E-Paper
Advertisement

Jagan : జగన్ నోటివెంట హత్యా రాజకీయం మాట..!

Jagan : జగన్ నోటివెంట హత్యా రాజకీయం మాట..!
Advertisement

మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తెలుగుదేశం పార్టీ నేతలు హత్యా రాజకీయాలకు తెరలేపాలని ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు, అన్యాయాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు, శ్రేణులు దాడులు జరుగుతున్నా.. పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ రాజ్యాంగ విలువలను విస్మరిస్తున్నారని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని జగన్ కామెంట్స్ చేయగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా జగన్ వ్యాఖ్యలపై పలువురు సెటైర్లు వేస్తున్నారు.

ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..

ఏపీలోని గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్త ఎం సాల్మన్ మీద గుర్తుతెలియని వ్యక్తులు దాడికి చేయగా.. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సలో మృతి చెందాడు. అయితే, జనవరి 10న సాల్మన్ మీద దాడి జరిగినట్టు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్త మృతిపై స్పందించిన మాజీ సీఎం జగన్.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. టీడీపీ గుండాల దాడిలో సాల్మన్ మరణించాడని వైసీపీ శ్రేణులు సైతం ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదని.. ప్రభుత్వానికి వారు కొమ్ము కాస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

హత్యా రాజకీయాలు మీకు కొత్తనా?

Advertisement

జగన్, వైసీపీ నేతల ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నేతలు సైతం ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. హత్యారాజకీయాలకు పేరుమోసిన జగన్.. కొత్తగా హత్యారాజకీయాలంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని వారు సెటైర్లు వేస్తున్నారు..2019 ఎన్నికలకు ముందు తన సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద మర్డర్ ఎలా జరిగిందని ఈ సందర్బంగా వారు గుర్తుచేస్తున్నారు. ఆ కేసుపై ఇప్పటికీ విచారణ జరుగుతోందని.. వైసీపీ నేత, మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విషయాన్ని జగన్ మరిచారా? అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలను వైసీపీ గూండాలు పొట్టన పెట్టుకున్న విషయం మరిచారా? అని నిలదీస్తున్నారు.

BRS Politics: హరీష్‌రావు పార్టీ మార్పు వ్యవహారం.. బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? చిల్లర ప్రచారాలంటూ

Advertisement

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తలు గౌరినాథ్ చౌదరి, జే.వెంకటేశ్వర్లు, కె.కొటేశ్వర రావు, మరికొందరిని పొట్టన పెట్టుకున్నది ఎవరు?.. వైసీపీ గూండాలు కాదా? అని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.అంతేకాకుండా ఇతర పార్టీల నేతలను సైతం జగన్ పార్టీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. గతంలో వారు చేసిన తప్పులకు ఇప్పుడు శిక్షలు అనుభవిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. అయినా, వైసీపీలో రౌడీలు చాలా మందే ఉన్నారని.. వారికి శత్రువులు సైతం ఉన్నారని..వారిలో వారికే పడక మర్డర్ జరిగి ఉండవచ్చని టీడీపీ నేతలు ఆరోపించారు.దాన్ని కాస్త జగన్ రాజకీయం చేయాలని నిర్ణయించుకుని ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. జగన్‌‌కు హత్యారాజకీయాలు కొత్త కాదని.. సింపతీ కోసం ఇలాంటివి చాలానే చేస్తారని సైతం ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×