Nabha Natesh: ప్రస్తుతం ఇండస్ట్రీలో అందం, అభినయం ఉండి కూడా అవకాశాలు ఉన్నా హిట్స్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్ లో నభా నటేష్ ఒకరు. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో నభా తెలుగుతెరకు పరిచయమైంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా అంత పెద్ద హిట్ కాకపోయినా.. ఒక మోస్తరుగా మంచి విజయాన్నే అందుకుంది. సినిమా ఏమో కానీ, నభా అందానికి మాత్రం తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. మొదటి సినిమాతోనే మంచి మార్కులే కొట్టేసిన నభా.. ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన నభా నటించి మెప్పించింది. చాందినీ పాత్రలో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఆ తరువాత అలాంటి హిట్ మళ్లీ ఈ చిన్నదానికి దక్కలేదనే చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ తరువాత తేజ్ సరసన సోలో లైఫ్ సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అల్లుడి అదుర్స్ లాంటి సినిమాలు చేసింది. అవి ఆశించనంత ఫలితాన్ని అందించలేకపోయాయి. ఇక మధ్యలో ఒక ఏడాది నభా సినిమాలకు దూరమయ్యింది. తనకు ఒక యాక్సిడెంట్ అయ్యిందని, అందుకే ఇంట్లో రెస్ట్ తీసుకున్నట్లు ఆమె తెలిపింది.
కష్టాల నుండి బయటికొచ్చి నభా నటేశ్ కమ్ బ్యాక్.. అసలు ఏమైందంటే?
ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నా కూడా అభిమానులకు దగ్గరగానే ఉంది. నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులను ఆనందపరిచింది. ఇక గ్యాప్ తరువాత నభా నటించిన చిత్రం డార్లింగ్. ఈ సినిమా కూడా అమ్మడికి విజయాన్ని అందించలేకపోయింది.
ప్రస్తుతం నభా ఆశలన్నీ స్వయంభు మీదనే పెట్టుకుంది. కార్తికేయ 2 తరువాత నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత నిఖిల్ నటించిన ప్రతి చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది.
Allu Arjun: హైకోర్టును ఆశ్రయించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఇక నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం స్వయంభు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన నభా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా నేడు నభా పుట్టినరోజు కావడంతో స్వయంభు నుంచి నభా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు చిత్రబృందం. పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నభా.. సుందర వల్లి అనే పాత్రలో కనిపిస్తుంది. పోస్టర్ లోసుందర వల్లి యువరాణిగా కనిపిస్తుంది. ఒంటినిండా నగలతో నభా ఎంతో అందంగా కనిపించింది.
Suriya 46: మలయాళ స్టార్ డైరెక్టర్ తో సూర్య.. ?
ఇక నిఖిల్ ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ.. ” హ్యాపీ బర్త్ డే నభా. నీకు మంచి ఆరోగ్యం, మంచి మంచి విజయాలు రావాలని కోరుకుంటున్నాను. స్వయంభు నుండి సుందర వల్లి మీ అందరినీ ఆకర్షించబోతోంది” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో నభా మంచి విజయాన్ని అందుకుంటుందా ..? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.
Happy Birthday Nabha @NabhaNatesh Wishing you Happiness Health and Even more Blockbusters… Sundara Valli from #Swayambhu is going to Captivate you all ❤️ pic.twitter.com/yBniMtcJp3
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 11, 2024