E-Paper
Advertisement

జ్ఞానేష్ కుమార్ మోదీకి బానిస!.. అఖిలపక్ష భేటీలో ఫైర్ అయిన వైఎస్ షర్మిల

జ్ఞానేష్ కుమార్ మోదీకి బానిస!.. అఖిలపక్ష భేటీలో ఫైర్ అయిన వైఎస్ షర్మిల
Advertisement

YS Sharmila: విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం అత్యంత ఘాటుగా సాగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నాయకులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను తన గుప్పెట్లో ఉంచుకుని ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేస్తోందని ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ECI- ఎలక్షన్ కమిషన్ ఆఫ్ మోదీ

Advertisement

ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) తన స్వతంత్రతను కోల్పోయి ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ మోదీ’ గా మారిపోయిందని వైఎస్ షర్మిల విమర్శించారు. సీఈసీ నియామక ప్రక్రియ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)ని తొలగించినప్పుడే కేంద్రం కుట్ర బయటపడిందని అన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించడం అతిపెద్ద నేరమని, ఫారమ్ 6, 7 లతో చట్టవిరుద్ధంగా మార్పులు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో ఒకే బీజేపీ కార్యకర్త 7 వేల దొంగ ఓట్లను చేర్పించాడని, జ్ఞానేష్ కుమార్ మోదీకి బానిసలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఈసీ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు

Advertisement

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. 2029లోనూ దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి మోదీ ఎలక్షన్ కమిషన్‌ను బానిసగా చేసుకున్నారని ఆరోపించారు. సీఈసీ పదవిలో జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఎం నేత వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. మైనారిటీలు, దళితులు, యువత , హిందుత్వ వ్యతిరేక ఓట్లను పథకం ప్రకారం తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మోహరిస్తున్న పోలీసు బలగాలకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు.

చట్టాలను మార్చి నియామకం

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థకు మరణశాసనం రాస్తోందని సీపీఐ నేత వనజ విమర్శించారు. జ్ఞానేష్ కుమార్ నియామకం కోసమే 2023లో చట్టాలను మార్చారని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ తెచ్చిన ఆ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని, ఈవీఎంలను పక్కనబెట్టి పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని అఖిలపక్షం ఏకాభిప్రాయానికి వచ్చింది.

Also Read: ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

Tags

Related News

ఆంధ్రా యూనివర్సిటీలో కొకైన్ కలకలం.. పోలీసుల రికార్డుల్లో షాకింగ్ నిజాలు!

సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేసిన నందమూరి లక్ష్మీపార్వతి.. ఏమన్నారంటే?

ఎన్నికలంటే వైసీపీకి వణకు.. అందుకే న్యాయస్థానాలకు, పార్టీ పరంగా బీసీలకు న్యాయం-సీఎం చంద్రబాబు

బీసీల రిజర్వేషన్ల అంశం.. ఏపీ ప్రభుత్వం రియాక్ట్, పార్టీ పరంగా ఇస్తామన్న మంత్రి పార్థసారధి

కూటమి ప్రభుత్వం, వైసీపీకి షాక్.. 34శాతం బీసీ రిజర్వేషన్లు అంశం, పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

ఏపీలో రేషన్ కార్డు దారులకు అలర్ట్.. లింక్ చేయకుంటే కార్డు కట్, ఇంకెందుకు ఆలస్యం

దాదాపు రెండు గంటలపాటు భేటీ.. ఒత్తిడిలో పెద్దాయన, బాబు ఏం చెప్పారు?

Big Stories

Advertisement
×