The Paradise : టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమధ్య ఈయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో నాని తో సినిమా చేసేందుకు డైరెక్టర్లు కూడా క్యూ కడుతున్నారు.. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ‘ది ప్యారడైజ్ ‘ మూవీలో నటిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ మూవీ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సినిమా త్వరలోనే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఇందులో నిజమేంత ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో దసరా మూవీ వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మరో మూవీ ‘ది ప్యారడైజ్ ‘.. నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలోని క్యాస్టింగ్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది.. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు వంటి భిన్నమైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండటంతో ఈ మూవీ పై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. ఇంకా 30 రోజుల షూటింగ్ పెండింగ్ ఉండంతో మూవీ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. నిజానికి డైరెక్టర్ ప్రతి సీన్‌ను ఎంతో పర్ఫెక్ట్‌గా చెక్కుతుండటం, భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల కారణంగానే ఈ జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.. అందుకే రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్రయూనిట్ ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు..
Also Read : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇదే ట్విస్ట్..
ఈ సినిమా షూటింగ్ తో పాటుగా ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్క్ ఉండడంతో ఆలస్యం అవుతుందని దాదాపు కన్ఫామ్ అయిపోయింది.. అయితే సినిమా ఆలస్యం అవుతున్న కూడా నాని మాత్రం ప్రమోషన్స్లో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా ఎప్పుడు వచ్చినా పర్వాలేదు కానీ తన ప్రమోషన్స్ మాత్రం తను చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్స్ అలాగే సాంగ్స్ జనాలని ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ముఖ్యంగా ఆయా షేర్ సాంగ్ అందరిని మెప్పించింది. నార్త్ ఆడియన్స్‌ను సైతం ఆకర్షించేలా కంటెంట్‌ను డిజైన్ చేశారని, అందుకే ప్రమోషన్స్ విషయంలో నాని వెనకడుగు వేయకుండా చేస్తున్నారు.. మొత్తానికి ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది…