E-Paper
Advertisement

Cars in India: ఇండియాలో 7 కూల్ కార్లు.. అద్భుతంగా ఉన్నా ఎక్కువ కాలం నిలబడలేదు!

Cars in India: ఇండియాలో 7 కూల్ కార్లు..  అద్భుతంగా ఉన్నా ఎక్కువ కాలం నిలబడలేదు!
Advertisement

భారతీయ కార్ల మార్కెట్ చాలా పెద్దది. ప్రతి ఏటా లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. వాటిలో ఇండియన్ కంపెనీ కార్లతో పాటు విదేశీ కార్లు కూడా ఉన్నాయి. దేశీ మార్కెట్లో కొన్ని కూల్ కార్లు ఎంట్రీ ఇచ్చాయి. తక్కువ ధర, మంచి లుక్ తో ఆకట్టుకున్నాయి. కానీ, కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. ఇంతకీ ఆ కార్లు ఏవి? ఎందుకు రాణించలేకపోయాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ టాటా నానో

భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా ‘పీపుల్స్ కార్’ పేరుతో కేవలం లక్ష రూపాయలకే కారు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. టాటా నానో పేరుతో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అప్పట్లో ఈ ప్రకటన సంచలనం కలిగించింది. కానీ, నిజంగానే లక్ష రూపాయలకు కారును తీసుకొచ్చారు. ఆ కాలంలో అత్యంత చౌకైన కారుగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, సింగూర్ ప్లాంట్ వివాదం కారణంగా ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా నానో కొంచెం ఎక్కువ ప్రారంభ ధరతో విడుదల అయ్యింది. కానీ, మార్కెట్ లో అంతగా రాణించలేకపోయింది.

⦿ మారుతి సుజుకి బాలెనో అల్టురా

Advertisement

బాలెనో సెడాన్ ఆధారంగా ఈ స్టేషన్ వ్యాగన్‌ను తయారు చేసింది మారుతి కంపెనీ. కానీ, భారతీయ కొనుగోలుదారులు అనుకున్న స్థాయిలో ఈ కారును ఆదరించలేదు. ఫలితంగా బాలెనో అల్టురా సైలెంట్ గా ఫేడౌట్ అయ్యింది. బాలెనో సెడాన్ మాత్రం మారుతి సుజుకికి బాగా కలిసి వచ్చింది. బాలెనో ఆల్టురా సెడాన్ అందించే ప్రతి ఫీచర్ ను ఇందులో తీసుకొచ్చింది.

⦿ షెవర్లెట్ SR-V

దేశీ కారు మార్కెట్ కేవలం A సెగ్మెంట్ హ్యాచ్‌ బ్యాక్‌లు, C సెగ్మెంట్ సెడాన్లపై దృష్టి సారించినప్పుడు.. షెవర్లెట్ SR-Vని తీసుకొచ్చింది. మంచి స్టైలింగ్, చక్కటి పని తీరుతో కూడిన ఈ స్పోర్టీ హ్యాచ్‌ బ్యాక్ బాగా ఆకట్టుకుంటుంది. అయితే, బ్రాండ్ పవర్ లేకపోవడం, తక్కువ ఇంధన సామర్థ్యం కారణంగా ఆదరణ కోల్పోయాయి. రోడ్డుపై అందరి దృష్టిని ఆకర్షించే స్టైలింగ్‌ తో ఉన్నా, అంతగా రాణించలేకపోయాయి.

⦿ శాన్ స్టార్మ్

Advertisement

గోవాకు చెందిన కార్ల సంస్థ రెండు డోర్ల కన్వర్టిబుల్ శాన్ స్టార్మ్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది తొలి స్వదేశీ కన్వర్టిబుల్ ఆరు. సరసమైన ధరకు ఓపెన్ టాప్ థ్రిల్‌ అందించింది. కానీ, పరిమిత సేఫ్టీ ఫీచర్లు, బలహీనమైన బిల్డ్ క్వాలిటీ,  పేలవమైన బ్రాండ్ వ్యాల్యూ కారణంగా రాణించలేకపోయింది.

⦿ వోక్స్‌ వ్యాగన్ బీటిల్

ప్రపంచ వ్యాప్తంగా ఐకాన్ కారుగా గుర్తింపు తెచ్చుకున్న బీటిల్.. భారత్ లో లైఫ్‌ స్టైల్ కారుగా అందుబాటులోకి వచ్చింది.  అధిక ధర, భారతీయ రోడ్లకు సరిపడని డిజైన్ ప్రతికూలంగా మారాయి. 2డోర్లు, వెనుక ఇంజిన్ ను కలిగిన ఈ హ్యాచ్‌ బ్యాక్ అందమైన రూపాన్ని కలిగి ఉన్నా, మెట్రో నగరాల సంపన్నులను మాత్రమే ఆకట్టుకోగలిగింది.

⦿ టయోటా సెరా

పరిమిత సంఖ్యలో దిగుమతి చేసుకున్న సెరా.. దాని బటర్ ఫ్లై డోర్లు ఆకట్టుకునేవి. కానీ, ఎక్కువ ఖర్చులు, సర్వీస్ సపోర్టు లేకపోవడం వల్ల పెద్దగా సక్సెస్ కాలేదు.

⦿ నిస్సాన్ 370Z

నిస్సాన్ 370Z పవర్ ఫుల్ V6 ఇంజిన్‌ తో కూడిన స్పోర్ట్స్ కారు.  దీనిని కొనుగోలుదారులు అంతగా ఇష్టపడలేదు. ఈ 2 డోర్ల స్పోర్ట్స్ కారు జపాన్‌, యూరోపియన్ మార్కెట్లలో కూడా రాణించలేదు. 2010లో దీని ప్రారంభ ధర రూ. 53.5 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది.

Read Also: ఏకంగా 10కి పైగా మోడల్స్.. 2026లో మహీంద్రా లాంచ్ లైనప్ మాములూగా లేదుగా!

Related News

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×