E-Paper
Advertisement

సేఫ్టీ To ఎంటర్‌టైన్‌మెంట్.. కారులో తప్పనిసరిగా ఉండాల్సిన 8 స్మార్ట్ గాడ్జెట్లు ఇవే!

సేఫ్టీ To ఎంటర్‌టైన్‌మెంట్.. కారులో తప్పనిసరిగా ఉండాల్సిన 8 స్మార్ట్ గాడ్జెట్లు ఇవే!
Advertisement

8 Smart Car Gadgets: ఈ రోజుల్లో కార్లు కేవలం ప్రయాణానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా, సరదాగా మార్చే పలు టెక్ గాడ్జెట్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని చిన్న గాడ్జెట్లు డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా పెద్దగా ఇన్‌ స్టాలేషన్ అవసరం లేకుండా సులభంగా యూజ్ చేసుకునే యాక్సెసరీస్ కు డిమాండ్ పెరుగుతోంది. అలాంటి వాటిలో టాప్ 8 గాడ్జెట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.అమెజాన్ ఎకో ఆటో

అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ ను ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీనిని కారులో అమర్చుకుంటే చేతులతో ఫోన్ తాకకుండా కాల్స్ చేయడం, పాటలు ప్లే చేయడం, రూట్లు తెలుసుకోవడం లాంటి పనులు వాయిస్ కమాండ్‌ లతో చెయ్యొచ్చు. రోడ్డు మీద ఎక్కువ సౌండ్ ఉన్నా డ్రైవర్ మాటలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంటుంది.

2.మ్యాగ్‌ సేఫ్ కార్ మౌంట్ ఛార్జర్

Advertisement

ఐఫోన్ వినియోగదారుల కోసం ఇది చాలా ఉపయోగకరమైన గాడ్జెట్. ఫోన్‌ను సురక్షితంగా పట్టుకోవడమే కాకుండా, అదే సమయంలో వైర్‌ లెస్ ఛార్జింగ్ కూడా అందిస్తుంది. గుంతలు ఉన్న రోడ్లపై ప్రయాణించినా ఫోన్ కదలకుండా ఉండేలా దీని మాగ్నెట్ పని చేస్తుంది.

3.బ్యాక్‌ సీట్ మల్టీ ఛార్జర్

కుటుంబంతో ప్రయాణించే వారికి, క్యాబ్ డ్రైవర్లకు ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది. వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ఒకేసారి పలు రకాల కేబుళ్లు అందుబాటులో ఉంటాయి.

4.డాష్ క్యామ్

Advertisement

డాష్ క్యామ్ ఇప్పుడు చాలా మంది కార్లలో తప్పనిసరి గాడ్జెట్ గా మారుతోంది. ప్రమాదాలు, ఇతర అనుకోని పరిస్థితుల్లో వీడియో ఆధారాలు అందించడానికి ఉపయోగపడుతుంది. హై రిజల్యూషన్ వీడియో రికార్డింగ్, వైడ్ యాంగిల్ వ్యూ లాంటి ఫీచర్లు ఈ గాడ్జెట్ లో ఉంటాయి.

5 OBD2 స్కానర్

కారులో ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే ముందుగానే తెలుసుకోవడానికి ఈ స్కానర్ ఉపయోగపడుతుంది. దీనిని కారులోని పోర్ట్‌ కు కనెక్ట్ చేస్తే మొబైల్ యాప్ ద్వారా వెహికల్ కు సంబంధిచిన పూర్తి సమాచారం అందిస్తుంది. చిన్న సమస్యలను ముందే గుర్తించడం వల్ల పెద్ద ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది.

6.టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్

టైర్లలో ఎయిర్ ప్రెజర్ సరిగా లేకపోతే ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది. ఈ గాడ్జెట్ నాలుగు టైర్ల గాలి ఒత్తిడి, ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఏదైనా అసాధారణ మార్పు ఉంటే వెంటనే హెచ్చరిస్తుంది.

7.స్మార్ట్ కార్ ఎయిర్ ఫ్రెషనర్

కారులో ఎప్పుడూ మంచి సువాసన ఉండాలని కోరుకునేవారికి ఇదో బెస్ట్ గాడ్జెట్. కారు ప్రయాణాన్ని మొదలు పెట్టగానే  ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే ఈ పరికరం, అవసరం లేని సమయంలో ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. దీంతో బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది.

8.బ్లూటూత్ కార్ స్పీకర్

పాత కార్లలో బ్లూటూత్ సౌకర్యం లేకపోతే ఈ గాడ్జెట్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా హ్యాండ్స్ ఫ్రీ కాల్స్, మ్యూజిక్ వినడం ఈజీ అవుతుంది. కారు స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఫోన్‌కు కనెక్ట్ అవడం దీని ప్రత్యేకత.

Read Also: మేలో అమ్మకాల్లో దూసుకెళ్లిన టాప్ టూవీలర్స్.. మళ్లీ టాప్ లో స్ప్లెండర్, యాక్టివా!

Related News

కొనుగోలుదారులకు టీవీఎస్ షాక్.. ఐక్యూబ్ సహా పలు స్కూటర్ల ధరలు భారీగా పెంపు!

ఇదేందయ్యా ఇది.. స్కూటీ రేటు రూ.లక్ష.. పెండింగ్ చలాన్లు మాత్రం రూ.10 లక్షలు!

కొత్త స్కార్పియో-N వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

టాటా ఎలక్ట్రిక్ కార్లపై సూపర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.35 లక్షల తగ్గింపు!

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

Big Stories

Advertisement
×