E-Paper
Advertisement

టీవీఎస్ అపాచీ RTR 310లో కొత్త అప్‌డేట్.. ఫీచర్లు, ఇంజిన్, ధరలు ఎలా ఉన్నాయంటే?

టీవీఎస్ అపాచీ RTR 310లో కొత్త అప్‌డేట్.. ఫీచర్లు, ఇంజిన్, ధరలు ఎలా ఉన్నాయంటే?
Advertisement

2026 TVS Apache RTR 310: టీవీఎస్ మోటార్ తన ఫ్లాగ్‌షిప్ స్ట్రీట్‌ఫైటర్ అపాచీ RTR 310 వేరియంట్లలో కీలక మార్పులు చేసింది. పండుగ సీజన్‌ ను దృష్టిలో పెట్టుకుని వేరియంట్ల ఎంపికను మరింత ఈజీ చేసింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న టాప్ వేరియంట్‌ను నిలిపివేసి, బేస్ వేరియంట్‌ను క్విక్‌షిఫ్టర్ ఫీచర్ ఆధారంగా రెండు ఆప్షన్లుగా విభజించింది. అంతేకాకుండా, గతంలో కొన్ని ప్రత్యేక వేరియంట్లకే పరిమితమైన సెపాంగ్ బ్లూ కలర్ ను ఇప్పుడు బేస్ వేరియంట్‌ లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది.

బేస్ మోడల్‌లో కొత్త ఆప్షన్లు!

టీవీఎస్ అపాచీ RTR 310 గతంలో బేస్, టాప్, BTO డైనమిక్ కిట్, BTO డైనమిక్ ప్రో కిట్ వేరియంట్లలో అందుబాటులో ఉండేది. అయితే, తాజా మార్పుల్లో భాగంగా టాప్ వేరియంట్‌ను కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు బేస్ వేరియంట్‌ను రెండు రకాలుగా ఎంచుకోవచ్చు. మొదటిది క్విక్‌షిఫ్టర్ లేని మోడల్ కాగా, రెండోది క్విక్‌షిఫ్టర్ ఫీచర్‌తో వస్తుంది. దీంతో తమ అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా బైక్‌ను ఎంచుకునే అవకాశం కొనుగోలుదారులకు లభిస్తుంది. మరోవైపు, BTO డైనమిక్ కిట్, డైనమిక్ ప్రో కిట్ వేరియంట్లు మాత్రం కొనసాగనున్నాయి.

రూ.2.30 లక్షల నుంచి ధరలు ప్రారంభం!

Advertisement

తాజా అప్‌డేట్ తర్వాత Apache RTR 310 బేస్ వేరియంట్ ధర రూ.2.30 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇవి ఢిల్లీ ఎక్స్‌ షోరూమ్ ధరలు. క్విక్‌షిఫ్టర్ లేని ఈ బేస్ మోడల్ ఆర్సెనల్ బ్లాక్ రంగులో మాత్రమే లభిస్తుంది. క్విక్‌ షిఫ్టర్‌ తో కూడిన బేస్ వేరియంట్ మాత్రం మరిన్ని రంగుల ఎంపికలను అందిస్తుంది. ఆర్సెనల్ బ్లాక్, ఫ్యూరీ ఎల్లో రంగుల ధర రూ.2.47 లక్షలుగా ఉండగా, ఫైరీ రెడ్ రంగు ధర రూ.2.52 లక్షలు. ఇక సెపాంగ్ బ్లూ రంగు వేరియంట్ ధర రూ.2.57 లక్షలుగా ఉంది.

సెపాంగ్ బ్లూ రంగు ఇప్పుడు బేస్ వేరియంట్‌లోనూ!

ఈ అప్‌డేట్‌లో ముఖ్యమైన మార్పుల్లో సెపాంగ్ బ్లూ రంగు ఒకటి. గతంలో ఈ కలర్ BTO వేరియంట్లకే పరిమితమైంది. ఇప్పుడు బేస్ వేరియంట్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఆర్సెనల్ బ్లాక్, ఫ్యూరీ ఎల్లో రంగులతో పోలిస్తే సెపాంగ్ బ్లూ కోసం కొనుగోలుదారులు అదనంగా రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక ఎడిషన్ల విషయానికి వస్తే, బ్లాక్ డైమండ్ ఎడిషన్ ధర రూ.2.49 లక్షలుగా ఉంది. రేంజ్‌లో అత్యంత ఖరీదైన యానివర్సరీ ఎడిషన్ ధర రూ.2.97 లక్షలు. BTO వేరియంట్ల ధరలు ఎంచుకునే కిట్, రంగును బట్టి మారుతాయి. ఇంజిన్, పనితీరులోనూ ఎలాంటి మార్పులు లేవు.

ఫీచర్లు కూడా వేరియంట్‌ను బట్టి మారుతాయి!

Advertisement

టీవీఎస్ అపాచీ RTR 310లో వేరియంట్‌ను బట్టి పలు ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అడ్జస్టబుల్ సస్పెన్షన్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), క్రూయిజ్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.  ముఖ్యంగా సెపాంగ్ బ్లూ రంగును బేస్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురావడం ఈ మోడల్‌పై ఆసక్తి ఉన్న కొనుగోలుదారులకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.

Read Also: భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

Tags

Related News

హోండా రెబెల్ 500 వచ్చేస్తోంది, కొత్త ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!

లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!

భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

Big Stories

Advertisement
×