Lungs Detox Drink: ప్రస్తుతం వాయు కాలుష్యం కారణంగా గాలి నాణ్యత చాలా తగ్గుతోంది. AQI పెరగడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మాస్క్ ధరించి భయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. గాలి నాణ్యత సూచిక పెరుగుదల కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడే వారి సంఖ్య ఎక్కువవుతోంది.
వాయు కాలుష్యం పెరిగిన ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల గొంతు, ఊపిరితిత్తులలో కఫం పేరుకుపోతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి ఆడకపోవడం, విశ్రాంతి లేకపోవడం, దగ్గు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యల నుండి బయట పడటానికి చాలా మంది మందులను వాడుతుంటారు. కానీ మీరు ఇంట్లోనే ఈ సమస్యను సులభంగా వదిలించుకోవచ్చు. అవును, ఈ డీటాక్స్ డ్రింక్ ని ఇంట్లోనే తయారు చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మీ ఊపిరితిత్తులను శుభ్రపరచడమే కాకుండా అవి మునుపటి కంటే మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. మరి డీటాక్స్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఊపిరితిత్తులను శుభ్రం చేసే డ్రింక్:
అల్లం:
అల్లంలో జింజెరాల్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.ఇది శ్లేష్మాన్ని తొలగిస్తుంది. అంతే కాకుండా ఊపిరితిత్తులను క్లియర్ చేస్తుంది. దగ్గు, జలుబు సమస్యలతో ఇబ్బంది పడే వారు అల్లం ఆహార పదార్థాల్లో వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పసుపు:
పసుపులో చాలా ఎక్కువ మొత్తంలో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది శరీరం నుండి హానికరమైన వ్యర్థ పదార్థాలను తొలగించడానికి పనిచేస్తుంది.
దాల్చిన చెక్క:
దీనిలోని యాంటీ-మైక్రోబయల్ లక్షణాల కారణంగా, ఇది శరీరం నుండి వ్యర్థ పదార్థాలు తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. దీనిని తినడం వల్ల మొత్తం శ్వాసకోశ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది.
నల్ల మిరియాలు:
నల్ల మిరియాల్లో ఉండే పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. అంతే కాకుండా మిరియాల పాలు తాగడం వల్ల కూడా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. తరచుగా నల్ల మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
తేనె:
ప్రతిరోజూ తేనె తీసుకోవడం వల్ల పేరుకుపోయిన ఊపిరితిత్తుల్లో కఫం తొలగించబడుతుంది. అంతే కాకుండా ఊపిరితిత్తులు శుభ్రపడతాయి.
నిమ్మకాయ:
విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. అంతే కాకుండా ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
Also Read: బరువు తగ్గాలంటే.. ఇవి అస్సలు తినకూడదు !
డీటాక్స్ డ్రింక్ ఎలా తయారు చేయాలి ?
ముందుగా ఒక కప్పు నీటిని వేడి చేయండి. ఇందు కోసం ఫిల్టర్ చేసిన నీటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఈ నీటిలో ఒక అంగుళం తురిమిన అల్లం ముక్క వేయండి. తర్వాత ½ టీస్పూన్ పసుపు కలిపి మరిగించండి. తర్వాత దానికి ¼ టీస్పూన్ దాల్చిన చెక్క పొడి కలపండి. అనంతరం చిటికెడు నల్ల మిరియాలు వేయండి. ఈ డ్రింక్ 5 నిమిషాలు మరిగించి.. తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఆ తర్వాత ఈ డ్రింక్ ఒక గ్లాస్ లో వడకట్టండి. అనంతరం దీనికి ఒక టీ స్పూన్ తేనెతో పాటు సగం నిమ్మకాయ రసం కలపండి. డిటాక్స్ డ్రింక్ రెడీ అయినట్లే..
ఇంట్లో తయారుచేసిన ఈ డీటాక్స్ డ్రింక్ ని ప్రతి ఉదయం తాగడానికి ప్రయత్నించండి. కొన్ని రోజుల్లోనే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతే కాకుండా మీ ఊపిరితిత్తులు చాలా కాలం పాటు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాయి.