెట్ల విక్రయం.. నలుగురు అరెస్ట్!
Advertisement

T20 Ticket Scam: భారత్​.. వెస్టిండీస్​ జట్ల మధ్య నేడు ఉప్పల్​ స్టేడియంలో జరుగనున్న టీ20 మ్యాచ్​ కు చెందిన కాంప్లిమెంటరీ టిక్కెట్లు బ్లాక్​ మార్కెట్​ కు చేరాయి. కొంతమంది వ్యక్తులు వీటిని విక్రయిస్తున్నట్టుగా అందిన సమాచారంతో గోషామహల్​ పోలీసులు దాడులు జరిపి నలుగురిని అరెస్ట్​ చేశారు. నిందితుల్లో ఒకరు హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ (హెచ్​సీఏ) సభ్యుడు ఉన్నాడు. వీరి నుంచి మ్యాచ్ టిక్కెట్లు, నగదు, మొబైల్ ఫోన్లు, టూ వీలర్ ను స్వాధీనం చేసుకున్నారు. గోషామహల్ పోలీస్​ స్టేషన్​ సీఐ శ్రవణ్​ కుమార్​ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

11కాంప్లిమెంటరీ టిక్కెట్లు..

సోమవారం రాత్రి ఏఎస్​ఐ జనార్ధన్​ నాయక్​, కానిస్టేబుల్ సాయికుమార్​ లు బేగంబజార్​ లోని ఎస్డీ మాల్​ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ టిక్కెట్లను కొందరు బ్లాక్‌లో అమ్ముతున్నట్టు తెలిసింది. వెంటనే దాడి చేసిన ఏఎస్​ఐ జనార్ధన్​ నాయక్​, కానిస్టేబుల్​ సాయికుమార్ లు కోఠి ఉమెన్స్​ కాలేజీ ప్రాంత నివాసి అవినాశ్​ ధారక్ (24), సైదాబాద్​ నివాసి మోహిత్​ సోమాని (3‌‌0)లను పట్టుకున్నారు. తనిఖీ చేయగా వారి వద్ద నాట్​ ఫర్​ సేల్​ అని రాసి ఉన్న 11కాంప్లిమెంటరీ టిక్కెట్లు, 8దాండియా పాస్​ లు, 5వేల నగదు, 3మొబైల్​ ఫోన్లు దొరికాయి.

హెచ్​సీఏ లింకు..

Advertisement

నిందితులను జరిపిన విచారణలో ఈ టిక్కెట్లను కాచిగూడ నివాసి ఆకర్షిత్​ శ్రీవాత్సవ నుంచి సేకరించినట్టు వెల్లడైంది. ఆకర్షిత్ తండ్రి సతీష్ చంద్ర శ్రీవాస్తవ హెచ్​సీఏలో సభ్యుడని తేలింది. తండ్రి నుంచి సంపాదించిన ఈ కాంప్లిమెంటరీ టిక్కెట్లను ఆకర్షిత్ తన స్నేహితుడైన అవినాష్ దారక్‌కు విక్రయించినట్టుగా నిర్ధారణ అయ్యింది. అవినాష్​ దారక తన బావమరిది మోహిత్ సోమాని సాయంతో టికెట్లను తమ వాట్సాప్ స్టేటస్‌ లు, ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాల్లో విక్రయానికి పెట్టినట్టుగా తేలింది. వీటితో పాటు ఆన్‌ లైన్‌ లో కొనుగోలు చేసిన మరికొన్ని టిక్కెట్లను కూడా కలిపి సోషల్ మీడియా ద్వారా సంప్రదించిన కస్టమర్లకు బ్లాక్ మార్కెట్‌ లో భారీ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు వెల్లడైంది. ఈ క్రమంలో ఆకర్షిత్​ శ్రీవాత్సవ అతని తండ్రి సతీష్​ చంద్ర శ్రీవాత్సవలను కూడా అరెస్ట్​ చేశారు. నలుగురిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్​ చేశారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరిదైనా పాత్ర ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read: బిగ్ బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!

Tags

Related News

పేద రైతు ప్రాణాలు బలిగొన్న భూ కబ్జా దందా.. హుజూరాబాద్‌లో సర్పంచ్ భర్త అరాచకాలు!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఎలా దోరికాడో తెలుసా..?

రిమ్స్ ప్రమాదంపై కేటీఆర్ ఫైర్.. ఆసుపత్రి ఘటన వెనుక ఉన్న నిజాలు ఇవే!

ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకండి.. ఫేక్ వీడియోలపై ఎంపీ చామల ఫైర్!

రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర.. జీవో 17 జారీ పై హరీష్ రావు ఫైర్!

ప్రభుత్వం గుడ్ న్యూస్.. మీ సేవ సర్టిఫికెట్లు ఇక మరింత పటిష్టం.. చినగవు, తడిచినా చెక్కుచెదరవు!

బిగ్ బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!

Big Stories

Advertisement
×