E-Paper
Advertisement

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!
Advertisement

Jeep Compass 85th Anniversary Edition: జీప్ 85వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత మార్కెట్లో స్పెషల్  కంపాస్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. జీప్ కంపాస్ 85వ యానివర్సరీ ఎడిషన్ పేరుతో వచ్చిన ఈ SUV పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా కేవలం 85 యూనిట్లను అమ్మనున్నట్లు కంపెనీ తెలిపింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.26.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సాధారణ కంపాస్‌ తో పోలిస్తే ఇందులో కొన్ని ప్రత్యేకమైన డిజైన్ మార్పులు, అదనపు ఫీచర్లు ఉన్నాయి.

85 యూనిట్లకు మాత్రమే అవకాశం!

కంపాస్ 85వ యానివర్సరీ ఎడిషన్ ను పరిమిత సంఖ్యలో అందుబాటులోకి తీసుకొచ్చింది జీప్. దేశ వ్యాప్తంగా కేవలం 85 SUVలను మాత్రమే విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ మోడల్‌ పై ఆసక్తి ఉన్నవారు జీప్ ఇండియా అధికారిక వెబ్‌ సైట్ లేదంటే దగ్గర లోని జీప్ డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. పరిమిత సంఖ్య కారణంగా కలెక్టర్ ఎడిషన్ తరహాలో ఈ SUVకు ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది.

ఆకట్టుకుంటున్న స్పెషల్ ఎడిషన్!

Advertisement

సాధారణ కంపాస్‌కు భిన్నంగా కనిపించేలా బయట కొన్ని మార్పులు చేశారు. ఇందులో గ్లోస్ బ్లాక్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వీల్ హబ్ క్యాప్స్, డోర్లు, టెయిల్‌ గేట్‌ పై ‘85’ డీకాల్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ మార్పులు పెద్దగా కనిపించకపోయినా, SUVకు ప్రత్యేకమైన వార్షికోత్సవ ఎడిషన్ లుక్‌ను అందిస్తాయి. కారు లోపల పూర్తిగా బ్లాక్ థీమ్‌ను ఉపయోగించారు. దీనికి మాయన్ గోల్డ్ యాక్సెంట్స్ జోడించారు. బ్లాక్ లెదరెట్ సీట్లపై గోల్డ్ కలర్ స్టిచింగ్ ఉంటుంది. యాంబియంట్ లైటింగ్‌ లో గోల్డ్ హైలైట్స్, పనోరమిక్ సన్‌రూఫ్ చుట్టూ ఇల్యూమినేషన్ క్యాబిన్‌ను మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి.

అడిషనల్ యాక్సెసరీ ప్యాక్

జీప్ ఈ ఎడిషన్ కోసం ప్రత్యేకంగా 85వ యానివర్సరీ AXS యాక్సెసరీ ప్యాకేజీని కూడా అందిస్తోంది. ఇందులో డిజిటల్ IRVM, ముందు, వెనుక డాష్‌ క్యామ్‌లు, పనోరమిక్ సన్‌ రూఫ్‌ పై ఇల్యూమినేటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఈ యాక్సెసరీ ప్యాక్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

అదే 2.0 లీటర్ డీజిల్ ఇంజన్

Advertisement

మెకానికల్‌గా మాత్రం కంపాస్ స్పెషల్ ఎడిషన్‌లో పెద్ద మార్పులు లేవు. ఇందులో అదే 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కొనసాగుతుంది. ఈ ఇంజన్ 170bhp పవర్, 350Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ ఎంపికల్లో 6-స్పీడ్ మాన్యువల్, 9-స్పీడ్ ఆటోమేటిక్ ఉన్నాయి. ఆటోమేటిక్ వెర్షన్లు ప్రత్యేకంగా 4WD సిస్టమ్‌తో లభిస్తాయి.  జీప్ కంపాస్ 85వ యానివర్సరీ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ పరిమిత ఉత్పత్తి. 85 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో, సాధారణ కంపాస్ కంటే ప్రత్యేకమైన SUV కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Read Also: టాటా To మారుతి.. త్వరలో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Tags

Related News

టాటా To మారుతి.. త్వరలో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

27 కి.మీ మైలేజ్, సూపర్ సన్‌ రూఫ్.. మిడిల్ క్లాస్ ఫేవరెట్ టాటా కారు ఇదే!

అదిరిపోయే రేంజ్.. అంతకు మించి ఫీచర్లు.. ఈ 4 మోడళ్లపై ఓ లుక్కేయండి!

డస్టర్ To సెల్టోస్.. ఇండియన్ మార్కెట్లో హైబ్రిడ్ కార్ల జోరు!

హీరో ఇంపల్స్ మళ్లీ వస్తుందా? కొత్త పేటెంట్‌ తో చర్చ రచ్చే!

మారుతి కార్ల ధరలు పెంపు, ఆ మోడల్ పై ఏకంగా రూ. 30 వేలు జంప్!

కొత్త లుక్‌లో పల్సర్ 125, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×