E-Paper
Advertisement

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Advertisement

Yodha EPOD-Bharat Unveiled: ఎలక్ట్రిక్ రంగంలో కొత్త ప్రయోగాలు జరుగుతున్న సమయంలో యూధా మరో ఆసక్తికరమైన వెహికల్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. కంపెనీ తన ఫ్లాగ్‌ షిప్ L5 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్  ఆధారంగా ‘EPOD-భారత్’ అనే లిమిటెడ్ ఎడిషన్ ఆటో రిక్షాను ఆవిష్కరించింది. ఈ వెహికల్ ప్రత్యేకత కేవలం ఎలక్ట్రిక్ టెక్నాలజీ మాత్రమే కాదు. దీని మీద భారతీయ సంప్రదాయ కళను ప్రతిబింబించేలా చేతితో చిత్రాలు వేయడం విశేషం.

భారత్ మండపంలో ప్రత్యేక ప్రదర్శన!

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భారత్ వ్యాపార మహోత్సవంలో EPOD-భారత్‌ను ప్రదర్శించారు. దేశంలోని సంప్రదాయ హస్తకళలను ఆధునిక ఎలక్ట్రిక్ మొబిలిటీతో కలపాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించినట్లు యూధా తెలిపింది. వెహికల్ బయట భాగాన్ని వార్లీ కళ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. ఇందులో మహిళలు, గ్రామీణ జీవనం, ప్రకృతి, సామూహిక వేడుకలు లాంటి భారతీయ జీవనశైలిని ప్రతిబింబించే చిత్రాలను చూడవచ్చు.

సంప్రదాయ కళకు ఆధునిక రూపం

Advertisement

సాధారణంగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో డిజైన్ కంటే వినియోగం, మైలేజ్, నిర్వహణ ఖర్చులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే EPOD-భారత్ విషయంలో యూధా మరో అడుగు ముందుకేసింది. సంప్రదాయ భారతీయ కళను ఆధునిక ఎలక్ట్రిక్ వాహనంపైకి తీసుకురావడం ద్వారా దేశ వారసత్వాన్ని, భవిష్యత్తు మొబిలిటీని ఒకే వేదికపై చూపించాలని కంపెనీ భావిస్తోంది. అందుకే ఈ మోడల్ సాధారణ కమర్షియల్ వాహనాల కంటే ప్రత్యేకంగా కనిపిస్తుంది.

సింగిల్ ఛార్జ్ తో 227 కిలోమీటర్ల రేంజ్

EPOD-భారత్‌ లో 6 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 50 Nm టార్క్‌ ను అందిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 11.8 kWh LFP బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 227 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. సిటీ ప్రయాణాలకు అనుగుణంగా సిటీ, బూస్ట్ అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లు  ఉన్నాయి.

Advertisement

భారత రోడ్లను దృష్టిలో పెట్టుకుని..

మన దేశంలో అన్ని ప్రాంతాల్లో రోడ్లు ఒకే విధంగా ఉండవు. వర్షాలు, నీరు నిలిచే ప్రాంతాలు, గుంతలు వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని EPODను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనానికి 300 మిల్లీమీటర్ల వాటర్-వేడింగ్ సామర్థ్యం ఉంది. దీంతో వర్షాకాలంలో నీరు నిలిచిన రోడ్లపై కూడా వాహనాన్ని చక్కటగా నడిపే అవకాశం ఉంటుంది.

ధర ఎంత అంటే?

యూధా EPOD ప్రారంభ ధర రూ.3.20 లక్షలు అని ప్రకటించింది. ఈ వాహనాన్ని ముఖ్యంగా స్వయం ఉపాధి పొందుతున్న డ్రైవర్లు, మొబిలిటీ రంగంలో పనిచేసే చిన్న వ్యాపారవేత్తలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం, రోజువారీ ప్రయాణాలకు అనుకూలమైన రేంజ్ ఉండటం ఈ విభాగంలో కీలకంగా మారవచ్చు. EPODను ఉత్తరాఖండ్‌ లోని కాశీపూర్‌లో ఉన్న యూధా తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు.

Read Also: నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

Tags

Related News

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

Big Stories

Advertisement
×