E-Paper
Advertisement

నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!
Advertisement

Waterless Car Wash: కారు శుభ్రంగా ఉండాలంటే తప్పనిసరిగా వాష్ చేయాలి. వాష్ చేయాలంటే నీళ్లు కావాలి. సాధారణంగా ఒక కారును వాష్ చేయడానికి దాదాపు 25 లీటర్ల నీరు అవసరం అవుతుంది. వేసవి కాలంలో నీటి కొరత తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో ఇది పెద్ద సమస్యగా మారుతుంది. పూణేకు చెందిన నితిన్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆయన కుటుంబానికి ఆటోమొబైల్ వ్యాపారం ఉంది. ప్రతి వేసవిలో బోర్లు ఎండిపోవడం, కార్లు కడగడానికి నీరు దొరకకపోవడంతో చాలా ఇబ్బంది పడేవారు. అప్పుడే నీటిని వెతకడం కంటే, కార్ వాష్‌కు నీటి అవసరమే లేకుండా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది.

రెండేళ్ల పాటు ప్రయోగాలు

ఆలోచన రావడం ఒక ఎత్తయితే, దాన్ని నిజం చేయడం మరో ఎత్తు. నీరు లేకుండా కారును శుభ్రం చేయగల క్లీనర్‌ ను తయారు చేయడానికి నితిన్ దాదాపు రెండేళ్ల పాటు ప్రయోగాలు చేశారు. ఈ సమయంలో సుమారు 600 రకాల ఫార్ములాలను పరీక్షించారు. ఒక్కోసారి ఆశించిన ఫలితం రాకపోయినా ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. ఈ ప్రయాణంలో కుటుంబం నుంచి పెద్దగా సపోర్టు రాలేదు. అయితే, నితిన్‌కు ఆయన భార్య అండగా నిలిచారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె తన నగలను సైతం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చింది. చివరకు ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆయనకు కావాల్సిన ఫార్ములా రెడీ అయ్యింది.

మొక్కల ఆధారిత క్లీనర్ తయారీ

Advertisement

నితిన్ తయారు చేసిన క్లీనర్‌ లో ఐదు రకాల మొక్కల సారాలను ఉపయోగించారు. ఇది కార్లను శుభ్రం చేయడంతో పాటు తుప్పు పట్టకుండా, ఫెస్టిసైడ్ లక్షణాలతో పనిచేసేలా రూపొందించారు. ఈ క్లీనర్‌లో ముఖ్యమైన విషయం దాని వినియోగ పరిమాణం. సాధారణ కార్ వాష్‌లో సుమారు 25 లీటర్ల నీరు ఉపయోగిస్తే, నితిన్ రూపొందించిన విధానంలో కేవలం 100 మిల్లీ లీటర్ల క్లీనర్‌ తో కారును శుభ్రం చేయవచ్చు. అంటే, నీటి వినియోగాన్ని భారీగా తగ్గించడమే ఈ విధానం ప్రధాన లక్ష్యం.

‘గో వాటర్‌ లెస్’ గా మారిన ఆలోచన

కుటుంబ వ్యాపారంలో ఎదురైన సమస్యకు పరిష్కారం కోసం మొదలైన ప్రయోగం తర్వాత ‘గో వాటర్‌ లెస్’ అనే స్టార్టప్‌ గా మారింది. ప్రారంభంలో చిన్న ప్రయత్నంగా కనిపించిన ఈ ఆలోచన ఇప్పుడు పెద్ద వ్యాపారంగా ఎదిగింది. ప్రస్తుతం ఈ సంస్థకు 22 రాష్ట్రాల్లో 214 ఫ్రాంచైజీలు ఉన్నాయి. దేశం బయట నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. సుమారు రూ.10 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన వ్యాపారం ఐదేళ్లలో దాదాపు రూ.10 కోట్ల స్థాయికి చేరుకుంది.

Advertisement

వ్యాపారం పెరగడం నితిన్‌ కు ఆనందమే అయినా, దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం మాత్రం నీటిని ఆదా చేయడం. ప్రతి కార్ వాష్‌లో కొంత నీటిని కాపాడగలిగితే, వేలాది కార్ల విషయంలో అది పెద్ద మొత్తంగా మారుతుందని ఆయన ఆలోచన. అనుకున్నట్లుగానే ఆయన చేసిన ప్రయత్నాలు, ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి.

Read Also: డస్టర్ To సెల్టోస్.. ఇండియన్ మార్కెట్లో హైబ్రిడ్ కార్ల జోరు!

Tags

Related News

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

Big Stories

Advertisement
×