E-Paper
Advertisement

ఐకానిక్ పల్సర్ 220Fకు ఫేస్‌ లిఫ్ట్.. LED హెడ్‌ లైట్‌ తో క్రేజీ లుక్!

ఐకానిక్ పల్సర్ 220Fకు ఫేస్‌ లిఫ్ట్.. LED హెడ్‌ లైట్‌ తో క్రేజీ లుక్!
Advertisement

2026 Bajaj Pulsar 220F: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ బైక్‌ లలో బజాజ్ పల్సర్ 220Fకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ బైక్ ప్రత్యేక డిజైన్, పవర్ ఫుల్ ఇంజిన్, మంచి పనితీరుతో బైక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు బజాజ్ ఈ ఐకానిక్ మోటార్‌ సైకిల్‌ కు మరో అప్‌ డేట్‌ తీసుకొచ్చింది.  2026 బజాజ్ పల్సర్ 220Fను తాజాగా అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ధర రూ.1.36 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. గత మోడల్‌ తో పోలిస్తే ధర సుమారు రూ.8 వేల వరకు పెరిగింది. అయితే, ఈ ధర పెంపుకు కారణంగా బైక్‌ లో అందించిన కొత్త LED హెడ్‌ లైట్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

2007లో మార్కెట్ లోకి అడుగు పెట్టిన పల్సర్ 220 DTS-FI

2007లో పల్సర్ 220 DTS-FI పేరుతో ఈ బైక్ మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి పల్సర్ 220F డిజైన్‌ లో పెద్దగా మార్పులు చేయలేదు. అదే ఫెయిరింగ్, అదే సిల్హౌట్, క్లిప్ ఆన్ హ్యాండిల్‌ బార్లు, స్పోర్టీ లుక్‌ ను బజాజ్ కొనసాగిస్తూ వచ్చింది. అందుకే ఈ బైక్‌ కు మంచి ఆదరణ దక్కింది. 2026 మోడల్‌ లో మొదటిసారి హెడ్‌ లైట్ డిజైన్‌ లో కీలక మార్పులు తీసుకొచ్చింది. పాత మోడల్‌ లో ఉన్న హాలోజన్ సెటప్ స్థానంలో పూర్తి LED హెడ్‌ లైట్‌ ను అందించారు. లో బీమ్, హై బీమ్ రెండింటినీ ఒకే ప్రొజెక్టర్ యూనిట్‌ లో ఫిక్స్ చేశారు. అలాగే కొత్త LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా బైక్‌కు మరింత అత్యాధునిక రూపాన్ని తీసుకొచ్చాయి.

Advertisement

డిసెంబర్ 2025లో విడుదల చేసిన అప్‌ డేట్‌ లో LED టర్న్ ఇండికేటర్లను పరిచయం చేశారు. ఇప్పుడు LED హెడ్‌ లైట్ రావడంతో బైక్ లైటింగ్ వ్యవస్థ పూర్తిగా లేటెస్ట్ లుక్ తో ఆకట్టుకుంటుంది. దాదాపు 19 సంవత్సరాల తర్వాత పల్సర్ 220F డిజైన్‌ లో కనిపిస్తున్న ముఖ్యమైన మార్పు ఇదే అని చెప్పుకోవచ్చు.

ఇతర ఫీచర్ల గురించి..

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, బైక్‌ లో పెద్దగా మార్పులు చేయలేదు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్, మెసేజ్ నోటిఫికేషన్లు, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి. అలాగే LED టెయిల్ లైట్, స్ప్లిట్ సీట్లు, ఫెయిరింగ్‌ పై అమర్చిన ORVMలు కూడా అలాగే ఉన్నాయి. భద్రత కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లను అందించారు.  డ్యూయల్ ఛానల్ ABS బదులుగా ఇప్పటికీ సింగిల్ ఛానల్ ABS మాత్రమే అందుబాటులో ఉంది.

ఇంజిన్ లో నో ఛేంజెస్

Advertisement

ఇంజిన్‌ లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. 220cc సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కొనసాగుతోంది. ఈ ఇంజిన్ 20.4 PS పవర్, 18.55 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను యాడ్ చేశారు. 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 160 కిలోల కర్బ్ వెయిట్‌ తో ఈ బైక్ తన పాత పనితీరునే కొనసాగిస్తోంది.

ఇక కలర్స్ విషయానికి వస్తే బ్లాక్ గోల్డ్, బ్లాక్ చెర్రీ రెడ్, బ్లాక్ ఇంక్ బ్లూ, బ్లాక్ కాపర్ బేజ్ రంగులు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చూస్తే, కొత్త LED హెడ్‌ లైట్‌ తో బజాజ్ పల్సర్ 220F మరింత ఆకట్టుకుంటుంది.

Read Also: క్రేజీ న్యూస్ మామ.. ఇక 4 వీల్ ఎలక్ట్రిక్ స్కూటర్లూ వచ్చేస్తున్నాయ్, లుక్ అదుర్స్ అంతే!

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×