E-Paper
Advertisement

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Aprilia SXR GT 125 and 175 Launched: ప్రీమియం స్కూటర్ విభాగంలో ఏప్రిలియా మరోసారి తన సత్తా చాటేందుకు  సిద్ధమైంది. కొత్తగా SXR GT 125, SXR GT 175 స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటి ప్రారంభ ధరలు  రూ.1.11 లక్షలు, రూ.1.31 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ రెండు మోడళ్లకు బుకింగ్స్ ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త స్కూటర్లతో ఏప్రిలియా గతంలో నిలిపివేసిన SXR మ్యాక్సీ స్కూటర్ లైనప్‌ ను తిరిగి తీసుకొచ్చినట్లయింది. ఈ ఏడాది మేలో SXR 125, SXR 160 మోడళ్లను ఎలాంటి ప్రకటన లేకుండానే మార్కెట్ నుంచి తొలగించారు. ఇప్పుడు వాటి స్థానాన్ని SXR GT సిరీస్ ను తీసుకొచ్చింది.

రెండు ఇంజన్ ఆప్షన్లలో SXR GT

SXR GT సిరీస్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో SXR GT 125కి 124.5cc సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇచ్చారు. ఇది 7,400rpm వద్ద 10.6hp పవర్, 6,200rpm దగ్గర 10.4Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక SXR GT 175లో 174.7cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 7,200rpm వద్ద 13.3hp పవర్, 6,000rpm దగ్గర 14.1Nm టార్క్‌ ను అందిస్తుంది. రెండు ఇంజన్లు BS6 OBD-II Stage B నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో పాటు E20 పెట్రోల్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి.

14 అంగుళాల వీల్స్ ప్రత్యేకత!

Advertisement

కొత్త SXR GT స్కూటర్ల డిజైన్‌ విషయంలో గత SXR మోడళ్ల రూపాన్ని కొనసాగించారు. అయితే, వీటిలో పెద్ద 14 అంగుళాల వీల్స్‌ ను అమర్చారు. పాత SXR స్కూటర్లలో 12 అంగుళాల వీల్స్ ఉండేవి.  పెద్ద వీల్స్ కారణంగా స్కూటర్‌ కు రోడ్డుపై మరింత స్థిరత్వం లభించడంతో పాటు రైడింగ్ సమయంలో సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది. SR 125, SR 175 మోడళ్లతో పంచుకునే ప్లాట్‌ ఫామ్‌పై ఈ కొత్త స్కూటర్లు తయారయ్యాయి.

SXR GT 175లో మరిన్ని ఫీచర్లు!

రెండు వేరియంట్లలో ఫీచర్ల విషయంలో కొంత తేడా ఉంది. SXR GT 175లో 5 అంగుళాల TFT డిస్‌ప్లే అందించారు. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటంతో మ్యూజిక్, కాల్స్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఇందులో ఉంటుంది. అలాగే హ్యాండిల్‌బార్‌పై అదనపు కంట్రోల్స్, సింగిల్ ఛానల్ ABS లాంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఎగ్జాస్ట్ ఎండ్ పైప్‌కు హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు.

SXR GT 125 ధర ఎంత?

Advertisement

SXR GT 125లో 5 అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. భద్రత కోసం CBS అందించారు. అయితే 175 మోడల్‌లో ఉన్న TFT, బ్లూటూత్ వంటి ఫీచర్లు 125 వేరియంట్‌లో లేవు. ధర విషయానికి వస్తే ఏప్రిలియా SXR GT 125 రూ.1.11 లక్షలు, SXR GT 175 రూ.1.31 లక్షలుగా నిర్ణయించారు. ఈ మోడల్స్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

Read Also: బజాజ్ పల్సర్ NS400Z న్యూ వెర్షన్ వచ్చేసింది.. TFT డిస్‌ ప్లేతో లుక్ అదిరిపోయిందిగా!

Tags

Related News

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

బజాజ్ పల్సర్ NS400Z న్యూ వెర్షన్ వచ్చేసింది.. TFT డిస్‌ ప్లేతో లుక్ అదిరిపోయిందిగా!

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ప్రీ బుకింగ్స్ షురూ.. లాంచింగ్ ఎప్పుడంటే?

జీప్ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.4 లక్షల తగ్గింపు!

కార్ల మార్కెట్‌లో పండుగ జోష్.. సెప్టెంబర్‌ అమ్మకాల్లో బిగ్ జంప్.. టాప్ కంపెనీల సేల్స్ ఇవే!

హోండా కొత్త అడ్వెంచర్ స్కూటర్‌కు బ్రేక్.. ADV160 డెలివరీలు వాయిదా!

Big Stories

Advertisement
×