E-Paper
Advertisement

జస్ట్ రూ.6.29 లక్షలకే సిట్రోయెన్ eC3X.. BaaS స్కీమ్‌ తో అదిరిపోయే ఆఫర్!

జస్ట్ రూ.6.29 లక్షలకే సిట్రోయెన్ eC3X.. BaaS స్కీమ్‌ తో అదిరిపోయే ఆఫర్!
Advertisement

2026 Citroen eC3X Launched: సిట్రోయెన్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌ బ్యాక్‌ ను 2026 మోడల్‌ గా అప్‌డేట్ చేసి eC3X పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.10.25 లక్షలు (ఎక్స్‌ షోరూమ్)గా నిర్ణయించారు.   గత మోడల్‌ తో పోలిస్తే దీని ధర రూ.1.74 లక్షలు తక్కువగా ఉండటంతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా కంపెనీ బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) స్కీమ్ ను కూడా అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా కారు ప్రారంభ ధర రూ.6.29 లక్షలకు తగ్గుతుంది. అయితే, వినియోగదారులు ప్రతి కిలోమీటర్‌కు రూ.2.26 చొప్పున బ్యాటరీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

మూడు వేరియంట్లలో కొత్త eC3X

కొత్త eC3Xను లైవ్, లైవ్ (O), షైన్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. కారు బయటి భాగంలో  కొన్ని మార్పులు చేయడంతో పాటు, క్యాబిన్‌ లో కూడా కొత్త ఫీచర్లను యాడ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కారులో ఇప్పుడు కొత్త ప్రొజెక్టర్ LED హెడ్‌ లైట్లు, 15 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్,  V ఆకారంలో ఉన్న LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, LED టెయిల్ లైట్లు, బ్లాక్ క్లాడింగ్ లాంటివి అలాగే కొనసాగిస్తున్నారు. ముందు, వెనుక బంపర్ల డిజైన్‌ లో పెద్దగా మార్పులు చేయలేదు.

Advertisement

అటు క్యాబిన్ లో కొత్త డ్యూయల్ టోన్ బ్లూ బేజ్ కలర్ థీమ్‌ ను అందించారు. సీట్లకు లెదరెట్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల ప్రీమియం ఫీలింగ్ లభిస్తుంది. డాష్‌ బోర్డ్ డిజైన్ పాత మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ, ఫీచర్ల పరంగా మంచి అప్‌ డేట్లు వచ్చాయి. ఇప్పుడు eC3Xలో 7 అంగుళాల కలర్ TFT డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, ఆటో డిమ్మింగ్ IRVM, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జర్, డాష్‌ క్యామ్, JBL 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే సపోర్ట్‌ తో వస్తుంది.

భద్రతా పరంగానూ కీలక జాగ్రత్తలు

భద్రత పరంగా కూడా కంపెనీ మెరుగుదలలు చేసింది. టాప్ వేరియంట్‌ లో 6 ఎయిర్‌ బ్యాగ్‌ లు, ఇతర వేరియంట్లలో 4 ఎయిర్‌ బ్యాగ్‌ లు అందిస్తున్నారు. గత మోడల్‌ లో కేవలం 2 ఎయిర్‌ బ్యాగ్‌లు మాత్రమే ఉండేవి. అదనంగా రియర్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, రియర్ వైపర్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఒకే ఛార్జ్ తో 325 కిలో మీటర్ల ప్రయాణం

Advertisement

పవర్‌ ట్రెయిన్ విషయానికి వస్తే, eC3Xలో 29.2kWh బ్యాటరీ ప్యాక్‌ ను కొనసాగించారు. అయితే సాఫ్ట్‌ వేర్, సామర్థ్య మెరుగుదలల కారణంగా ఇప్పుడు ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 325 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది గత మోడల్ కంటే 79 కిలోమీటర్లు ఎక్కువ. ఈ బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్ 57 హెచ్‌పీ శక్తి, 143 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కారు 0 నుంచి గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.8 సెకన్లలో చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 107 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.ఇక AC ఛార్జర్‌ తో 10 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు 10 గంటల 30 నిమిషాలు పడుతుంది. DC ఫాస్ట్ ఛార్జర్‌తో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 57 నిమిషాల సమయం సరిపోతుంది. భారత మార్కెట్లో ఈ కొత్త సిట్రోయెన్ eC3X ప్రధానంగా టాటా పంచ్ EVకు పోటీ ఇవ్వనుంది.

Read Also: 450 కిమీ రేంజ్‌ తో మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUV.. టాటా హారియర్ EV గట్టి పోటీ తప్పదా?

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×