E-Paper
Advertisement

కవాసకి W230 vs యమహా XSR155.. ఈ రెండు రెట్రో బైక్‌లలో ఏది బెస్ట్?

కవాసకి W230 vs యమహా XSR155.. ఈ రెండు రెట్రో బైక్‌లలో ఏది బెస్ట్?
Advertisement

Kawasaki W230 vs Yamaha XSR155: రెట్రో లుక్ ఉన్న బైక్‌లకు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. ఈ విభాగంలో కవాసకి W230, యమహా XSR155 మంచి గుర్తింపు పొందాయి. ఈ రెండు బైక్ లు పాతకాలపు డిజైన్‌, ఆధునిక టెక్నాలజీతో మిక్స్ అయి ఉన్నాయి. అయితే, వాటి డిజైన్ విధానం పూర్తిగా భిన్నంగా ఉంది. W230 చూస్తే పాతకాలపు మోటార్‌సైకిల్ గుర్తుకు వస్తుంది. XSR155 మాత్రం రెట్రో టచ్‌ తో పాటు ఆధునిక స్పోర్టీ ఫీల్‌ను ఇస్తుంది. ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్రంట్ లుక్ స్టైల్ లో ఏది బాగుంటుంది?

కవాసకి W230 ముందు భాగంలో గుండ్రని LED హెడ్‌ లైట్ ఉంటుంది. దీన్ని పాత బల్బ్ హెడ్‌ లైట్‌ లా కనిపించేలా డిజైన్ చేశారు. గుండ్రని ఇండికేటర్లు, బాక్సీ టెయిల్ ల్యాంప్ కూడా ఇదే రెట్రో థీమ్‌ను కొనసాగిస్తాయి. అయితే, W230లో ఆకట్టుకునే అంశం దాని ట్విన్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్, టాకోమీటర్‌ తో పాటు అవసరమైన సమాచారం కోసం చిన్న డిజిటల్ డిస్‌ ప్లే ఉంటుంది. పాతకాలపు బైక్‌ల ఫీల్ కోరుకునే వారికి ఇది బాగా నచ్చే అంశం. XSR155లో కూడా రౌండ్ LED హెడ్‌లైట్ ఉంది. అయితే, ఇందులో పూర్తిగా డిజిటల్ సింగిల్ పాడ్ కన్సోల్ ఉంటుంది. స్పీడోమీటర్, టాకోమీటర్‌ తో పాటు గేర్ పొజిషన్, మైలేజ్ లాంటి వివరాలు కనిపిస్తాయి. స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ ద్వారా కాల్, SMS అలర్ట్‌ లను కూడా పొందే అవకాశం ఉంటుంది.

క్లాసిక్ వర్సెస్ మోడ్రన్

Advertisement

W230 వెనుక భాగం పూర్తిగా పాతకాలపు స్టైల్ ను కొనసాగిస్తుంది. బాక్సీ టెయిల్ ల్యాంప్, సింగిల్ పీస్ సీటు, క్రోమ్ ఫెండర్ లాంటివి 1960ల కాలం నాటి కవాసకి  W1ను గుర్తు చేస్తాయి. XSR155 మాత్రం సింపుల్‌ గా ఉన్నప్పటికీ ఆధునికంగా కనిపిస్తుంది. ఇందులో రౌండ్ ఆకారంలో LED టెయిల్ ల్యాంప్, సన్నని LED ఇండికేటర్లు ఉన్నాయి. దీని వెనుక భాగం స్పోర్టీగా ఉంటుంది.

మరి ఏ బైక్ ఎవరికి బెస్ట్?

ఈ రెండు బైక్‌ల ఉద్దేశం ఒకటే అయినా,   పూర్తిగా క్లాసిక్ లుక్, అనలాగ్ డయల్స్, క్రోమ్ ఫినిషింగ్, పాతకాలపు డిజైన్ కావాలనుకునే వారికి W230 నచ్చే అవకాశం ఎక్కువ. మరోవైపు, రెట్రో లుక్‌తో పాటు ఆధునిక టెక్నాలజీ, డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్పోర్టీ డిజైన్ కోరుకునేవారికి XSR155 మంచి ఎంపికగా కనిపిస్తుంది. పనితీరు విషయంలో కూడా XSR155 ముందుంటుంది. W230 మాత్రం కూల్ రైడింగ్‌ను కోరుకునే వారికి సరిపోతుంది. అయితే, కవాసకి W230 ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో లేదు. ఇలాంటి ఎయిర్ కూల్డ్ రెట్రో బైక్ కోసం చూస్తున్న కొనుగోలుదారులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

Advertisement

Read Also: నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

Tags

Related News

నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టిన స్పైకర్.. అదిరిపోయే సూపర్‌ కార్‌ తో రీఎంట్రీ!

ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!

టాటా To మారుతి.. త్వరలో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

27 కి.మీ మైలేజ్, సూపర్ సన్‌ రూఫ్.. మిడిల్ క్లాస్ ఫేవరెట్ టాటా కారు ఇదే!

అదిరిపోయే రేంజ్.. అంతకు మించి ఫీచర్లు.. ఈ 4 మోడళ్లపై ఓ లుక్కేయండి!

Big Stories

Advertisement
×