E-Paper
Advertisement

స్కిట్ మొత్తం నైటీలతోనే.. రచ్చ చేసిన సెలబ్రిటీస్!

స్కిట్ మొత్తం నైటీలతోనే.. రచ్చ చేసిన సెలబ్రిటీస్!
Advertisement

TV: బీరువా నిండా ఎన్ని పట్టు చీరలు ఉన్నా.. రకరకాల ఫ్యాన్సీ చీరలు కొనుగోలు చేసినా.. భర్తని హింసించి ఖరీదైన దుస్తులు కొనుగోలు చేసినా.. ఆడవాళ్లు అత్యంత ప్రీతికరంగా మెచ్చేది నైటీనే. నైటీనే మా ప్రాణం అంటారు ఆడవాళ్లు. అయితే ఆ నైటీలే ఇప్పుడు తెరపై ప్రత్యక్షమైతే.. చూసే ఆడియన్స్ పరిస్థితి ఏంటి?.. అసలే ఇంట్లో నిత్యం నైటీలతో అటూ ఇటూ తిరుగుతూ చిరాకు తెప్పించే భార్యలను చూడాలంటేనే విసుగు వచ్చే ఈ రోజుల్లో.. అటు సెలబ్రిటీలైనా కలర్ఫుల్ డ్రెస్లతో ఆకట్టుకుంటారు అంటే.. వారు కూడా నైటీలతో దర్శనమిచ్చారేంటి? మాకేంటి ఈ కర్మ? అంటూ నెటిజన్స్ ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

స్కిట్ మొత్తం నైటీలతోనే రచ్చ..

జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకొని.. టీం లీడర్ గా ఎదిగి, ఆ తర్వాత సినిమాలలో హీరోగా సత్తా చాటిన సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పలు షోలతో మళ్ళీ సందడి చేస్తున్నారు.. ఇప్పటికే డ్రామా జూనియర్స్ తో సందడి చేసిన ఈయన.. ఇప్పుడు మరో కొత్త షో సరిగమప లో కూడా ఆకట్టుకోబోతున్నారు.. అలాగే ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా అందులో లేడీ కంటెస్టెంట్స్ మొత్తం నైటీలలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. రోహిణి, అషు రెడ్డి, స్రవంతి, మహేశ్వరి, శిరీష, పవిత్ర, సత్య శ్రీ ఇలా చాలామంది నైటీలలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

లేడీస్ హాస్టల్ లో నైటీల రచ్చ..

Advertisement

ఫ్యామిలీ సార్ సీజన్ 2 నుంచీ విడుదల చేసిన లేటెస్ట్ ప్రోమో లో నైటీ ధరించిన రోహిణి మాట్లాడుతూ.. వీళ్లంతా నా పిల్లలే అంటూ షాక్ ఇచ్చింది. హాస్టల్లో అమ్మాయిలు ఎలా ఉంటారు అనే విషయాన్ని స్కిట్ రూపంలో వీరు చేసి చూపించారు. దానికి హాస్టల్ వార్డెన్ గా రోహిణి వ్యవహరించింది. సుదీర్ మాట్లాడుతూ..” మీ హాస్టల్ పేరేంటి?” అని అడగగా ‘అబ్బా సిగ్గు.. లేడీస్ హాస్టల్’ అంటూ తన హాస్టల్ పేరు చెప్పుకొచ్చింది. అందులో పవిత్ర హాస్టల్లో అమ్మాయిలు నైటీ ధరించి..జుట్టు ఆరబోసుకుంటున్నట్టు నటించింది. తర్వాత ఒక్కొక్కరు నైటీలలో తమ పర్ఫామెన్స్ చూపించారు. మధ్యలో నూకరాజు నైటీ వేసుకొని తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేశారు. నూకరాజు నైటీ వేసుకుని రాగానే నీ ముఖం చూపించమని సుధీర్ అడిగితే .. నువ్వు ముఖం చూస్తావా అంటూ రెచ్చిపోయారు.

ALSO READ:అగ్నిపరీక్ష జడ్జెస్ ను ఏకిపారేసిన గీతూ రాయల్.. రూల్స్ తెలుసా?

ఈ రేంజ్ ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదుగా..

Advertisement

సుధీర్ అంతటితో ఆగకుండా ఈ నైటీలో మిమ్మల్ని చూడాలంటే చిరాకేస్తోంది అంటూ చెప్పగా.. ఇక నైటీలో ఉన్న సెలెబ్రెటీలంతా కోపంతో ఊగిపోయారు.. తన మన బేధం లేకుండా తళుక్కుమనే పట్టుచీరలు ఉన్నా తలా అని వేసుకునేదే రా ఈ నైటీ.. నైటీ వేసుకుని బయటకు వస్తే మీకేం ప్రాబ్లం గా అనిపించదా? అని మళ్లీ సుధీర్ అడిగితే.. ఎందుకు భయం వేయదు అంటూ.. ఆడవారిని అంటిపెట్టుకొని ఉండే నైటీస్ కి ఈరోజు ఇచ్చేద్దాం గౌరవం అంటూ ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. ఇక అషూ రెడ్డి మాట్లాడుతూ..” ఇప్పటివరకు నీ మీద ఒకటే రూమర్ వచ్చింది. అది నిజమా? కాదా? అని ప్రశ్నించగా.. మధ్యలో నూకరాజు కలగజేసుకొని..”తరగతి గది దాటి..వీ వాంట్ ఆర్ ఆర్ కథలు” అంటూ నవ్వించారు. మొత్తానికైతే ప్రోమో ఆకట్టుకుంటుంది.

Related News

రామ్ ప్రసాద్ బిహేవియర్ మార్చుకో.. అపూర్వ గుట్టు బయటపెట్టిన శాలిని!

అర్ధరాత్రిళ్లు ఏంటా పనులు.. శాలిని, రోహిత్‌లకు షాకిచ్చిన నాగ్, ఝాన్సీ కన్నీళ్లు!

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Big Stories

Advertisement
×