E-Paper
Advertisement

భారత్ లోకి BYD Ti7 భారీ SUVఎంట్రీ.. ఫార్చ్యూనర్‌ కు పోటీ తప్పదా?

భారత్ లోకి BYD Ti7 భారీ SUVఎంట్రీ.. ఫార్చ్యూనర్‌ కు పోటీ తప్పదా?
Advertisement

BYD Ti7 Revealed: చైనా ఆటో కంపెనీ BYD తాజాగా Ti7 అనే కొత్త పెద్ద SUVను ఆవిష్కరించింది. ఇది సాధారణ ఎలక్ట్రిక్ వెహికల్ కాదు. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించింది. ఈ SUV భారత మార్కెట్లో సత్తా చాటాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా EVలపై ఎక్కువ దృష్టి పెట్టిన చైనా కంపెనీలు, ఇప్పుడు ఫ్యామిలీ వినియోగానికి సరిపోయే పెద్ద SUVలపైనా దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగానే BYD Ti7 మోడల్ లాంచ్ అయ్యింది.

పెద్ద పరిమాణంలో BYD Ti7

ఈ SUV సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. దీని పొడవు 5.1 మీటర్లకు పైగా ఉండటంతో, రోడ్లపై ఇది భారీ SUVలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏడు సీట్ల సదుపాయం ఉండటం వల్ల పెద్ద కుటుంబాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. స్టైలింగ్ పరంగా కూడా బలమైన SUV డిజైన్‌ ను BYD ఇందులో ఉపయోగించింది. ఫ్రంట్ లుక్, పెద్ద వీల్స్, బోల్డ్ బాడీ లైన్స్ దీన్ని ప్రీమియం SUVగా నిలబెట్టనున్నాయి.

BYD Ti7 పవర్‌ ట్రెయిన్

Advertisement

ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లతో కలిపి అందించారు. అదనంగా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఫలితంగా SUVకు మంచి పవర్‌ తో పాటు మెరుగైన పనితీరు లభిస్తుంది. కంపెనీ వెల్లడించిన  వివరాల ప్రకారం, Ti7 కేవలం ఐదు సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. భారీ SUV అయినప్పటికీ ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం విశేషం.

ఎలక్ట్రిక్ మోడ్‌లో సుమారు 127 కి.మీ ప్రయాణం

ఈ SUV పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌ లోనే సుమారు 127 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని BYD వెల్లడించింది. అంటే రోజువారీ నగర ప్రయాణాలను పెట్రోల్ ఉపయోగించకుండా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. దీర్ఘ ప్రయాణాల సమయంలో మాత్రం పెట్రోల్ ఇంజన్ సహాయపడుతుంది. అందుకే ఈ తరహా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వాహనాలు ప్రస్తుతం చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

భారత మార్కెట్ లో సత్తా చాటేనా?

Advertisement

భారత మార్కెట్లో Ti7కు సత్తాచాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం EVలపై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, ఛార్జింగ్ స్టేషన్లు, లాంగ్ డ్రైవ్‌ లపై ఇంకా కొంతమందికి  అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫార్చ్యూనర్ లాంటి పెద్ద SUVలు కొనుగోలు చేసే కస్టమర్లు ఎక్కువగా  సుదూర ప్రయాణాలు చేస్తుంటారు. అలాంటి వారికి పూర్తిగా EV కంటే హైబ్రిడ్ SUV మరింత ఉపయోగకరంగా అనిపించే అవకాశం ఉంది. అయితే Ti7 భారత్ కు వస్తే దాని ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయి ప్రీమియం SUV కావడంతో, దిగుమతి రూపంలో వస్తే ధర చాలా ఎక్కువగా ఉండనుంది.  అమ్మకాల సంఖ్య పరిమితంగానే ఉండొచ్చు. అయినప్పటికీ BYD బ్రాండ్ ఇమేజ్‌ ను పెంచడంలో ఈ SUV కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Read Also: స్కోడా నుంచి ఎంట్రీ లెవల్ ఈవీ లాంచ్.. రేంజ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఏముంది గురూ!

Big Stories

Advertisement
×