E-Paper
Advertisement

EV Scooters Under Rs 50K: చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, జస్ట్ రూ. 50 వేలకే కొనేయొచ్చు!

EV Scooters Under Rs 50K:  చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, జస్ట్ రూ. 50 వేలకే కొనేయొచ్చు!
Advertisement

 Electric Scooters Under 50,000: భారతీయ మార్కెట్ లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరలో మంచి రేంజ్ ను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో రూ. 50 వేల లోపు ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి ప్రధానంగా తక్కువ వేగం కలిగిన మోడల్స్. గరిష్ట వేగం 25 కి.మీ వరకు ఉంటుంది. తక్కువ ప్రయాణాలకు, సిటీ రైడింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఇంతకీ ఆ స్కూటర్లు ఏవి? ఎంత రేంజ్ ను అందిస్తాయి? ఫీచర్లు ఎలా ఉన్నాయి? అనే పూర్తి వివరాలు చూద్దాం..

రూ. 50 వేల బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు  

⦿ విడా VX2: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ. 44,990. ఒకే ఛార్జ్ తో 100 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. గరిష్టంగా 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 100 శాతం ఛార్జింగ్ కావడానికి 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.

Advertisement

⦿ కోమాకి ఎక్స్ వన్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ధర సుమారు రూ. 34,999. ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ తో 85 నుంచి 100 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

⦿ యాకుజా రూబీ: ఈ స్కూటర్ సుమారు రూ. 35,280కి లభిస్తుంది. ఒకే ఛార్జ్ తో ఈ స్కూటర్ 55 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. గరిష్టంగా ఈ స్కూటర్  25 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. త్వరిత పనులకు సరసమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.

Advertisement

⦿ జెలియో ఈవా: ఈ స్కూటర్ ధర రూ. 50 వేలు. ఇది గరిష్టంగా 25 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ తో 90–100 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది.

⦿ ఉజాస్ ఈగో LA: ఈ స్కూటర్ దాదాపు రూ. 39,880 ధరతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇది ఒకే ఛార్జ్ తో 75 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.

⦿ NIJ ఆటోమోటివ్ యాక్సెలెరో R14: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 49,731. ఈ మోడల్ గరిష్టంగా 25 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకే ఛార్జ్ తో ఏకంగా 180 కిమీ పరిధిని అందిస్తుంది.

Read Also: ఇంట్లోనే కారు వాష్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయండి!

లో కాస్ట్ ఈవీ స్కూటర్ల గురించి కీలక అంశాలు

⦿ వేగం: రూ.50 వేల లోపు ఎలక్ట్రిక్ స్కూటర్లు 25 కిలో మీటర్ల గరిష్ట వేగానికి పరిమితం చేయబడ్డాయి. ఈ స్కూటర్లు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. బండి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.

⦿ బ్యాటరీ: వీటిలో ఎక్కువగా లెడ్ యాసిడ్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. కొన్ని లిథియం అయాన్ బ్యాటరీలతోనూ వస్తాయి.

⦿ ఈ స్కూటర్లు విద్యార్థులకు, తక్కువ దూరం ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటాయి.

Read Also: ఎలక్ట్రిక్ స్కూటర్‌ స్మూత్ గా నడవాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే!

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×