E-Paper
Advertisement

సమ్మర్ లో బైక్ రైడింగ్.. ఈ 5 సెఫ్టీ టిప్స్ ఫాలో అవ్వండి

సమ్మర్ లో బైక్ రైడింగ్.. ఈ 5 సెఫ్టీ టిప్స్ ఫాలో అవ్వండి
Advertisement

Summer Bike Riding Tips:సమ్మర్ లో బైక్ రైడింగ్ అంటే సాహసమే అని చెప్పాలి. రోడ్లు చూస్తుంటే.. వేడి పెనంలా కనిపిస్తున్నాయి. ఈ వేడిలో మిమ్మల్ని, మీ వాహనాన్ని సేఫ్ ఉంచుకోవడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. డీహైడ్రేషన్ కాకుండా చూసుకోండి- వేసవి ప్రయాణాల్లో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. డీహైడ్రేషన్ కాకుండా వాహనదారులు.. కొబ్బరి నీళ్లు, చెరకు రసం లేదా ఓఆర్‌ఎస్‌ ను తాగడం మంచిది. దీంతో ఎప్పటికప్పుడు శరీర హైడ్రేషన్ ఎనర్జీ బ్యాలెన్స్ గా ఉంటుంది.

Advertisement

2. ప్రమాణ సమయాల్లో మార్పు- సాధారణంగా, పగటిపూట ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. వీలైతే, వాహనదారులు ఉదయం లేదా సాయంత్ర సమయాల్లో ప్రయాణాలు చేయడం మంచిది.

3. బైక్ కండీషన్ ను చెక్ చేయండి – వేసవి ఉష్ణోగ్రతలు మీ బైక్ పై ప్రభావితం చూపుతాయి. అధిక వేడికి టైర్లలోని గాలి ఒత్తిడికి లోనవుతుంది. దీంతో ఒక్కసారి టైర్లు బరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే టైర్ల ఎయిర్ ప్రెషర్ ను చెక్ చేస్తూ ఉండండి. వేసవిలో కూలెంట్ లెవల్స్, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఫ్లూయిడ్స్, కేబుల్స్ ను చెక్ చేస్తూ ఉండడం మంచిది.

Advertisement

4. సెఫ్టీ జాకెట్లు – సమ్మర్ రైడింగ్ లో సెఫ్టీ జాకెట్ల విషయంలో రాజీపడకూడదు. వేసవికి అనువైన అనేక వివిధ రకాల రైడింగ్ గేర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రైడర్ కు గాలి తగిలేలా వెంటిలేషన్‌కు వీలు కల్పించేలా మెష్ జాకెట్లను ఎంచుకోవచ్చు. సమ్మర్ లో వినియోగానికి అనువుగా ఉండే గ్లౌజులు, రైడింగ్ బూట్లను ధరించాలి.

5. పర్సనల్ హెల్త్- సమ్మర్ రైడింగ్ సమయంలో ఆరోగ్యం సహకరించకపోతే, కాస్త బ్రేక్ తీసుకోవడం బెటర్. అలసిపోడవం, కండరాల నొప్పులు, దృష్టి మసకబారడం లేదా తల తిరగడం వంటి సంకేతాలను ఏమైనా ఉన్నాయా అనేది గమనిస్తూ ఉండండి. ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే, సరైన ఆహారం తీసుకోండి. ఫాస్ట్ ఫుడ్ లేదా కారాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అవి ప్రయాణ సమయంలో అసౌకర్యాన్ని కలిగించవచ్చు.

Also Read: బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా? పెట్రోల్ బంక్ కి వెళ్లాలంటేనే భయం వేస్తుందా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీ బైక్ ని మైలేజ్ కింగ్ చేసేయండి!

Tags

Related News

కొత్త బాలెనో ధరలు వచ్చేశాయ్.. హైదరాబాద్‌లో టాప్ వేరియంట్ రేట్ ఎంతంటే?

క్రెటా To అల్కాజార్.. హ్యుందాయ్ SUVలకు అదిరిపోయే లాంజ్ టచ్!

1,000 కి.మీ.కి పైగా రేంజ్.. మహీంద్రా XUV 7XO హైబ్రిడ్ వచ్చేస్తోంది!

కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!

178 కి.మీ రేంజ్.. 75 కి.మీ స్పీడ్.. BGauss కొత్త స్కూటర్ ఏముంది భయ్యా!

అక్టోబర్‌లో కొత్త కార్ల జాతర.. హోండా నుంచి హ్యుందాయ్ వరకు అదిరిపోయే మోడళ్లు ఇవే!

ఐఫోన్ 18 డ్యూయో ఫోన్‌కి రూ.4.5 లక్షలా? అదే ధరలో దొరికే 5 కొత్త కార్లు ఇవే!

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

Big Stories

Advertisement
×