Diary: ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే తల్లిదండ్రుల ఉద్యోగాలు కట్. ఒకప్పుడు చైనా ప్రభుత్వం అమలు చేసింది ఈ విధానాన్ని. ఇది ఎంతో మంది తల్లులకు కడుపుకోత, వేదనను మిగిల్చింది. చాలా మంది తల్లులు కన్నబిడ్డలను కోల్పోయారు. ప్రస్తుతం ఈ నిబంధనను ఎత్తివేసినప్పటికీ.. అక్కడి తల్లులు మర్చిపోలేకపోతున్నారు.
ఓ తల్లి సంతాన విధానం వల్ల తాను అనుభవించిన బాధను డైరీలో రాసుకుంది. ఇందుకు సంబంధించిన కొన్ని పేజీలను ఆమె కూతురు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘మా అమ్మ రాసిన డైరీలోని కొన్ని పేజీలు ఇవి. అప్పుడే పుట్టిన నా చెల్లిని అమ్మమ్మ వద్దకు పంపేటప్పుడు కన్నీటితో రాసుకున్న పదాలివి. తన చిన్న కూతురు వెళ్లిపోయేటప్పుడు చివరి సారి పాలు పట్టిన విషయాన్ని అమ్మ డైరీలో రాసుకుంది. గుండెలు మెలిపెట్టే ఇలాంటి ఘటనలు చైనాలోని ఎన్నో కుటుంబాల్లో చోటుచేసుకున్నాయి. అందులో మా ఫ్యామిటీ కూడా ఒకటి’’ అంటూ రాసుకొచ్చింది.
ప్రస్తుతం డైరీలోని పేజీలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెటిజన్లు హృదయవిదారకం అంటూ కామెంట్లు పెడుతున్నారు.