E-Paper
Advertisement

ఏబీఎస్ vs సీబీఎస్.. వర్షాకాలంలో బైక్‌కు ఏ బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్?

ఏబీఎస్ vs సీబీఎస్.. వర్షాకాలంలో బైక్‌కు ఏ బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్?
Advertisement

ABS vs CBS for Bikes: వర్షాకాలంలో బైక్ నడపడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. రోడ్లు తడిగా ఉండటంతో టైర్లకు రోడ్డు మీద పట్టు తగ్గుతుంది. ఎమర్జెన్సీగా  బ్రేక్ వేసినప్పుడు బైక్ అదుపు తప్పే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో బైక్‌లో ఉన్న బ్రేకింగ్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం చాలా బైక్‌లలో ఏబీఎస్, సీబీఎస్ అందుబాటులో ఉంది. అయితే, వర్షంలో ప్రయాణించేటప్పుడు ఈ రెండింటిలో ఏది ఎక్కువ సేఫ్టీ ఇస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఏబీఎస్ ఎలా పనిచేస్తుంది?

ఏబీఎస్ అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. బైక్‌కు ఒక్కసారిగా గట్టిగా బ్రేక్ వేసినప్పుడు వీల్స్ పూర్తిగా లాక్ కాకుండా ఈ సిస్టమ్ సాయపడుతుంది. ఇందుకోసం వీల్ స్పీడ్ సెన్సార్లు కంటిన్యూగా వీల్స్ వేగాన్ని గమనిస్తుంటాయి. వీల్ లాక్ అయ్యే పరిస్థితి వస్తే, ఏబీఎస్ బ్రేకింగ్ ప్రెజర్‌ను ఆటోమేటిక్‌గా తగ్గించి మళ్లీ అడ్జెస్ట్ చేస్తుంది. దీంతో టైర్లు రోడ్డుపై కొంత పట్టు కొనసాగించగలుగుతాయి. ముఖ్యంగా తడి రోడ్లపై అకస్మాత్తుగా బ్రేక్ వేసే సమయంలో బైక్ జారిపోయే ప్రమాదం తగ్గుతుంది.

సీబీఎస్‌లో ఏం జరుగుతుంది?

Advertisement

సీబీఎస్ అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. ఇందులో ఒక బ్రేక్‌ను ఉపయోగించినప్పుడు మరో చక్రానికి కూడా కొంత బ్రేకింగ్ ఫోర్స్ అందుతుంది. దీంతో సాధారణ పరిస్థితుల్లో బ్రేకింగ్ మరింత బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. అయితే, సీబీఎస్‌కు ఒక పరిమితి ఉంది. అకస్మాత్తుగా గట్టిగా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ కాకుండా సీబీఎస్ అడ్డుకోలేదు. అందుకే తడి, జారే రోడ్లపై ఎమర్జెన్సీ బ్రేకింగ్ విషయంలో ఏబీఎస్‌కు ఉన్నంత బెనిఫిట్ ఇందులో ఉండదు.

వర్షాకాలంలో ఏది మంచిది?

వర్షంలో రోడ్లు జారుడుగా మారినప్పుడు బైక్‌ను కంట్రోల్ చేయడం కాస్త కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో వీల్స్ లాక్ కాకుండా చూసే ఏబీఎస్ రైడర్‌కు అదనపు భద్రతను అందిస్తుంది. అందుకే వర్షాకాలంలో సీబీఎస్‌తో పోలిస్తే ఏబీఎస్ ఉన్న బైక్‌ను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తారు. అందులోనూ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ముందు, వెనుక రెండు వీల్స్ కు బ్రేకింగ్‌ను కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా హైవేలపై, ఎక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో దీని ఉపయోగం ఎక్కువగా ఉంటుంది.

బ్రేకులు మాత్రమే కాదు.. టైర్లు కూడా ముఖ్యం!

Advertisement

బైక్‌లో ఏబీఎస్ ఉన్నంత మాత్రాన ప్రమాదం పూర్తిగా తగ్గుతుందని భావించకూడదు. బ్రేక్ ప్యాడ్లు, బ్రేక్ షూలు, బ్రేక్ ఫ్లూయిడ్ లాంటి వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. అలాగే టైర్ల పరిస్థితిని కూడా గమనించాలి. టైర్ ట్రెడ్ బాగా అరిగిపోయి ఉంటే తడి రోడ్లపై పట్టు మరింత తగ్గుతుంది. డ్రమ్ బ్రేకులు ఉన్న బైక్‌లలో బ్రేక్ కేబుల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. వర్షాకాలం ప్రారంభానికి ముందే బైక్‌ను సర్వీస్ చేయించుకోవడం మంచిది.

Read Also: భారత సైన్యం ఇప్పటికీ బుల్లెట్‌ను ఎందుకు నమ్ముతుంది? ఇదీ అసలు కథ!

Tags

Related News

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×