YSRCP Demand: జగన్ మారారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అనుకున్నారు. అందుకే అసెంబ్లీకి వెళ్లారని చాలామంది భావించారు. సభలో ఆ పార్టీ నేతలు చేసిన తీరుని చూసి సిగ్గుపడుతున్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి, మాకు ప్రతిపక్షనేత హోదా కావాలని నినాదాలు చేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ నేతలకు పదవులే ముఖ్యమా, ప్రజా సమస్యలు అక్కర్లేదా అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.
సోమవారం అసెంబ్లీకి వచ్చిన వైసీపీ సభ్యులు.. స్వామి కార్యం.. స్వకార్యం రెండు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలను అసంతృప్తి నుంచి గట్టెక్కించడం ఒకటైతే, రెండోది ఉప ఎన్నిల నుంచి తప్పించుకున్నారు. తొమ్మిది నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమావేశాలకు రాక వెనుక మాజీ సీఎం జగన్ కొత్త స్కెచ్ వేశారని చాలామంది భావించారు.
సమావేశాలకు వచ్చినా వైసీపీ తీరు మారలేదు. కచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా కావాల్సిందేనని పట్టుబట్టారు. తాము అసెంబ్లీకి రావాలో వద్దా అనేది తేల్చుకోవాల్సిందే ప్రభుత్వమేనని కుండబద్దలు కొట్టేశారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.
సోమవారం ఉదయం అసెంబ్లీలో అడుగుపెట్టిన నుంచి వైసీపీ కాన్సెప్ట్ ఒక్కటే. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. చివరకు గవర్నర్ ప్రసంగంలో అదే నినాదాలు. ఆయన ప్రసంగాన్ని బాయ్‌కట్ చేశారు. అనంతరం మీడియా ముందుకొచ్చిన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: వచ్చారు.. వెళ్లారు.. కనీసం 11 నిమిషాలు కూడా
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని అసెంబ్లీలో కోరామన్నారు ఎమ్మెల్సీ బొత్స. ప్రతిపక్ష మంటే ప్రజల పక్షమని కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గవర్నర్ ప్రసంగంలో డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సభలో ఉండేవి రెండే పక్షాలని, అధికారపక్షం- ప్రతిపక్షమని గుర్తు చేశారు. మాది ప్రతిపక్షమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాము అసెంబ్లీకి రావాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.
ఈ క్రమంలో ఎప్పటి మాదిరిగానే ప్రభుత్వంపై రెండు రాళ్లు వేశారాయన. మ్యూజికల్ నైట్‌లకు ఎన్నికల కోడ్ వర్తించదా? గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే కోడ్ గుర్తుకు వచ్చిందా అంటూ అధికార పార్టీని ప్రశ్నించారు. గుంటూరు మిర్చియార్డును జగన్ సందర్శించే వరకు ఆ అంశంపై ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దీనిపై కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారాయన.
రైతుల సమస్యలు ప్రస్తావించాలంటే ప్రతిపక్ష హోదా కావాలని, అందుకే హోదా అడుగుతున్నామని మరోసారి ప్రస్తావించారు బొత్స. మిర్చి రైతులను ఆదుకోవాలని అసెంబ్లీ వేదికగా అధికార పార్టీని కోరామన్న బొత్స, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతుల కోసం వెళ్తే మా నాయకుడిపై కేసులు పెట్టారని, రైతుల సమస్యలకు ఎన్నికల కోడ్ అడ్డొస్తుందా అంటూ ప్రశ్నలు లేవనెత్తారు.
మ్యూజికల్ నైట్‌కు ఎన్నికల కోడ్ వర్తించదా అంటూ సూటిగా ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, అది గ్యారంటీ కాదని ముమ్మాటికీ మోసమన్నారు. చివరలో ప్రభుత్వం ప్రతిస్పందన చూసిన తర్వాతే తాము సభకు రావాలో లేదో చెప్తామన్నారు. మొత్తానికి బైపోల్ వేటు నుంచి వైసీపీ తప్పించుకుందన్నమాట. చింత చచ్చినా.. పులుపు చావాలేదని అంటారు ఇందుకేనేమో? ప్రజలు చిత్తుగా ఓడించి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేసినా, అధినేత తీరు మారలేదని అంటున్నారు.
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: బొత్స సత్యనారాయణ
ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం
9 నెలలు అయింది.. సూపర్ సిక్స్ ఎక్కడ?
ప్రజల్ని మోసం చేయడం ధర్మం కాదు
అసెంబ్లీ కి రావాలా వద్దా అనేది
ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది– బొత్స సత్యనారాయణ pic.twitter.com/maY65NvzJ9
— BIG TV Breaking News (@bigtvtelugu) February 24, 2025