E-Paper
Advertisement

బైక్ రైడర్ హెల్మెట్‌ మీద ఇలా చెయ్యి పెడితే అలర్ట్ అవ్వాల్సిందే.. ఎందుకంటే?

బైక్ రైడర్ హెల్మెట్‌ మీద ఇలా చెయ్యి పెడితే అలర్ట్ అవ్వాల్సిందే.. ఎందుకంటే?
Advertisement

Biker Helmet Tap Signal: రోడ్డు మీద బైక్ నడిపేటప్పుడు ఇతర రైడర్లతో మాట్లాడటం అంత ఈజీ కాదు. ఇంజిన్ సౌండ్,  గాలి వేగం, ట్రాఫిక్ కారణంగా మాటలు సరిగా వినిపించవు. అందుకే బైక్ రైడర్లు చాలా సందర్భాల్లో హ్యాండ్ సిగ్నల్స్ ద్వారా అలర్ట్ చేస్తుంటారు. అయితే, ఓ రైడర్ తన ఎడమ చేతితో హెల్మెట్ పై భాగాన్ని టచ్ చేయడం చాలామందికి ఆసక్తికరంగా ఉంటుంది. అసలు ఈ సిగ్నల్ అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

హెల్మెట్‌ మీద టచ్ చేయడం ఎందుకు?

మోటార్‌ సైకిల్ సేఫ్టీ ఫౌండేషన్ ప్రకారం, హెల్మెట్‌ పై చేతితో తట్టడం అనేది సాధారణంగా హై బీమ్ హెడ్‌ లైట్లకు సంబంధించిన సిగ్నల్ గా భావిస్తారు. అయితే, రైడర్ల మధ్య నెమ్మదిగా ఈ సిగ్నల్ కు మరో అర్థం వచ్చింది. ఎదురుగా వచ్చే, వెనుక నుంచి వచ్చే ఇతర రైడర్లకు ముందున్న పరిస్థితి గురించి హెచ్చరించడానికి హెల్మెట్ పైభాగాన్ని తట్టుతారు. సాధారణంగా ఈ సంకేతం కనిపిస్తే, ముందు జాగ్రత్తగా ఉండండి అనే అర్థంలో తీసుకుంటారు.

 పోలీసులు, స్పీడ్ చెక్ ఉండొచ్చు!

Advertisement

చాలా మంది బైక్ రైడర్లు హెల్మెట్‌ పై తట్టే సిగ్నల్ ను ముందున్న ప్రాంతంలో పోలీసులు ఉన్నారని, స్పీడ్ చెకింగ్ జరుగుతోందని హెచ్చరికగా ఉపయోగిస్తారు. కార్ల డ్రైవర్లు ఎదురుగా వచ్చే వాహనాలకు హెడ్‌ లైట్లు ఫ్లాష్ చేసి హెచ్చరించినట్లే, బైక్ రైడర్లు హ్యాండ్ సిగ్నల్ తో సమాచారం అందిస్తారు.  అయితే, ప్రతి ప్రాంతంలో ఈ సిగ్నల్ కు ఒకే అర్థం ఉండకపోవచ్చు. కొందరు రైడర్లు దీనిని సాధారణంగా ముందు జాగ్రత్తగా ఉండండి అనే అర్థంలోనే ఉపయోగిస్తారు. అందువల్ల రైడింగ్ గ్రూ ప్‌లో ముందుగానే సంకేతాల అర్థాలపై మాట్లాడుకోవడం మంచిది.

గ్రూప్ రైడ్‌ లో ఉపయోగించే ఇతర సిగ్నల్స్  

గ్రూప్‌గా బైక్ రైడ్‌కు వెళ్లినప్పుడు హ్యాండ్ సిగ్నల్స్ చాలా ఉపయోగపడతాయి. ఒకే లేన్‌ లో సింగిల్ ఫైల్‌ గా వెళ్లాల్సి వస్తే, గ్రూప్ లీడర్ ఒక వేలును చూపిస్తూ ఎడమ చేతిని పైకి ఎత్తవచ్చు. తిరిగి రెండు వరుసల్లో ప్రయాణించవచ్చని చెప్పడానికి రెండు వేళ్లను చూపిస్తారు. ముందున్న రైడర్ తన చేతిని చాచి అరచేతిని పదేపదే తెరిచి మూస్తే, మీ టర్న్ ఇండికేటర్‌ను చెక్ చేసుకోవాలని సూచిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇండికేటర్ అవసరం లేకపోయినా ఆన్‌ లో ఉండిపోతే, వెనుక రైడర్లకు గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.

రోడ్డుపై ప్రమాదాల హెచ్చరిక

Advertisement

రోడ్డు మీద గుంతలు, రాళ్లు, చెత్త, ఆయిల్ లాంటి లిక్వడ్స్ లాంటి ప్రమాదకరమైన వస్తువులు ఉండవచ్చు. ఇవి వెనుక వచ్చే రైడర్లకు చెప్పడం కూడా ముఖ్యం. ప్రమాదం ఎడమవైపు ఉంటే, ఎడమ చేతితో దాని వైపు చూపించడం సాధారణ పద్ధతి. కుడివైపు ప్రమాదం ఉంటే, కొన్ని సందర్భాల్లో కుడి కాలుతో ఆ వైపు చూపిస్తారు. దీంతో వెనుక వచ్చే రైడర్లు ముందుగానే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.

హెల్మెట్ మీద టచ్ చేయడం చట్టవిరుద్ధమా?

ముందు పోలీసుల చెకింగ్, స్పీడ్ చెకింగ్ ఉందని తోటి రైడర్లకు సంకేతం ఇవ్వడం సాధారణంగా నేరంగా భావిస్తారు. కానీ, స్థానిక ట్రాఫిక్ నిబంధనలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. హెల్మెట్‌పై తట్టడం అనే సిగ్నల్ ముందున్న పరిస్థితిపై అప్రమత్తంగా ఉండమనే సందేశంగా కూడా భావించవచ్చు. అందువల్ల, వేగం తగ్గించి, రోడ్డు మీద మరింత జాగ్రత్తగా వెళ్లడం మంచిది.

Read Also: విండ్‌షీల్డ్‌ సైడ్ లో నల్ల చుక్కలు.. వామ్మో.. వీటితో ఇన్ని లాభాలున్నాయా?

Tags

Related News

హోండా రెబెల్ 500 వచ్చేస్తోంది, కొత్త ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!

టీవీఎస్ అపాచీ RTR 310లో కొత్త అప్‌డేట్.. ఫీచర్లు, ఇంజిన్, ధరలు ఎలా ఉన్నాయంటే?

లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!

భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

Big Stories

Advertisement
×