E-Paper
Advertisement

450 కిమీ రేంజ్‌ తో మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUV.. టాటా హారియర్ EV గట్టి పోటీ తప్పదా?

450 కిమీ రేంజ్‌ తో మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUV..  టాటా హారియర్ EV గట్టి పోటీ తప్పదా?
Advertisement

భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే BE 6, XEV 9e లాంటి మోడళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహీంద్రా, ఇప్పుడు మరో కొత్త ఎలక్ట్రిక్ SUVని రెడీ అవుతోంది. 2027లో విడుదల కానున్న ఈ కొత్త మోడల్, టాటా హారియర్ EVకు గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా ఈ కారుకు సంబంధించిన పేరును అధికారికంగా ప్రకటించకపోయినా,  2022లో ప్రదర్శించిన BE.07 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ప్రొడక్షన్ వెర్షన్‌ గా భావిస్తున్నారు. ఈ SUV మార్కెట్లోకి వస్తే, మహీంద్రా పూర్తి ఎలక్ట్రిక్ SUVల శ్రేణిలో నాలుగో మోడల్‌ కానుంది.

డిజైన్ గురించి..

Advertisement

తాజాగా బయటకు వచ్చిన స్పై షాట్స్ చూస్తే, ప్రొడక్షన్ మోడల్ కాన్సెప్ట్ డిజైన్‌ కు చాలా దగ్గరగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముందుభాగంలో స్పోర్టీ లుక్, వాలుగా ఉండే విండ్‌ స్క్రీన్, బలమైన వీల్ ఆర్చ్‌ లు, మంచి బాడీ లైన్లు దీనికి ప్రత్యేక రూపాన్ని ఇస్తున్నాయి. అలాగే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఏరోడైనమిక్ వీల్స్, సరికొత్త ఫ్రంట్ బంపర్ కూడా కనిపించాయి. అయితే,  కాన్సెప్ట్ మోడల్‌ లో కనిపించిన కొన్ని ఫ్యూచరిస్టిక్ ఫీచర్లను ప్రొడక్షన్ వెర్షన్‌ లో తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా కెమెరా ఆధారిత సైడ్ మిర్రర్ల స్థానంలో సాధారణ వింగ్ మిర్రర్లను ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంటీరియర్ గురించి..

మహీంద్రా XEV 9e, XEV 9S మోడళ్లలో ఉన్న పలు ఫీచర్లు ఇందులో కూడా కనిపించే అవకాశం ఉంది. ట్రిపుల్ స్క్రీన్ సెటప్, వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఉండొచ్చు.  వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్ అప్ డిస్‌ ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడ్వాన్స్‌ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ లాంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండే అవకాశముంది.

ఒకే ఛార్జ్ తో 450 కి.మీ ప్రయాణం

Advertisement

ఈ SUVలో 60kWh నుంచి 80kWh మధ్య సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండవచ్చని తెలుసతోంది. అదే సమయంలో రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్  వేరియంట్లు వచ్చే అవకాశం ఉంది. RWD మోడల్‌లో 231 bhp నుంచి 286 bhp వరకు పవర్ ఉంటుంది.  AWD వేరియంట్‌లో 340 bhp నుంచి 394 bhp వరకు శక్తిని అందించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

టాటా హారియర్ EVకి గట్టి పోటీ

2027లో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ కొత్త మహీంద్రా ఎలక్ట్రిక్ SUV, టాటా హారియర్ EVతో పాటు ఇతర ప్రీమియం ఎలక్ట్రిక్ SUVలకు గట్టి పోటీగా నిలిచే అవకాశం ఉందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

Read Also: భారత్‌ లో మళ్లీ హైబ్రిడ్ కార్ల హవా.. ఏడాదిలో 6 కొత్తమోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×