BigTV English

Ambati Counter on VSR: సాయిరెడ్డికి కౌంటర్.. ఆ వెనుక ఆ ఇద్దరూ

Ambati Counter on VSR: సాయిరెడ్డికి కౌంటర్.. ఆ వెనుక ఆ ఇద్దరూ

Ambati Counter on VSR:  వైసీపీకి ఇప్పుడు సమస్య మొదలైందా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటలు, ట్వీట్లు ఆ పార్టీ తట్టుకోలేక పోతోందా? దీనికి కౌంటరిచ్చేందుకు ఆ పార్టీ నానా ప్రయత్నాలు పడుతోందా? వీఆర్ఎస్ మాటల వెనుక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఉన్నారనే కొత్త ప్రచారం మొదలుపెట్టేసిందా? అవుననే అంటున్నారు కూటమి నేతలు.


వీఎస్ఆర్ వర్సెస్ వైసీపీ

శనివారం విజయసాయిరెడ్డి ట్వీట్ తర్వాత వైసీపీ నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. విజయసాయిరెడ్డి అంటే ఒకప్పుడు తెలీదు. వైసీపీ ద్వారానే ఆయన ఎవరో ప్రజలకు తెలిసిందన్నారు. జగన్‌కు ఒకప్పుడు అన్నీ తానై నడిచిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని అన్నారు. ఆయన వెళ్లిపోయారంటే కోటరీ కూడా వెళ్లిపోయిందనేది తన అభిప్రాయం గా చెప్పుకొచ్చారు.


ఆయన అసలు రూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారాయన. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేతిలో ఆయన ఆయుధమయ్యారనేది మనసులోని మాట. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనన్న అంబటి, సాయిరెడ్డిని అప్పుడూ ఇప్పుడూ చూశానన్నారు. వైసీపీ నాశనం అవ్వాలని ఆయన ఆలోచన చాలా ప్రమాదకర మైందన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తుందన్నారు.

కూటమికి లింకు పెట్టే ప్రయత్నం

వైసీపీ, జగన్‌ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారన్నారు. అసలు సాయిరెడ్డి కెపాసిటీ ఏంటి? ఆయన చరిత్ర ఏంటి? కేవలం జగన్ దయాదాక్షిణ్యాల వల్లే వచ్చిందన్నారు. వీఎస్ఆర్ ట్వీట్‌ గురించి ప్రస్తావిస్తూ కోటరీ మాట వింటే రాజ్యాలు నాశనం అవుతాయన్నది ప్రధాన వ్యాఖ్య. దాని గురించి అంబటి తనదైన శైలిలో ప్రస్తావించారు.

ALSO READ: వాతావరణంలో మార్పులు, రాగల మూడు రోజులు

జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ని నాశనం చేస్తుందన్నది భావనకు నవ్వు వచ్చిందన్నారు. కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో సీఐడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్, ఆయన కోటరీ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారన్నారు.

తర్వాత విజయసాయిరెడ్డి గతాన్ని తవ్వారు అంబటి రాంబాబు. విజయసాయిరెడ్డి స్టేట్‌మెంట్లు, ట్వీట్ల ద్వారా వైసీపీ డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాలపై వీఎస్ఆర్ ఆసక్తి ఉన్న నేత కాదన్నారు. అలాగని రాజకీయ నాయకుడు కాదన్నారు. కేవలం రాజారెడ్డి వ్యాపారాలకు చార్టెంట్ అకౌంట్ మాత్రమేనన్నారు.

వీఎస్ఆర్ గతంపై

వైఎస్ఆర్, జగన్ వద్ద పని చేశారని, అత్యంత నమ్మకస్తుడు అనే భావన కలిగించారని అన్నారు. వైఎస్ఆర్ మరణానికి ముందు జగన్ ప్రొత్సహంతో ఆయన టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారని గుర్తు చేశారు. అప్పుడు ఆయన వెలుగులోకి వచ్చారు. అప్పటివరకు వైఎస్ కుటుంబానికి మాత్రమే తెలుసన్నారు. ఆయన మరణం తర్వాత రాజకీయ పరిణామాల్లో జగన్‌పై పెట్టిన అన్నికేసుల్లో ఆయన ప్రధాన ముద్దాయి అయ్యారని వివరించే ప్రయత్నం చేశారు.

వీఎస్ఆర్ పార్టీని ఎందుకు వీడి వెళ్లారో తెలీదన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వెళ్తున్నానని, రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఆయన చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఇక వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన ఆయన, తర్వాత పరిణామాలు అలా లేవన్నారు. కేవలం వైసీపీని డ్యామేజ్ చేయడం కోసం జగన్‌ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తనదైనశైలిలో వెల్లడించారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ట్వీట్‌కు కౌంటర్ కాకుండా గతాన్ని తవ్వి ప్రయత్నం చేశారు అంబటి. ఈ లెక్కన వీఆర్ఎస్ మాటలు ఆ పార్టీలో మంటలు బాగానే పుట్టిస్తున్నాయని చెప్పవచ్చు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×