Hyundai Verna 2026 Launched: ప్రసిద్ధ ఆటో మోబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ భారత్ లో సరికొత్త వెర్నా 2026ను లాంచ్ చేసింది. రూ. 10,98,400 (ఎక్స్ షోరూమ్) ధరతో మార్కెట్ లోకి విడుదల చేసింది. నయా లుక్ తో సెడాన్ డిజైన్, టెక్నాలజీ, సౌకర్యం, భద్రత పరంగా 25 కి పైగా కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అదే సమయంలో మిడ్ సైజ్ సెడాన్ విభాగంలో కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కారును తీసుకొస్తుంది. కొత్త వెర్నా హోండా సిటీ, స్కోడా స్లావియా, వోక్స్ వ్యాగన్ వర్టస్ లాంటి కార్లతో పోటీ పడుతుంది.
కొత్త వెర్నా ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. HX2, HX4, HX6, HX6+, HX8, HX10 లో లభిస్తుంది. ఈ కారు ధరలు రూ. 10.98 లక్షల నుంచి ప్రారంభమై, పవర్ ట్రెయిన్, ట్రాన్స్ మిషన్ ఎంపికను బట్టి రూ. 18.25 లక్షల వరకు ఉంటాయి. ఈ సెడాన్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ తో వస్తుంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో అందుబాటులో ఉంటుంది.
కొత్త వెర్నాను మరింత లేటెస్ట్ రూపొందించింది కంపెనీ. ఇందుకోసం హ్యుందాయ్ అనేక స్టైలింగ్ అప్ డేట్స్ ను తీసుకొచ్చింది. బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్‌లు, ముందు, వెనుక బంపర్లు అప్ డేట్ చేయబడ్డాయి. 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. మంచి క్యాబిన్ ప్లే, వెనుక సీటు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. హ్యుందాయ్ రెండు కొత్త కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అందులో ఒకటి క్లాసీ బ్లూ కాగా, మరొకటి టైటాన్ గ్రే మాట్టే.
కొత్త వెర్నా లోపల అదనపు సౌకర్యంతో పాటు సరికొత్త ఫీచర్లతో కూడిన క్యాబిన్‌ను కలిగి ఉంది. D కట్ స్టీరింగ్ వీల్, లెథరెట్ సీట్ అప్హోల్స్టరీతో పాటు డ్రైవర్, ప్రయాణీకులకు ఎలక్ట్రిక్ సీట్ సర్దుబాటుతో వస్తుంది. డ్రైవర్ సీటు మెమరీ ఫంక్షన్, వెల్కమ్ రిట్రాక్ట్ ఫీచర్ తో 8 వే ఎలక్ట్రిక్ సర్దుబాటును కలిగి ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 70కి పైగా కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, 350 కంటే ఎక్కువ వాయిస్ కమాండ్స్ తో హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. 528 లీటర్ బూట్ స్పేస్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. బోస్ 8-స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ ఉంటుంది.
కొత్త వెర్నాలో హ్యుందాయ్ భద్రతా ప్యాకేజీని మరింత అప్ డేట్ చేసింది. హ్యుందాయ్ స్మార్ట్ సెన్స్ లెవల్ 2 ADAS తో వస్తుంది. ఇందులో 20 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫంక్షన్స్ ఉన్నాయి. 7 ఎయిర్ బ్యాగ్‌లు, ఇంటిగ్రేటెడ్ డాష్ క్యామ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు ఉన్నాయి. కొత్త వెర్నా ఇప్పుడు 75 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది.
Read Alos: లాంచ్ కు ముందే రోడ్డెక్కిన హీరో విడా VXZ ఎలక్ట్రిక్ బైక్, అసలు మ్యాటర్ ఏంటంటే?